E-Paper
Advertisement

అట్లీ – బన్నీ ‘రాకా’ రిలీజ్‌పై కొత్త టాక్.. ప్లానింగ్ ఇదేనా?

అట్లీ – బన్నీ ‘రాకా’ రిలీజ్‌పై కొత్త టాక్.. ప్లానింగ్ ఇదేనా?
Advertisement

Raaka Movie: గంగోత్రి సినిమాతో మొదలైన అల్లు అర్జున్ సినీ ప్రయాణం నేడు గ్లోబల్ స్థాయికి చేరుకుంది. అందులో భాగంగానే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించడమే కాకుండా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అవతరించారు అల్లు అర్జున్. అలాంటి ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం రాకా. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అల్లు అర్జున్ లుక్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా, విలన్ గా రెండు పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ పై కొత్త టాక్ వినిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రాకా రిలీజ్ డేట్ పై కొత్త టాక్..

భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. భారీ వీ ఎఫ్ ఎక్స్ పనుల కారణంగా ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి తర్వాత విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం షూటింగు తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. వేసవి తర్వాత సినిమాను ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవ్వడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఇండియన్ బాక్సాఫీస్ కి సమ్మర్ హాలిడేస్ అతిపెద్ద కీలకం. అలాంటిది ఈ హాలిడేస్ ను క్యాష్ చేసుకోకుండా సెలవుల తర్వాత రిలీజ్ చేస్తే ఫలితం ఏమంటుంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి చిత్ర బృందం అభిమానుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకుంటారేమో చూడాలి.

Advertisement

ALSO READ:అగధ టీజర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచేసిన టీమ్!

సినిమా కాదు.. నా జీవితంలో భాగం..

ఇదిలా ఉండగా.. మరొకవైపు డైరెక్టర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. రాకా అనేది కేవలం సినిమా మాత్రమే కాదు.. 18 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న ఒక ఆలోచన. ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆ కథను ఎక్కడా నేను వదిలిపెట్టలేదు. నా జీవితంలో ఈ సినిమా ఒక భాగం. కేవలం ఇది ఆరంభం మాత్రమే అంటూ ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఇకపోతే రాకా సినిమా విషయంలో అల్లు అర్జున్ క్యారెక్టర్రైజేషన్ , స్క్రీన్ ప్రజెంట్స్ ని సినిమా ట్రెండ్ గా మార్చాలని మేకర్స్ భావిస్తున్నారట. పుష్పరాజ్ లాగా రాకా కూడా దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. అల్లు అర్జున్ నుదుటిపై కనిపిస్తున్న గుర్తులు వైకింగ్ టాటూలను పోలి ఉండడం చూస్తుంటే ఇది ఒక ఇంటర్ యాక్షన్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×