BigTV English

Festival Special Trains 2025: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పండుగ రద్దీ వేళ ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలో!

Festival Special Trains 2025: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పండుగ రద్దీ వేళ ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలో!

Festival Special Trains 2025: దసరా, దీపావళి పండుగ సమయాల్లో రైల్వే ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించాయి. విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు దసరా స్పెషల్ ట్రైన్(08589) విశాఖలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. అక్టోబర్ 4న రాత్రి 8.00 గంటలకు తిరుగు ప్రయాణంలో చర్లపల్లి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:45 గంటలకు విశాఖ చేరుకుంటుంది.


ఈ రెండు స్పెషల్ రైళ్లు అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, యలమంచిలి, అన్నవరం, నిడదవోలు, నల్గొండలో ఆగుతాయి.

500 అదనపు రైళ్లు

దసరా, దీపావళి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అదనంగా 500 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పారు. దీంతో పాటు ప్రధాన మార్గాల్లో 350 రైళ్లకు అదనంగా బోగీలను అమర్చారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అదనపు సౌకర్యాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


సాధారణంగా సికింద్రాబాద్ నుంచి ప్రయాణించే రైళ్లు రోజుకు 1.3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తాయి. పండుగల సందర్భంగా ప్రయాణికుల సంఖ్య 2 లక్షల వరకు పెరిగింది. దీంతో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు నవంబర్ చివరి వారం వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వేతో పాటు పలు రైల్వే డివిజన్లు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి.

ప్రత్యేక రైళ్ల జాబితా

  • చెన్నై-షాలిమార్‌ స్పెషల్ రైలు(02842) నవంబర్ 26వ తేదీ వరకు ప్రతి బుధవారం చెన్నైలో తెల్లవారుజామున గం.4.30లకు బయలుదేరుతుంది. గురువారం ఉదయం గం.11.20లకు షాలిమార్‌ చేరుకుంటుంది.
  • షాలిమార్‌- చెన్నై స్పెషల్ ట్రైన్ (02841) నవంబరు 24 వరకు ప్రతి సోమవారం షాలిమార్‌లో సాయంత్రం 6:30కి బయలుదేరి, మంగళవారం రాత్రి 11:30కి చెన్నై చేరుకుంటుంది.
  • కన్యాకుమారి- హైదరాబాద్‌ స్పెషల్ ట్రైన్ (07229) ప్రతి శుక్రవారం ఉదయం 5.15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
  • హైదరాబాద్‌- కన్యాకుమారి స్పెషల్ ట్రైన్ (07230) ప్రతి బుధవారం సాయంత్రం 5:20కి హైదరాబాద్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 2:30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది.
  • తిరుపతి-సాయినగర్‌ షిర్డీ స్పెషల్ ట్రైన్ (07637) ప్రతి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తిరుపతిలో బయలుదేరి, సోమవారం ఉదయం 10.45కు షిర్డీకి చేరుకుంటుంది.
  • సాయినగర్‌ షిర్డీ-తిరుపతి స్పెషల్ ట్రైన్ (07638) ప్రతి సోమవారం రాత్రి 7:35 గంటలకు షిర్డీలో బయలుదేరి, బుధవారం తెల్లవారుజామున 1:30కి తిరుపతికి చేరుకుంటుంది.
  • తిరుపతి-జల్న స్పెషల్ ట్రైన్ (07610) ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:15 కు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3:50 గంటలకు జల్నకు చేరుకుంటుంది.
  • జల్న- తిరుపతి (07609) ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జల్నలో బయలుదేరి, మంగళవారం ఉదయం 10:45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

Also Read: Rabi Crops MSP Hike: పండుగ రోజు రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఆరు పంటల మద్దతు ధరలు పెంపు

Related News

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Big Stories

×