Rahul Ramakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ఒకరు. పలు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్న ఈయన అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా కమెడియన్ గా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న రాహుల్ రామకృష్ణ తరచూ వివాదాలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఈయన చేసే వివాదాస్పద పోస్టులు సంచలనంగా మారుతున్నాయి. గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఇలాంటి వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచిన తాజాగా మరోసారి చేసిన పోస్ట్ తో వార్తల్లో నిలిచారు.
తాజాగా ఈయన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని(Telangana Government) టార్గెట్ చేశారని స్పష్టమవుతుంది. ఈయన చేసిన ఈ ట్వీట్ నేరుగా బిఆర్ఎస్ అధినేతలు కేసిఆర్(KCR), కేటీఆర్(KTR) ను ట్యాగ్ చేయడంతో పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా రామకృష్ణ ట్వీట్ చేస్తూ” మనం భయంకరమైన పరిస్థితులలో బ్రతుకుతున్నాము. డబల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను”అంటూ కేటీఆర్ ను టైప్ చేయగా,”నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి”,” హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు” అంటూ కేసిఆర్ ను ట్యాగ్ చేశారు.
ఇలా ఈయన వరుస ట్వీట్స్ చేయటంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈయన చేసిన పోస్టులు బిఆర్ఎస్ నేతలను ట్యాగ్ చేస్తూ చేయడంతో అసలు రాహుల్ రామకృష్ణకు ఏమైంది ఎందుకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి పోస్టులు చేశారు అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు . అయితే వీటికి ఎంతో మంది రెస్పాండ్ అవుతూ పోస్టులు చేస్తున్న ఇప్పటివరకు ఈయన మాత్రం వీటిపై ఎక్కడ స్పందించలేదు.
Hyderabad drowned.
All your promises failed. @KCRBRSPresident people are calling for you to bring it all to order.— Rahul Ramakrishna (@eyrahul) October 2, 2025
We live in such terrible times.
Can’t wait for Dumbledore to come back@KTRBRSGo ahead, murder me now. I’m sick and tired of things anyway
— Rahul Ramakrishna (@eyrahul) October 2, 2025
ప్రస్తుతం ఈయన చేసిన ఈ పోస్టులతో మరో వివాదంలో నిలిచారు. మరి ఈ పోస్టులను ఏ ఉద్దేశంతో పెట్టారనేది తెలియాలి అంటే రాహుల్ రామకృష్ణ స్పందించాల్సి ఉంటుంది . గతంలో కూడా ఈయన ఓ రైలు ప్రమాద ఘటనపై ఈ విధమైనటువంటి వివాదాస్పద పోస్ట్ చేసి వార్తలో నిలిచారు. అలాగే పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా ఈయన అల్లు అర్జున్ కు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధంగా అప్పట్లో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ కావడంతో తన మాటలను వెనక్కు తీసుకుంటున్నాను అంటూ ఆ పోస్టును కూడా డిలీట్ చేశారు. ఇక గతంలో గాంధీ జయంతి రోజు కూడా గాంధీజీ గొప్పవాడని నేను అనుకోవట్లేదు అంటూ ఈయన వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలిచారు. తాజాగా ఈయన చేసిన ఈ పోస్టు సంచలనంగా మారింది.
Also Read: Shahid Kapoor: నా పిల్లలు ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు!