E-Paper
Advertisement

Smart TV Speed Up Tips: టీవీ పదే పదే స్లో అవుతోందా? ఈ 5 పనులతో కొత్తదానిలా మార్చేయండి!

Smart TV Speed Up Tips: టీవీ పదే పదే స్లో అవుతోందా? ఈ 5 పనులతో కొత్తదానిలా మార్చేయండి!
Advertisement

Smart TV Speed Up Tips: కొన్నిసార్లు ఇంట్లో ఉన్న పాత స్మార్ట్ టీవీ పిక్చర్ క్వాలిటీ బాగున్నా.. వాడేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంటుంది. యాప్స్ ఓపెన్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం, మెనూలు నొక్కినప్పుడు బఫరింగ్ అవ్వడం, మధ్య మధ్యలో స్ట్రీమింగ్ ఆగిపోవడం వంటి సమస్యలను తరచూ ఎదురవుతుంటాయి. అయితే అంత మాత్రానికే ఆ టీవీని మార్చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా టీవీ స్క్రీన్, స్పీకర్లు పదేళ్ల పైనే పనిచేస్తాయి, కానీ సాఫ్ట్‌వేర్ మాత్రం పాతబడిపోతుంది. ఈ నేపథ్యంలో కొత్త టీవీ కొనకుండానే  పాత టీవీ స్పీడ్‌ను మళ్లీ ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ట్రీమింగ్ డివైజ్ వాడాలి:

సాధారణంగా టీవీ స్లోగా ఉండటానికి ప్రధాన కారణం దానిలో ఉన్న పాత ప్రాసెసర్. దీనికి బదులుగా ఒక కొత్త రోకు, ఫైర్ స్టిక్ లేదా గూగుల్ టీవీ వంటి స్ట్రీమింగ్ పరికరాన్ని HDMI పోర్ట్‌కు కనెక్ట్ చేయండి. తద్వారా టీవీ కేవలం ఓ స్క్రీన్‌లా మాత్రమే పనిచేస్తుంది. మిగతా పనులన్నీ ఆ చిన్న స్టిక్ చూసుకుంటుంది. ఇది చాలా వేగంగా ఉండటమే కాకుండా లేటెస్ట్ యాప్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలి:

Advertisement

స్మార్ట్‌ఫోన్స్ మాదిరిగానే టీవీలకు కూడా కంపెనీలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తుంటాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఒకసారి సిస్టమ్ అప్‌డేట్ చెక్ చేసుకోండి. కొత్త వెర్షన్ అందుబాటులో ఉంటే వెంటనే ఇన్‌స్టాల్ చేసుకోండి. దీంతో టీవీలో ఉండే చిన్న చిన్న బగ్స్ తొలగిపోయి పనితీరు మెరుగుపడుతుంది. ఒకవేళ మీ టీవీ మరీ పాతదైతే అప్‌డేట్స్ రాకపోవచ్చు. అప్పుడు స్ట్రీమింగ్ స్టిక్ వాడటమే బెటర్.

Also Read: భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంచ్.. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్స్, ఐఫోన్ రేంజ్ డిస్‌ప్లే!

అనవసరమైన యాప్స్‌ను తొలగించాలి:

Advertisement

టీవీలో స్టోరేజ్ నిండిపోతే స్పీడ్ తగ్గుతుంది. అందుకే మీరు వాడని యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి. అలాగే అప్పుడప్పుడు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘కాష్’ (Cache) క్లియర్ చేయడం వల్ల మెమరీ ఖాళీ అవుతుంది. ఇది టీవీని వేగంగా స్పందించేలా చేస్తుంది.

వై-ఫై బదులు కేబుల్ వాడొచ్చు:

వై-ఫై సిగ్నల్స్ సరిగ్గా అందకపోయినా వీడియోలు బఫరింగ్ అవుతాయి. అందుకే మీ టీవీకి వెనుక ఉండే ఇథర్నెట్ పోర్ట్‌ను ఉపయోగించి నేరుగా ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేయండి. వై-ఫైతో పోలిస్తే వైర్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ చాలా వేగంగా ఉంటుంది. తద్వారా హై క్వాలిటీ వీడియోలు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ప్లే అవుతాయి.

హోమ్ స్క్రీన్‌ను మారుస్తుండాలి:

చూడటానికి కొత్తదానిలా అనిపించాలంటే మీ టీవీ హోమ్ స్క్రీన్‌ను మార్చుకోవాలి. రోజువారీ వాడే యాప్స్‌ను మాత్రమే ముందు వరుసలో పెట్టుకుని, మిగతా వాటిని తీసేయండి. ఇలా చేయడం వల్ల టీవీ చూడటానికి కొత్తగా ఉండటమే కాకుండా, మీకు కావలసిన యాప్‌ను వెతుక్కునే పని ఉండదు. ఈ చిన్న మార్పులు మీ పాత టీవీని మళ్లీ కొత్తదానిలా మారుస్తాయి.

Also Read: ఇవి కార్లా లేక మైలేజ్ మెషీన్లా? ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేయనున్న 8 హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×