Shahid Kapoor: సాధారణంగా ప్రతి ఒక్క రంగంలో కూడా వారసత్వం కొనసాగడం సర్వసాధారణం. తల్లితండ్రులు ఏ వృత్తిలో అయితే కొనసాగుతున్నారో పిల్లలు కూడా దాదాపు అదే వృత్తిలో రావాలని తల్లితండ్రులు భావించడమేకాకుండా వారిని కూడా అదే మార్గంలో తీసుకు వెళ్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరంగంలో కూడా నెపోటిజం(Nepotism) అనేది ఉంది. అయితే ఇది సినిమాలలో కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది నెపో కిడ్స్(Nepo Kids) హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అయితే తరచూ వీరిపై ఎన్నో రకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీలో కేవలం నెపోకిడ్స్ కు మాత్రమే అవకాశాలు ఉంటాయని కొత్త వారికి అవకాశాలు ఉండవు అని వాదన కూడా వినపడుతూ ఉంటుంది అయితే సినీ వారసత్వం ఉన్నవారు కేవలం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే వారసత్వం పనికి వస్తుంది తప్ప వారిని స్టార్స్ గా నిలబెట్టడానికి కాదని చెప్పాలి. ఇలా ఎంతోమంది సెలెబ్రెటీలు వారి పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకువస్తున్నారు. అయితే తాజాగా నటుడు షాహిద్ కపూర్(Shahid Kapoor) తన పిల్లలను ఇండస్ట్రీలోకి రావడం తనకు ఇష్టం లేదు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.
తాజాగా షాహిద్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. తన పిల్లలు తనని అనుసరిస్తూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని తాను అనుకోవడం లేదని తెలిపారు. నాకు మామూలుగా ఏ విషయంలోను పెద్దగా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు కానీ, నా ఇద్దరు పిల్లలు మాత్రం ప్రతి ఒక్క విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, అందుకే వారిద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి రాకూడదని నేను కోరుకుంటానని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇండస్ట్రీలో ఎత్తు పల్లాలు ఉంటాయని, వాటన్నింటిని అధిగమించి సక్సెస్ కావడం కష్టమని షాహిద్ కపూర్ తెలిపారు.
పంకజ్ కపూర్ వారసుడిగా..
ఇక ఈయన కూడా ఇండస్ట్రీకి నెపోకిడ్ గానే అడుగుపెట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ కపూర్(Pankaj Kapoor), కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా సినీ వారసత్వం నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తన పిల్లలు మాత్రం ఇండస్ట్రీలోకి రాకూడదని కోరుకుంటున్నాను అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షాహిద్ కపూర్ వయసులో తన కట్టే 13 సంవత్సరాలు చిన్నది అయిన మీరా రాజ్ పుత్ (Meera Raj puth)తో 2015 వ సంవత్సరంలో ఏడడుగులు వేశారు. ఈ దంపతులు ఆగస్టు 2016లో మిషాకు,అలాగే సెప్టెంబర్ 2018లో కుమారుడు జైన్‌కు జన్మనిచ్చారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన తన పిల్లలు ఇండస్ట్రీలోకి రావడం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Nani -Sujeeth: ఘనంగా నాని సుజీత్ కొత్త సినిమా పూజ వేడుక..మరో హిట్ లోడింగ్!