E-Paper
Advertisement

కరెంట్ ఆఫీసర్ల పిల్లి మొగ్గలు.. భయంతో రాత్రికి రాత్రే రైతు డిస్కంపై పుట్టిన ప్రేమ!

కరెంట్ ఆఫీసర్ల పిల్లి మొగ్గలు.. భయంతో రాత్రికి రాత్రే రైతు డిస్కంపై పుట్టిన ప్రేమ!
Advertisement

Rythu DISCOM: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యుత్ రంగంలో ఒకప్పుడు ఉద్యోగులు వెళ్లడానికి తీవ్రంగా నిరాకరించిన ‘రైతు డిస్కం’ వైపు ఇప్పుడు భారీగా మొగ్గు చూపుతున్నారు. గతంలో డిప్యూటేషన్‌పై వెళ్లడానికే ససేమిరా అన్న ఉద్యోగులు, ఇప్పుడు అక్కడ చేరేందుకు పోటీ పడుతుండటం విద్యుత్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రైతు డిస్కంలో చేరాలని యాజమాన్యం కోరిన సమయంలో ఉద్యోగుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. కొత్త విభాగంలో పనిభారం, సౌకర్యాలు, సర్వీస్ రూల్స్‌పై స్పష్టత లేకపోవడంతో వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. కనీసం తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై పంపేందుకు ప్రయత్నించినా ఉద్యోగులు రకరకాల కారణాలతో వెనుకంజ వేశారు. రైతు డిస్కంలో ఖాళీల భర్తీ, పదోన్నతుల ప్రకటన వెలువడటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇక్కడ చేరితే త్వరగా ప్రమోషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఉద్యోగులు ఇప్పుడు పోటీ పడి మరీ అప్లికేషన్లు సమర్పిస్తున్నారు. కెరీర్ ఎదుగుదలకు ఇదొక సువర్ణావకాశంగా భావించి కీలక అధికారులు సైతం దరఖాస్తు చేసుకున్నారు.

గతంలో వద్దు అన్నవారే..

రైతు డిస్కంకు భారీ స్థాయిలో దరఖాస్తులు రావడం వెనుక కేవలం ప్రమోషన్లే కాదు, ప్రైవేటీకరణ భయాలు కూడా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఎన్పీడీసీఎల్), సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఎస్పీడీసీఎల్) లు భవిష్యత్తులో ప్రైవేట్ పరమవుతాయనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమై.. ప్రధాన డిస్కములు ప్రైవేటీకరణ వైపు వెళ్తే ప్రభుత్వ పరిధిలోనే ఉండే రైతు డిస్కం సురక్షితంగా ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ భద్రత కోసమే ఇటువైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే గతంలో వద్దు అన్నవారే.. ఇప్పుడు రైతుడిస్కం ముద్దు అంటూ రైతు డిస్కంలో చేరేందుకు పైస్థాయిలో ఒత్తిళ్లు తెస్తుండటం విద్యుత్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రమోషన్ల ఆశలు, ప్రైవేట్ భయాల నడుమ రానున్న రోజుల్లో ఈ బదిలీల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisement

Also Read: సీఎం రేవంత్ రెడ్డి గ్రామంలో ఐదు ఎకరాల ఏటీసీ సెంటర్..!

ఎన్పీడీసీఎల్ నుంచి..

రైతు డిస్కంలో వివిధ స్థాయిల్లో 511 పోస్టులు అవసరముండగా ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ నుంచి వాటిని భర్తీ చేయాలని సంస్థ భావించింది. తొలుత సంస్థ నిర్మాణానికి ప్రారంభదశలో కొద్దిమందిని డిప్యూటేషన్ పై తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్పీడీసీఎల్ నుంచి అవసరమైన మొత్తంలో డిప్యూటేషన్ కు ఉద్యోగులు వచ్చినా.. ఎస్పీడీసీఎల్ నుంచి మాత్రం చేరేందుకు నిరాకరించారు. ఎస్పీడీసీఎల్ నుంచి 55 మందిని డిప్యూటేషన్ కోసం అడిగితే 39 మందిని మాత్రమే అలాట్ చేశారు.. కానీ అందులో చాలామంది రిపోర్ట్ కూడా చేయలేదు. కానీ ప్రమోషన్లు అంటూ ప్రకటించడంతో ఇప్పుడు రైతు డిస్కంలో చేరేందుకు భారీ స్థాయిలో ఎగబడుతున్నారు.

మొత్తం 511 పోస్టులు

Advertisement

రైతుడిస్కం పరిధి పెద్దగా ఉండటం కూడా ఎక్కువ మంది అధికారులు ఎంచుకోవడానికి కారణంగా తెలుస్తోంది. రైతు డిస్కం ఎస్ఈ పరిధి కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాకో ఎస్ఈ ఉంటారు.ప్రస్తుత జిల్లాకో డీఈ ఇన్ చార్జీగా ఉంటారు. అంటే సీఈల పరిధి కూడా చాలా పెద్దది. ఎస్పీడీసీఎల్ పరిధి మొత్తం ఒక సీఈ ఇన్ చార్జీగా ఉంటారు. ఎన్పీడీసీఎల్ కి కూడా ఒక సీఈ ఇన్ చార్జీగా ఉంటారు. రైతుడిస్కంకు ప్రస్తుతం మొత్తం 511 పోస్టులు కావాల్సి ఉండగా వాటికి 1254 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం మీద చూస్తే ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్న ఏఈ, ఏడీఈ పోస్టులకు, సివిల్ విభాగంలో ఏఈఈ పోస్టులకు భారీగా పోటీ నెలకొంది.

Also Read: కండోమ్ చూసి షాకైన ఆ ప్రియుడు.. ఆపై మత్తు విరిగిపోయింది

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×