E-Paper
Advertisement

ఇరాన్ యుద్ధ వేళ.. రష్యా ఊహించని నిర్ణయం, ఇకపై కష్టాలు రెట్టింపు

ఇరాన్ యుద్ధ వేళ.. రష్యా ఊహించని నిర్ణయం, ఇకపై కష్టాలు రెట్టింపు
Advertisement

Russia: ఇరాన్ యుద్ధం వేళ పశ్చిమాసియా ఉద్రిక్తత నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. దీనికితోడు హోర్మూజ్ జలసంధిని ఇరాన్ వేయడంతో చమురు ఇబ్బందులు తీవ్రమయ్యాయి. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రష్యా, కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటి నుంచి గ్యాసోలిన్ (పెట్రోల్‌)ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. దేశీయ సరఫరాకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రష్యా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు ఉండబోతోందని అసలు ప్రశ్న.

ఇరాన్ యుద్ధ వేళ.. రష్యా ఊహించని నిర్ణయం

Advertisement

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. మార్కెట్ పతనం కాకుండా అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తూ ఇంధన ధరలను స్థిరీకరించే లక్ష్యంతో గ్యాసోలిన్ ఎగుమతులపై నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం ఏప్రిల్ ఒకటి నుంచి జులై 31 వరకు వర్తించనుంది.

రష్యా ఉప ప్రధానమంత్రి అలెగ్జాండర్ నోవాక్ అధ్యక్షతన సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. రష్యా ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన ప్రకారం.. విదేశాలలో రష్యా ఇంధనానికి మాంచి డిమాండ్ ఉంది. పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ చమురు ధరలు హెచ్చు తగ్గులకు కారణమవుతోంది. చమురు శుద్ధి రేట్లు మార్చి 2025 స్థాయిలో కొనసాగుతున్నాయని అక్కడి కంపెనీలు తెలిపాయి.

Advertisement

రష్యా నిర్ణయం.. యూరోపాకు కష్టాలు తప్పవా?

రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేయడం, కాలానుగుణంగా ఇంధనానికి గిరాకీ పెరగడం వంటి కారణాలు లేకపోలేదు. గతేడాది రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు గ్యాసోలిన్ కొరతను ఎదుర్కొన్నాయి. అది పెట్రోలియం ఉత్పత్తులు, సరఫరాను నిర్ధారిస్తుంది.

దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి తగినంత గ్యాసోలిన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రిఫైనరీ సామర్థ్యం అధిక స్థాయిలో వినియోగించబడుతోందని అక్కడి సంస్థలు చెబుతున్నాయి.  రష్యా నిర్ణయం భారత్‌పై ఏ మాత్రం ప్రభావం చూపుతోంది? భారత్‌ తన ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో 80 శాతం వివిధ దేశాలు, మరో 20 శాతం రష్యా నుంచి వస్తుంది.

ALSO READ: చరిత్రలో కనివినీ ఎరుగని నిరసన.. 3,100 ప్రాంతాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

ఇండియా భారీగా రిఫైనరీలు అధిక సామర్థ్యం ఉండటంతో గ్యాసోలిన్ ఉత్పత్తుల వాటా అతి తక్కువ. దేశంలో రిఫైనరీలు రోజుకు 5 మిలియన్ల బ్యారెళ్లు చమురు శుద్ధి చేస్తున్నాయి. దీనివల్ల దేశీయ అవసరాలు తీర్చడమేకాకుండా పలు విదేశాలకు ఎగుమతి చేస్తోంది. రష్యా నిర్ణయంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇరాన్ యుద్ధం కారణంగా హర్మూజ్‌ జలసంధిలో నౌకా రవాణాకు ఆటంకం ఏర్పడింది. యుద్ధానికి ముందు ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్లుగా ఉండగా ఇప్పుడు 100 డాలర్లు దాటేసింది. రష్యా నిర్ణయం యూరప్‌పై ప్రభావాన్ని బాగా చూపుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో యూరోపియన్ గ్యాసోలిన్ ధరలు 48 శాతం, డీజిల్ ధరలు 84 శాతం పెరిగిన విషయం తెల్సిందే.  దీని ప్రభావం సోమవారం మార్కెట్లపై ఏ మేరా పడుతుందో చూడాలి.

 

 

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×