E-Paper
Advertisement

Sony Pluse Elite Headset: మెగా సేల్.. పల్స్ ఎలైట్‌పై 38శాతం తగ్గింపు.. గేమింగ్ కోసం నెక్ట్స్ లెవెల్ ఆడియో..

Sony Pluse Elite Headset: మెగా సేల్.. పల్స్ ఎలైట్‌పై 38శాతం తగ్గింపు.. గేమింగ్ కోసం నెక్ట్స్ లెవెల్ ఆడియో..
Advertisement

Sony Pluse Elite Headset: ప్లేస్టేషన్ గేమింగ్ పై ప్యాషన్ కలిగిన వాళ్ళకు హెడ్‌సెట్ అంటే ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. చెవుల్లో నుంచి వచ్చే సౌండ్ తోనే గేమ్ అనుభవం పూర్తిగా మారిపోతుంది. అదే కాన్సెప్ట్‌తో సోనీ ఇప్పుడు ఇచ్చిందొక కొత్త ఆడియో అనుభవం, అదే సోనీపల్స్ ఎలైట్‌ వైర్‌లెస్ ఓవర్ ఇయర్ హెడ్‌సెట్. ప్రస్తుతం ఇది మంచి ఆఫర్‌లో అందుబాటులో ఉంది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రియల్ లైఫ్‌లా వినిపించేలా డిజైన్

Advertisement

సోనీ గేమింగ్ ప్రపంచంలో సీరియస్ స్థాయి సౌండ్ అనుభవాలు ఇచ్చిన కంపెనీ. ఇపుడు తీసుకొచ్చిన పల్స్ ఎలైట్‌లో ప్లానర్ మాగ్నెటిక్ డ్రైవర్స్ అనే టెక్నాలజీ ఉంది. దీనివల్ల సౌండ్ పూర్తిగా క్లియర్‌గా, డీటైల్స్ లాస్ కాకుండా వినిపిస్తుంది. గేమ్‌లో గన్ ఫైర్ అవుతున్నా, దూరంలో అడుగుల శబ్దం వచ్చినా, వాహనం ఇంజిన్ రింగ్ జరిగినా, ప్రతి చిన్న సౌండ్ కూడా రియల్ లైఫ్ లా వినిపించేలా డిజైన్ చేశారు. ఇదే గేమింగ్ ఆడియో లో సోనీ ఇచ్చే పెద్ద ప్లస్ పాయింట్.

అల్ట్రాలో లేటెన్సీ

Advertisement

మరొక ప్రత్యేక లక్షణం అల్ట్రాలో లేటెన్సీ. అంటే గేమ్‌లో జరుగుతున్నది చెవికి వచ్చే శబ్దం మిల్లీ సెకండ్లలో చేరిపోతుంది. కాబట్టి ఆడే సమయంలో డిలే అనేది ఉండదు. ముఖ్యంగా పిఎస్5 లో 3డి ఆడియోకి ఇది పర్‌ఫెక్ట్ మ్యాచ్. షూటింగ్ గేమ్స్ ఆడే వాళ్లకి ఈ రకం ఫీచర్ బ్రతికే ప్రాణం లాంటిది.

బ్లూటూత్‌తో మొబైల్‌కి కూడా కనెక్ట్

ప్లేస్టేషన్ లింక్ అనే ప్రత్యేక వైర్‌లెస్ టెక్నాలజీ ఉంది. దీని తో పిఎస్5, పిసి లేదా మాక్‌తో స్టేబుల్ కనెక్షన్ వస్తుంది. అవసరమైతే బ్లూటూత్‌తో మొబైల్‌కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకేసారి ఉపయోగిస్తున్నా కనెక్షన్ డ్రాప్ అయ్యే బాధ లేదు. ఇది కూడా సోనీ వినియోగదారుల కోసం దృష్టి పెట్టిన ముఖ్య అంశం.

ఏఐ నాయిస్ రిజెక్షన్ మైక్రోఫోన్స్

గేమ్ ఆడుతూ మాట్లాడాలి అంటే కూడా సమస్య లేదు. ఇందులో ఏఐ నాయిస్ రిజెక్షన్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. అందువల్ల చుట్టూ ఎంత శబ్దం ఉన్నా, మీ వాయిస్ మాత్రం క్లియర్‌గా ఫ్రెండ్స్‌కి వినిపిస్తుంది. గేమర్ కోసం ఇలాంటి క్వాలిటీ మైక్ చాలా అవసరం.

5 గంటల బాటరీ కంటిన్యూ

బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 5 గంటలు కంటిన్యూ ప్లే చేయొచ్చు. స్టూడియో గేమింగ్ లెవెల్ క్వాలిటీని ఇస్తూ 5 గంటల బాటరీ అంటే మంచి రేంజ్. అదికాక చార్జింగ్ కేస్ తో మరో 10 గంటలు అదనంగా వాడుకొనొచ్చు కాబట్టి మొత్తం కలిసి 15 గంటల బ్యాకప్. ట్రావెల్లో ఉన్నా గేమింగ్ ఆగదు. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. వెయిట్ కేవలం 347 గ్రాములు, తల మీద వేసుకున్నా హెవీ అనిపించదు. ఎక్కువసేపు ఆడే ప్లేయర్స్‌కి ఇది గొప్ప ప్రయోజనం.

అసలు ధరకు.. ఆఫర్ ధర ఎంత తగ్గిందంటే?

ఈ సోనీ పల్స్ ఎలైట్ వైర్‌లెస్ ఓవర్ ఇయర్ హెడ్‌సెట్ అసలు ధర రూ.12,990. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్ గా కేవలం రూ.7,990 కి లభిస్తోంది. అంటే రూ.5,000 తగ్గింపుతో మొత్తం 38శాతం భారీ డిస్కౌంట్ అందుతుంది. ఈ స్థాయి గేమింగ్ ఆడియో అనుభవం కోసం ఈ ధర నిజంగా వాల్యూ ఫర్ మనీ డీల్ గా చెప్పొచ్చు. ఆఫర్ ముగిసేలోపు తీసుకుంటే బెస్ట్ టైమ్.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×