Mahalakshmi Scheme: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు గంటల్లోనే ప్రారంభించిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసుకొని విజయవంతంగా కొనసాగుతున్నందున మంగళవారం నారాయణపేట జిల్లా మఖ్తల్ బస్టాండ్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మహిళామణులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుటకు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అడిషనల్ కలెక్టర్ శ్రీను, రెవెన్యూ కలెక్టర్ ఫణిందర్ రెడ్డి, తాసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మానస హాజరైయ్యారు. కొన్ని కోట్లతో కూడుకున్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తూ విజయవంతంగా కొనసాగుతున్న మహాలక్ష్మి పథకాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ఆర్టీసీ అధికారులు చొరవ చూపడంలేదని మహాలక్ష్మి పథకం ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు ఆదాయం ఆదా చేకూరుతుంటే అట్టి విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయకపోగా ప్రస్తుతం ఏర్పాటు చేసిన వేదికను చూస్తేనే మహాలక్ష్మి పథకం పై ఆర్టీసీ అధికారులకు ఉన్న నిర్లక్ష్యం బయటపడుదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మహిళలు తలెత్తుకొని తిరగడానికి గాను ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి వారు ప్రయాణించిన దూరానికి ప్రభుత్వమే ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తున్న విషయాన్ని ఆర్టిసి అధికారులు ఎందుకు ప్రచారం చేయడం లేదని ఆయన డిపో మేనేజర్ ని ప్రశ్నించారు.
Also Read: అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గలాబీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..?
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియమ్మ పుట్టినరోజు దినాన ప్రారంభించినటువంటి మహాలక్ష్మి పథకం రాష్ట్ర వ్యాప్తంగా నేటికీ మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణించి రాష్ట్ర ప్రజలకు పదివేల కోట్ల రూపాయల ప్రయాణ చార్జీలను ఆదా చేసిందని దాంతోపాటు పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్టీసీకి అందించిదని నారాయణ పేట జిల్లా వ్యాప్తంగా ప్రయాణిస్తున్న మహిళల నుండి రోజు 12 లక్షల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకుంటుందని ఆర్టీసీ లాభాల బాటలో కొనసాగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకొని విజయవంతంగా అమలు చేస్తు ఆర్టీసీకి లాభాలు సమకూరుస్తూన్నా ప్రచారంలో వెనుకబడి ఉందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాలలో మహిళలను భాగస్వామ్యం చేయడం వల్లనే ఆర్థిక వ్యవహారాలన్నీ వారి చేతుల నుండి ఖర్చు చేయడంతోనే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేస్తున్న కొందరు మాత్రం వాట్సాప్‌లో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చేస్తున్న తాటాకు చప్పుడ్లకు మహిళా మణులు ఎవరు కూడా భయపడద్దని మంత్రి వాకిడి శ్రీహరి తెలిపారు. మారుమూల గ్రామాల నుండి పట్టణాలకు చదువుకోడానికి ఉద్యోగరీత్యా వచ్చే విద్యార్థులకు ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా బస్సులు తిప్పాలని రాత్రి సమయంలో తను దిగాల్సిన పల్లే స్టేజిల దగ్గర ఎక్స్ప్రెస్ బస్సులను ఆపి ప్రయాణికులకు ప్రజలకు సౌకర్యం కల్పించాలని,ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడమే తమ విధి అన్న లక్ష్యాన్ని ఆర్టీసీ అధికారులు గౌరవించి అమలు చేయాలని ఆయన అన్నారు. అనంతరం పలువురు మహిళా మణులను మంత్రి వాకిటి శ్రీహరి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం ఆర్టిసి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.
Also Read: ఇక దొంగ హజర్లు కుదరవు.. ఉపాధి హామీ పనిలో కీలక మార్పులు చేసిన సర్కార్..!