
Solar Eruption : అంతరిక్షంలో సౌర విస్ఫోటనం అనేది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. దాని వల్ల ఇతర గ్రహాలపై ఒక్కొక్కసారి ప్రభావం పడుతుంది. సౌర విస్ఫోటనం వల్ల ఉష్ణోగ్రత అనేది విపరీతంగా పెరిగిపోతోంది. భూమిపై అగ్నిపర్వతం బద్దలయినప్పుడు ఎలా ఉంటుందో.. అంతరిక్షంలో విస్ఫోటనం జరిగినప్పుడు కూడా చూడడానికి అలాగే ఉంటుంది. ఆరేళ్ల క్రితం అంతరిక్షంలో జరిగిన విస్ఫోటనం గురించి ఆస్ట్రానాట్స్ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
2017 జులైలో అంతరిక్షంలో ఒక సోలార్ ఎరప్షన్ జరిగింది. ఆరేళ్ల క్రితం జరిగినా కూడా దీని ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పులు రాలేదని చూసి ఆస్ట్రానాట్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ విస్ఫోటనం జరిగినప్పటి నుండి ఆస్ట్రానాట్స్ దీనిని గమనిస్తూనే ఉన్నారు. ఇందులోని మారుతున్న ఎనర్జీపై దృష్టిపెట్టి ఉన్నారు. కానీ అప్పటి నుండి ఇప్పటివరకు ఒకే విధంగా ఉష్ణోగ్రత ఉండడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమని వారు తెలిపారు.
ఆ సమయంలో సోలార్ కరోనా నుండి ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ మ్యాగ్నెట్ ఉన్న ప్లాస్మా విస్ఫోటనం చెందింది. అయితే ఎప్పటిలాగే జరిగిన విస్ఫోటనం లాగా కాకుండా దీనికొక ప్రత్యేకత ఉందని ఆస్ట్రానాట్స్ భావిస్తున్నారు. అందుకే దీనిపై పరిశోధనలు నిర్వహిస్తే.. సౌర విస్ఫోటనం వల్ల భూమిపై ఎలాంటి ప్రభావం పడుతుంది అని తెలుసుకునే అవకాశం ఉంటుందని వారు అనుకుంటున్నారు. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ (సీఎమ్మీ)లు శాటిలైట్లపై, భూమిపై ఉన్న ఇతర టెక్నాలజీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయని వారు తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సీఎమ్మీలకు ఉన్న శక్తి వల్ల తన సొంత మ్యాగ్నటిక్ ఫీల్డ్‌పై మాత్రమే కాకుండా భూమి మ్యాగ్నటిక్ ఫీల్డ్‌పై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. దీని వల్లే ఎలక్ట్రికల్ బ్లాక్ ఔట్స్, రేడియో ట్రాన్స్‌మిషన్స్‌లో భంగం కలగడం లాంటివి జరుగుతుంటాయని ఆస్ట్రానాట్స్ తెలిపారు. కానీ 2017లో జరిగిన విస్ఫోటనం వల్ల అలాంటివి ఏమీ జరగలేదని అన్నారు. అంతే కాకుండా ఇప్పటివరకు ఉష్ణోగ్రత ఒకేలా ఉండడానికి కారణం ఏంటో కూడా కనిపెట్టే పనిలో నిమగ్నమయిన్నారు.