CM Revanth Reddy: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‍లో కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి కొండారెడ్డి పల్లి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు సీఎం ర్యాలీగా వచ్చారు. ర్యాలీలో రేవంత్ రెడ్డిపై గ్రామస్థులు పూల వర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు.
గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం గ్రామంలో జరిగే శమీ పూజ, దసరా ఉత్సవాల్లో సీఎం కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు కొండారెడ్డిపల్లి నుంచి కొండగల్ కు తిరిగి వెళ్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొండారెడ్డిపల్లిలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో స్వగ్రామంలో దసరా వేడుకలు చేసుకోవడం ఇది రెండోసారి. గతేడాది సీఎం హోదాలో మొదటిసారి స్వగ్రామానికి వచ్చిన ఆయన గ్రామ పంచాయతీ బిల్డింగ్, సోలార్ విద్యుత్ పనులను ప్రారంభించారు.
Also Read: Telangana politics: మొదలైన స్థానిక ఎన్నికల వేడి.. సీఎం రేవంత్ కీలక భేటీ, ఏడున అభ్యర్థుల ప్రకటన
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు.