BigTV English

Smartphone Comparison: ఐఫోన్ 17 ప్రో vs పిక్సెల్ 10 ప్రో vs షావోమీ 15 అల్ట్రా.. ఏది బెస్ట్?

Smartphone Comparison: ఐఫోన్ 17 ప్రో vs పిక్సెల్ 10 ప్రో vs షావోమీ 15 అల్ట్రా.. ఏది బెస్ట్?

iPhone 17 Pro vs Google Pixel 10 Pro vs Xiaomi 15 Ultra| ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా iPhone 17 Proను లాంచ్ చేసింది. ఈ ప్రీమియం ఫోన్.. నేరుగా గూగుల్ పిక్సిల్ 10 ప్రో (Google Pixel 10 Pro), షావోమీ 15 అల్ట్రా (Xiaomi 15 Ultra) లాంటి హై ఎండ్ ఫోన్లతో పోటీ పడుతోంది.


మూడ ఫోన్‌లో కూడా అడ్వాన్స్ హార్డ్‌వేర్, ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ధర, డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్, కెమెరాలు, ఇతర అన్నీ స్పెక్స్ వివరాలు పోల్చి ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.

ధర, స్టోరేజ్

ఆపిల్ iPhone 17 Pro 256GB మోడల్‌ను ₹1,34,900కి లాంచ్ చేసింది. 512GB మోడల్ ₹1,54,900 ధరకు ఉంది. Google Pixel 10 Pro 16GB+256GB ₹1,09,999కి అందుబాటులో ఉంది. Xiaomi 15 Ultra 16GB+512GB కూడా ₹1,09,999కి ఉంది. ఇవి ఆపిల్ ఫ్లాగ్‌షిప్‌తో పోలిస్తే ధర తక్కువ.


ఆకర్షణీయ డిస్‌ప్లే

iPhone 17 Proలో 6.3-ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED స్క్రీన్ ఉంది. దీని రెజల్యూషన్ 2622×1206 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. Google Pixel 10 Proలో 6.3-ఇంచ్ సూపర్ ఆక్టువ LTPO డిస్‌ప్లే ఉంది. రెజల్యూషన్ 1280×2856 పిక్సెల్స్, 120Hz రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. Xiaomi 15 Ultraలో పెద్ద 6.73-ఇంచ్ 2K LTPO OLED డిస్‌ప్లే ఉంది. ఇది అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ప్రభావవంతంగా ఉంటుంది. షావోమీ డిస్‌ప్లే మూడింటితో పెద్దది.

ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్

ఆపిల్ iPhone 17 Proలో అడ్వాన్ టెక్నాలజీ గల A19 Pro చిప్‌ ఉంది. Google Pixel 10 Proను తన కస్టమ్ Tensor G5 ప్రాసెసర్‌తో అమర్చింది. Xiaomi 15 Ultra క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 Elite ఆక్టా-కోర్ చిప్‌తో పనిచేస్తుంది. భారీ పనులు, హెవీ యాప్స్ నిర్వహణకే ఈ చిప్‌ని రూపొందించారు.

సాఫ్ట్‌వేర్

iPhone 17 Pro iOS 26పై పనిచేస్తుంది. ఇది ఆపిల్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్. Google Pixel 10 Pro ఆండ్రాయిడ్ 16ను ఉపయోగిస్తుంది. ఇది గూగుల్ తాజా ఫీచర్లను అందిస్తుంది. Xiaomi 15 Ultra Android 15పై ఆధారపడిన HyperOS 2.0పై పనిచేస్తుంది. ఇది Xiaomi డివైస్‌లకు అనుకూలంగా ఉంది.

కెమెరా సిస్టమ్

ఆపిల్ iPhone 17 Proలో మూడు 48MP రియర్ కెమెరాలు ఉన్నాయి. ప్రైమరీ ఫ్యూజన్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లు. ముందు భాగంలో18MP కెమెరా ఉంది. Google Pixel 10 Proలో 50MP ప్రైమరీ కెమెరా, 48MP 5x జూమ్ టెలిఫోటో, 48MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 42MP. Xiaomi 15 Ultraలో f/1.62 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, OISతో 50MP ఫ్లోటింగ్ టెలిఫోటో, అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు 32MP కెమెరా.

డైమెన్షన్స్, వెయిట్

iPhone 17 Pro కొలతలు చూస్తే.. 150mm ఎత్తు, 71.9mm వెడల్పు, 8.75mm మందంతో 204 గ్రాముల బరువు ఉంది. Pixel 10 Pro విషయానికి వస్తే.. 152.8mm ఎత్తు, 72mm వెడల్పు, 8.6mm మందంతో 207 గ్రాముల బరువు ఉంటుంది.. Xiaomi 15 Ultra కొలతలు.. 161.3mm ఎత్తు, 75.3mm వెడల్పు, 9.35mm మందం, 226 గ్రాముల బరువు ఉంటుంది.

కనెక్టివిటీ

iPhone 17 Pro 5G.. కనెక్టివిటీ ఫీచర్లు చూస్తే.. వైఫై 7, GPS, eSIM, Bluetooth 6, USB Type-Cను సపోర్ట్ చేస్తుంది. Pixel 10 Pro 5G, 4G, వైఫై, NFC, USB టైస్ సి, గూగుల్ క్యాస్ట్, బ్లూటూత్ 6, GNSS, eSIMను అందిస్తుంది. Xiaomi 15 Ultra 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, Bluetooth 6, USB Type-C, NFC, స్టార్ లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్‌ను సపోర్ట్ చేస్తుంది.

మూడు ఫోన్‌లు ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్లు, అడ్వాన్స్ కెమెరాలను అందిస్తాయి. iPhone 17 Pro ఆపిల్ ఎకోసిస్టమ్ ప్రయోజనాన్ని ఇస్తుంది. Pixel 10 Pro ఫోటోగ్రఫీలో ముందుంది. Xiaomi 15 Ultra డిస్‌ప్లే, కనెక్టివిటీలో బెస్ట్. మీ అవసరాల ప్రకారం ఎంచుకోండి.

Also Read: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో నకిలి ఐఫోన్ డెలివరీ? ఈ జాగ్రత్తలు పాటించండి

Related News

AI Browsers Track Data: మీ పేరు, అడ్రస్, హిస్టరీ అన్నీ ట్రాక్ చేస్తున్న బ్రౌజర్లు.. జాబితాలో గూగుల్ క్రోమ్ టాప్

Netflix Elon Musk: ఎలన్ మస్క్ ట్వీట్‌‌ దెబ్బ.. భారీ సంఖ్యలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ రద్దు

iPhone 17 iOS: ఐఫోన్ 17 యూజర్స్‌కు హెచ్చరిక.. వెంటనే ఆ పని చేయాలని చెప్పిన ఆపిల్

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

Galaxy Ring Swell: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Realme Mobile: దసరా సంబరంలో రియల్‌మీ స్టైలిష్ టెక్ మాస్టర్‌పీస్.. డ్యూరబుల్ డిజైన్‌తో సూపర్ డీల్

Big Stories

×