E-Paper
Advertisement

Vijay Viral Speech: కోడి కత్తి, బాబాయ్ హత్య.. విజయ్ మాట్లాడింది జగన్ గురించేనా? అసలు ఏమన్నారు?

Vijay Viral Speech: కోడి కత్తి, బాబాయ్ హత్య.. విజయ్ మాట్లాడింది జగన్ గురించేనా? అసలు ఏమన్నారు?
Advertisement

Vijay Viral Speech: కోలివుడ్ సూపర్ స్టార్ విజయ్.. తమిళనాడు రాజకీయాలతో పాటు ఏపీలోనూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన విజయ్.. ఏప్రిల్ 23న జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అయితే విజయ్ కొత్త పార్టీ స్థాపించిన దగ్గర నుంచి తమిళనాడుతో పాటు ఏపీలోనూ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరహాలోనే.. విజయ్ సినీరంగానికి చెందినవారు కావడంతో ఆయన చేసే వ్యాఖ్యలు, తీసుకునే నిర్ణయాలను పవన్ కళ్యాణ్ తో సరిపోల్చుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడంతో వైసీపీ శ్రేణులు సహజంగానే పవన్ తో పాటు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల ప్రచారంలో విజయ్ మాట్లాడుతూ.. జగన్ పై తీవ్ర విమర్శలు చేసినట్లుగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

‘కోడి కత్తి డ్రామాలు తెలియదు’

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ మాట్లాడిన మాటలను ‘Sandy Papa YSCRP’ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే తమిళంలో ఉన్న ఆయన మాటలకు అర్థం ఇదేనంటూ పెట్టిన తెలుగు ట్రాన్స్ లేషన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గొడ్డలితో ఏసేసి సీఎం అవ్వడానికి తనకు బాబాయి లేడని.. కోడి కత్తి డ్రామాలు తనకు తెలియవని విజయ్ చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఆస్తి కోసం సొంత చెల్లెల్ని బయటకు తోసేసే రకాన్ని కాదని.. సోదరిని సోషల్ మీడియాలో బండబూతులు తిట్టించే వాడిని కాదని.. మీ ఓటు విజిల్ గుర్తుకే వేయాలని విజయ్ చెప్పినట్లుగా క్యాప్షన్ పెట్టారు. అయితే వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి సెటైరికల్ గా ఈ పోస్ట్ చేసినట్లు అర్థమవుతోంది.

Advertisement

నిజానికి విజయ్ ఏమన్నారంటే?

సోషల్ మీడియా పోస్టులో విజయ్ అన్నట్లుగా ఉన్నది అవాస్తవమేనని చెప్పవచ్చు. నిజానికి ఆ బైట్ లో జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు విజయ్ చేయలేదు. ‘ఎన్నో వసతులు ఉన్నా కూడా.. ఎంతో ఆడంబరమైన జీవితాన్ని వదిలిపెట్టి మీకోసం రాజకీయాల్లోకి వచ్చాను. మీ రుణం తీర్చుకోవడం కోసం పాలిటిక్స్ లో చేరాను. ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పి నేను మిమ్మల్ని మోసం చేయలేదు.. చేయను కూడా. తమిళనాడులోకి నాలుగు పార్టీలు కాదు.. 40 పార్టీలు వచ్చినా ఇక్కడ పోటీ రెండు పార్టీల మధ్య మాత్రమే. అది ఒకటి టీవీకే అయితే రెండోది డీఎంకే. ప్రజల మీద పెత్తనం చేసే స్టాలిన్ కావాలా? ప్రజల్ని ప్రేమించే విజయ్ కావాలో మీరే నిర్ణయించుకోండి. మీ అన్న, తమ్ముడు, కుమారుడితో సమానమైన విజయ్ కు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అంటూ విజయ్ చెప్పడంలో ఆ వీడియోలో ఉంది.

Advertisement

Also Read: eSIM vs Physical SIM: రెండింటికి తేడా ఏంటి? నెట్ స్పీడ్, కాల్స్ నాణ్యతకు.. ఏది బెస్ట్ ఛాయిస్!

పవన్‌పై విజయ్ పంచ్‌లు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు పెట్టుకొని గత ఏపీ ఎన్నికల్లో 100 స్ట్రైక్ రేట్ సాధించారు. తద్వారా వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి.. కోలుకోలేని దెబ్బ తీశారు. అయితే పవన్ తరహాలోనే సినీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన విజయ్.. తన మెుట్టమెుదటి ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో పొత్తు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను.. పవన్, టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఉపయోగించుకుంటున్నారు. ‘నేను పొత్తు పెట్టుకొని మిమ్మల్ని ఏ జెండా మోయనివ్వను’ అని విజయ్ అన్నట్లుగా ఉన్న వీడియోను వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ వైరల్ చేస్తున్నాయి. మెుత్తంగా చూస్తే విజయ్ అంశం.. మరోమారు ఏపీలో ఆసక్తికర చర్చకు కారణమైందని చెప్పవచ్చు.

Also Read: April Rules: ట్యాక్స్ నుంచి టికెట్ దాకా.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఈ కొత్త రూల్స్!

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×