E-Paper
Advertisement

ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పొడవుగా ఉంటే.. ఛార్జ్ స్లోగా ఎక్కుతుందా? టెక్ నిపుణులు చెప్పిన సీక్రెట్ ఇదే!

ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పొడవుగా ఉంటే.. ఛార్జ్ స్లోగా ఎక్కుతుందా? టెక్ నిపుణులు చెప్పిన సీక్రెట్ ఇదే!
Advertisement

iPhone Vs Android: రోజూ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుంటాం కానీ, ఆ కేబుల్ పొడవు గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అసలు కంపెనీలు ఒక మీటర్ లేదా ఒకటిన్నర మీటర్ పొడవున్న వైర్లనే ఎందుకు ఇస్తాయి? ఎందుకంటే.. ఆ పొడవు అయితేనే మనం వాడుకోవడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా, బ్యాగులో పెట్టుకోవాలన్నా పెద్దగా చిక్కులు పడదు. అయితే.. మనం వాడే బ్రాండ్‌ను బట్టి ఈ పొడవులో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు బాక్సులో వచ్చే కేబుల్ దాదాపు ఒక మీటర్ ఉంటుంది. బెడ్ పక్కన ప్లగ్ ఉంటే ఓకే కానీ, కాస్త దూరంగా ఉంటే మాత్రం ఇబ్బంది పడతాం. అందుకే చాలామంది విడిగా 2 మీటర్ల కేబుల్స్ కొంటుంటారు. సోఫాలో కూర్చుని లేదా బెడ్ మీద అటు ఇటు తిరుగుతూ ఫోన్ వాడేవాళ్లకు ఈ పొడవాటి కేబుల్స్ బాగా పనికొస్తాయి.

Advertisement

Also Read: మడతపెట్టే ఫోన్లలో మోటరోలా సరికొత్త ప్రయోగం.. Razr Fold భారత్‌లోకి వచ్చేస్తోంది, మీరు రెడీయా?

నిజానికి పొడవు విషయంలో ఐఫోన్‌కు, ఆండ్రాయిడ్‌కు పెద్ద తేడా ఉండదు. రెండూ కూడా ఒక మీటర్ కేబుల్‌నే ఇస్తాయి. కాకపోతే ఐఫోన్ వాళ్లు ప్యాకేజింగ్ చాలా చిన్నగా, సింపుల్‌గా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్లు కేబుల్ సైజు పెంచరు. ఇక ఆండ్రాయిడ్ కంపెనీల విషయానికొస్తే.. వాళ్ల ఫోకస్ అంతా ఛార్జింగ్ స్పీడ్‌ మీదే ఉంటుంది. అందుకే ఆండ్రాయిడ్ కేబుల్స్ ఐఫోన్ కేబుల్స్ కంటే కాస్త లావుగా, గట్టిగా కనిపిస్తాయి.

Advertisement

వైర్ పొడవు పెరిగితే ఛార్జింగ్ స్లో అవుతుందా? ఇది చాలామందికి తెలియని విషయం. వైర్ మరీ పొడవుగా ఉంటే విద్యుత్ ప్రవాహంలో వేగం తగ్గి, ఫోన్ నిదానంగా ఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునే వాళ్లు చిన్న కేబుల్స్ వాడటమే మంచిది. పైగా చిన్నవి అయితే త్వరగా పాడవవు. కంపెనీలు కూడా ఖర్చు తగ్గించుకోవడానికి, నాణ్యత కాపాడటానికి ఒక మీటర్ పొడవుకే ప్రాధాన్యత ఇస్తాయి.

ప్లగ్ పాయింట్ దూరంగా ఉండి ఇబ్బందిగా అనిపిస్తే.. తప్పకుండా 2 మీటర్ల కేబుల్ కొనుక్కోవచ్చు. కాకపోతే రోడ్డు మీద దొరికే లోకల్ కేబుల్స్ కాకుండా, మంచి బ్రాండెడ్ కేబుల్స్ తీసుకోండి. లేదంటే ఫోన్ బ్యాటరీ పాడయ్యే ప్రమాదం ఉంది. కంఫర్ట్ ముఖ్యం అనుకుంటే పెద్ద కేబుల్, స్పీడ్ ముఖ్యం అనుకుంటే చిన్న కేబుల్ వాడటం బెస్ట్ ఐడియా.

Also Read: యాపిల్ లవర్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. అదిరిపోయే డిజైన్‌తో ప్రైడ్ ఎడిషన్ బ్యాండ్, ఆ 11 రంగుల ప్రత్యేకత ఏమిటంటే?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×