
Preethi Sharma ( Source / Instagram )
ఈమధ్య సినిమా హీరోయిన్ల కన్నా కూడా టీవీ సీరియల్స్లలో నటిస్తున్న ముద్దుగుమ్మలకు ఫాలోయింగ్ ఎక్కువే. ఎక్కువమంది వీళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళ సీరియల్స్ ని వీక్షిస్తూ ఉంటారు. అయితే సీరియల్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో ప్రీతీ శర్మ ఒకరు.

Preethi Sharma ( Source / Instagram )
ప్రీతి శర్మ తమిళ సీరియల్ నటి. తెలుగులో కూడా పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.. తెలుగు తమిళంలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..

Preethi Sharma ( Source / Instagram )
పదవ తరగతి వరకు చదువుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చదువుకి గుడ్ బై చెప్పేసింది. కేవలం మోడలింగ్ పై ఫోకస్ పెట్టి టీవీలలో, సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంది. ప్రీతి శర్మ తిరుమానం, ది హార్వెస్ట్ చిత్రాల్లో నటించింది. 2017లో మిస్ హ్యాండ్లూమ్ పోటీలో మూడో బహుమతిని గెలుచుకుంది..

Preethi Sharma ( Source / Instagram )
తమిళ ఇండస్ట్రీలో సీరియల్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అలాగే జీ తెలుగు ధారావాహిక పడమటిసంధ్యారాగంలో ఆధ్యగా మెప్పించింది.. ప్రస్తుతం జీ తెలుగులో పరిశీలిస్తున్న లో నటిస్తూ బిజీగా ఉంది..

Preethi Sharma ( Source / Instagram )
జీ తెలుగులో మాత్రమే కాదు అటు జెమినీ టీవీలో కూడా కావ్యాంజలి అనే సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ నటి అయినా కూడా తెలుగులో తన అభినయం, అందంకి జనాలు ఫీదా అవుతున్నారు..

Preethi Sharma ( Source / Instagram )
ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత బిజీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు ఏమో ఒక ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన ఇంస్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ సారీ లోని పిక్స్ ని షేర్ చేసుకుంది.. ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..