BigTV English

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

OPPO Mobile: ఫాస్ట్ చార్జింగ్, ఆకర్షణీయమైన డిజైన్.. డైలీ యూజ్ కోసం ప్రీమియం స్మార్ట్‌ఫోన్

OPPO Mobile: ఒప్పో అనేది చైనాలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. ఇది ప్రపంచ వ్యాప్తంగా యూజర్ల మధ్య తన నాణ్యత, డిజై ఇన్నోవేటివ్ టెక్నాలజీ కారణంగా ప్రసిద్ధి చెందింది. ఒప్పో ఫోన్లు ప్రత్యేకంగా ప్రీమియం లుక్, సూపర్ కెమెరా ఫీచర్స్, ఫాస్ట్ ఛార్జింగ్, స్మూత్ పెర్ఫార్మెన్స్ వాడేందుకు సులభంగా ఉంటాయి.


ప్రతి కొత్త ఒప్పో మోడల్‌లో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి అత్యాధునిక హార్డ్వేర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఒప్పో ఫోన్లు ప్రత్యేకంగా యువత, ఫోటో లవర్స్, టెక్ ఎక్స్‌పీరియెన్స్ కోసం రూపొందించబడి ఉంటాయి. అయితే స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తన తాజా ఆవిష్కరణ ఒప్పో ఎఫ్29 ప్రో 5జిని భారత మార్కెట్‌లో ఘనంగా లాంచ్ చేసింది. దీని ధర, ఎలా పనిచేస్తుందనే దానిపై ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రీమియం డిజైన్, అన్‌స్టాపబుల్ డ్యూరబిలిటీ


ఒప్పో ఎఫ్29 ప్రో 5జి డిజైన్‌లో ఒక అడుగు ముందుంది. స్లిమ్‌గా 7.6mm మందం, 180 గ్రాముల బరువుతో ఈ ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఉంటుంది. క్వాడ్-కర్వ్డ్ ఎడ్జెస్, ఫైబర్ ఫ్యాబ్రిక్ బ్యాక్, న్యాచురల్ రాక్ టెక్స్‌చర్‌తో ప్రీమియం లుక్ అందిస్తుంది. మార్బుల్ వైట్, గ్రానైట్ బ్లాక్ కలర్స్ యూజర్లను ఆకట్టుకుంటాయి. ఈ ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్‌లతో వాటర్, డస్ట్‌ప్రూఫ్. 1.5 మీటర్ల డెప్త్‌లో 30 నిమిషాలు నీటిలో మునిగినా సేఫ్! మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్- ఎస్‌టిడి-810హెచ్ సర్టిఫికేషన్, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్టస్ 2తో 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజ్ కాదు. రోజువారీ యూస్‌లో టఫ్‌గా నిలిచే ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

విజువల్ ట్రీట్‌తో అమోలేడ్ డిస్‌ప్లే

6.7-ఇంచ్ అమోలేడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఎఫ్‌హెచ్‌డి ప్లస్ రెజల్యూషన్‌తో ఒప్పో ఎఫ్29 ప్రో 5జి స్క్రీన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. 1200 nits బ్రైట్‌నెస్‌తో సూర్యకాంతిలో కూడా క్లియర్ వ్యూ. హెచ్‌డిఆర్10 ప్లస్ సపోర్ట్, 100శాతం డిసిఐ-పి3 కలర్ గామట్‌తో మూవీస్, గేమింగ్‌కి అద్భుతం. బెజెల్-లెస్ డిజైన్ స్మూత్ స్క్రాలింగ్‌లో లాటెన్సీతో గేమర్స్‌కి ఫేవరెట్.

Also Read: Jio recharge plans 2025: ఓర్నీ.. జియోలో ఇన్ని రీఛార్జ్ ఆఫర్లు ఉన్నాయా? బెస్ట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి

శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, AI మ్యాజిక్

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ (4nm)తో ఈ ఫోన్ మల్టీ-టాస్కింగ్, గేమింగ్‌లో లాగ్‌ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. 256జిబి UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్స్. కలర్ఓఎస్15తో AI సమరీ, AI రీరైట్, సర్కిల్ టు సెర్చ్ లాంటి స్మార్ట్ ఫీచర్స్. AI లింక్‌బూస్ట్‌తో 300% నెట్‌వర్క్ స్పీడ్, లో-సిగ్నల్ ఏరియాల్లో కూడా స్ట్రాంగ్ కనెక్టివిటీ. 5జి, వైఫై 6, బ్లూటూత్ 5.3, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఫాస్ట్, సెక్యూర్.

కెమెరా- అద్భుతంగా క్యాప్చర్

50యూయూఎంపి సోని LYT-600 మెయిన్ కెమెరా (OIS), 2ఎంపి డెప్త్ సెన్సర్‌తో రియర్ కెమెరా సెటప్ షార్ప్, కలర్-అక్యురేట్ ఫోటోలు తీస్తుంది. 4కె వీడియో, AI నైట్ మోడ్, పోర్ట్రెయిట్ షాట్స్ సోషల్ మీడియా రీల్స్‌కి పర్ఫెక్ట్. 16ఎంపి ఫ్రంట్ కెమెరా వైడ్-అంగిల్ సెల్ఫీలతో అదరగొడుతుంది. అల్ట్రా-వైడ్ కెమెరా లేని లోటు ఉన్నప్పటికీ, AI ఎడిటింగ్ ఫీచర్స్ ఫోటోగ్రఫీని ఈజీ చేస్తాయి.

బ్యాటరీ- ఎండ్యూరెన్స్ కింగ్

6000mAh గ్రాఫైట్ బ్యాటరీ 53 గంటల డైలీ యూస్‌ని సపోర్ట్ చేస్తుంది. 80W సూపర్‌వూక్ చార్జింగ్‌తో 15 నిమిషాల్లో 50శాతం చార్జ్. రివర్స్ చార్జింగ్ ఉంది, కానీ వైర్‌లెస్ చార్జింగ్ లేదు. రెగ్యులర్ యూస్‌లో రెండు రోజులు ఈజీగా రన్ అవుతుంది.

ధర ఎంతంటే?

ధర పరంగా  చూస్తే, ఇది రీజనబుల్ అనే చెప్పొచ్చు. ఒప్పో ఎఫ్29 ప్రో 5జి ప్రైస్ రూ.24,185 నుంచి స్టార్ట్ అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్‌తో రూ.2,000-రూ.4,000 డిస్కౌంట్. ప్రీ-ఆర్డర్‌లో రూ.23,999కి లభించనుంది. కానీ ఒప్పో ఫ్యాన్స్‌కి ఇది మస్ట్-బై. మీరు టఫ్, స్టైలిష్, స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇది మీ కోసం స్టైలిష్‌గా ఉంటుంది.

Related News

Galaxy Ring Swell: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్

Credit Card Record: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగ సేల్ ఎఫెక్ట్.. రూ.1.2లక్ష కోట్లు దాటేసిన క్రెడిట్ కార్డ్ షాపింగ్!

Realme Mobile: దసరా సంబరంలో రియల్‌మీ స్టైలిష్ టెక్ మాస్టర్‌పీస్.. డ్యూరబుల్ డిజైన్‌తో సూపర్ డీల్

Budget Bikes: అమ్మతోడు.. ఈ ఆఫర్లు తెలిస్తే ఇప్పుడే బైక్ షోరూంకి వెళ్లి కొనేస్తారు

Smart TV Offers: దసరాకి దుమ్ము రేపుతున్న ఆఫర్లు.. 70mm స్క్రీన్ కూడా ఈ టీవీల ముందు వేస్ట్ భయ్యా..

Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లాస్ట్ డేస్ డీల్స్ అప్‌డేట్.. టైం దాటితే ఆఫర్లు అయిపోతాయ్..

Lava Mobiles: సెల్ఫీ ప్రియులకు బెస్ట్ ఫోన్.. కేవలం 10వేలకే లావా 5జి ఫోన్..

Big Stories

×