E-Paper
Advertisement

Snapdragon vs Dimensity: ఒకప్పుడు స్నాప్‌డ్రాగన్.. ఇప్పుడు డైమెన్సిటీ.. ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌లో మొదలైన పోరు

Snapdragon vs Dimensity: ఒకప్పుడు స్నాప్‌డ్రాగన్.. ఇప్పుడు డైమెన్సిటీ.. ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌లో మొదలైన పోరు
Advertisement

Snapdragon vs Dimensity: ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ప్రపంచంలో గత కొన్నేళ్లుగా ఒకే పేరు వినిపించేది.. అదే ‘స్నాప్‌డ్రాగన్’. టాప్ ఫోన్ అంటే కచ్చితంగా క్వాల్కమ్ చిప్ ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ 2025 నాటికి ఈ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. మీడియాటెక్ తన ‘డైమెన్సిటీ 9400’ చిప్‌సెట్‌తో నేరుగా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌కు గట్టి సవాల్ విసురుతోంది. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫోన్ తీసుకునేవారు కేవలం బ్రాండ్ పేరు చూసి కాకుండా, అసలైన పనితీరును బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు.

పర్‌ఫార్మన్స్‌లో గట్టి పోటీ

Advertisement

పర్‌ఫార్మన్స్‌లో అసలైన పోటీ సాధారణంగా స్నాప్‌డ్రాగన్ చిప్స్ యాప్స్ ఓపెన్ చేయడంలో, భారీ పనులను వేగంగా పూర్తి చేయడంలో ముందుంటాయి. కొత్తగా వచ్చిన ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్’ తన కస్టమ్ ఓరియన్ కోర్లతో అద్భుతమైన వేగాన్ని అందిస్తోంది. అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మల్టీ-కోర్ పర్‌ఫార్మెన్స్‌లో ఇది స్నాప్‌డ్రాగన్‌కు అత్యంత సమీపంలోకి వచ్చేసింది. సాధారణంగా ఫోన్ వాడే వ్యక్తికి ఈ రెండింటి మధ్య తేడా కనిపెట్టడం ఇప్పుడు దాదాపు అసాధ్యం. అంతలా మీడియాటెక్ తన ప్రమాణాలను పెంచుకుంది.

గేమింగ్, గ్రాఫిక్స్ అనుభవం

Advertisement

గేమింగ్, గ్రాఫిక్స్ గేమింగ్ అనగానే అందరికీ స్నాప్‌డ్రాగన్‌లోని ‘అడ్రినో’ గ్రాఫిక్సే గుర్తుకు వస్తాయి. గేమ్‌ డెవలపర్లు కూడా స్నాప్‌డ్రాగన్‌కు అనుగుణంగానే గేమ్స్‌ను ఎక్కువగా ఆప్టిమైజ్ చేస్తారు. అయితే డైమెన్సిటీ 9400 లోని కొత్త గ్రాఫిక్స్ కార్డ్ రే-ట్రేసింగ్ వంటి ఫీచర్లతో విజువల్స్ అదిరిపోయేలా ఇస్తోంది. బెంచ్‌మార్క్ స్కోర్లలో డైమెన్సిటీ కొన్నిసార్లు స్నాప్‌డ్రాగన్‌ను సైతం వెనక్కి నెడుతోంది. గ్రాఫిక్స్ పరంగా చూస్తే ఇప్పుడు ఈ రెండూ ఒకే స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు.

Also Read: Vivo Y500i: 7200mAh బ్యాటరీతో వివో వై500ఐ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే బాస్..

బ్యాటరీ లైఫ్, హీటింగ్ సమస్యలు

బెంచ్‌మార్క్ నంబర్ల కంటే జీవితంలో బ్యాటరీ ఎంతసేపు వస్తుందన్నదే ముఖ్యం. డైమెన్సిటీ 9400 పవర్ ఎఫిషియెన్సీకి ప్రాధాన్యత ఇస్తుంది, కాబట్టి భారీ పనులు చేసినా ఫోన్ త్వరగా వేడెక్కదు, బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది. అదే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ అత్యంత వేగాన్ని అందించినప్పటికీ, ఎక్కువ పవర్ వాడటం వల్ల ఫోన్ త్వరగా హీట్ అయ్యే అవకాశం ఉంది. క్లియర్‌గా చెప్పాలంటే, మీకు కూల్‌గా ఉండే ఫోన్, ఎంత సేపు వాడిన బ్యాటరీ లైఫ్ కావాలంటే డైమెన్సిటీ, టాప్ పర్‌ఫార్మెన్స్ కావాలంటే స్నాప్‌డ్రాగన్ సరైనదిగా చెప్పొచ్చు.

కెమెరా, ఏఐ (AI) ఫీచర్లు

కెమెరా క్వాలిటీ అనేది కేవలం లెన్స్ మీద మాత్రమే కాదు, లోపల ఉండే చిప్‌సెట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ తన ‘ఐఎస్‌పి’ (Image Signal Processor) ఏఐ ఇంజిన్‌తో ఫోటోలను చాలా సహజంగా, వివరంగా చూపిస్తుంది. అందుకే టాప్ కెమెరా ఫోన్లు ఇప్పటికీ స్నాప్‌డ్రాగన్‌కే ప్రాధాన్యం ఇస్తాయి. అయితే డైమెన్సిటీ కూడా ఏఐ ఫీచర్లను భారీగా జోడించింది. వీడియో ఎడిటింగ్, ఆబ్జెక్ట్ రిమూవల్ వంటి పనులను డైమెన్సిటీ చిప్స్ చాలా వేగంగా చేస్తున్నాయి.

ఏది ఎంచుకోవాలి?

ఒకప్పుడు స్నాప్‌డ్రాగన్ లేకపోతే అది ఫ్లాగ్‌షిప్ ఫోనే కాదు అనుకునేవారు. కానీ ఇప్పుడు డైమెన్సిటీ చిప్స్ ఆ భ్రమను తొలగించాయి. మీకు ప్యూర్ గేమింగ్ పవర్, బెస్ట్ కెమెరా ప్రాసెసింగ్ కావాలంటే ఇప్పటికీ స్నాప్‌డ్రాగన్ నంబర్ వన్. కానీ మీకు ఫోన్ చల్లగా ఉండాలి, బ్యాటరీ ఎక్కువ రావాలి, అలాగే తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ పవర్‌ కావాలంటే డైమెన్సిటీ సరైన ఎంపిక. బ్రాండ్ పేరు కంటే కూడా మీ అవసరానికి ఏది సెట్ అవుతుందో చూసుకోవడమే మంచిది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×