E-Paper
Advertisement

Allu Arjun -Sri tej: శ్రీతేజ్‌కు అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?

Allu Arjun -Sri tej: శ్రీతేజ్‌కు అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా?
Advertisement

Allu Arjun -Sri tej: అల్లు అర్జున్(Allu Arjun) సినీ కెరియర్లో పుష్ప 2(Pushpa 2) సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పాలి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి. మొదటి రోజు సినిమా చూడాలని ఎంతో మంది అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తుంటారు అలాగే గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ విడుదలైన పుష్ప సినిమా చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే అభిమాని మరణించారు అలాగే తన కుమారుడు శ్రీ తేజ్ (Sri Tej)కూడా గాయపడ్డారు.

శ్రీ తేజ్ కోసం కోట్లలో ఖర్చు..

ఈ విధంగా శ్రీ తేజ్ హాస్పిటల్ పాలవడంతో ఈ చిన్నారి హాస్పిటల్స్ కి అయ్యే డబ్బు మొత్తం తానే భరిస్తానని అల్లు అర్జున్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడు ఆ చిన్నారి గురించి ఏమాత్రం పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ టీం ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అలాగే చిన్నారి శ్రీ తేజ్ కోసం అల్లు అర్జున్ ఎంత డబ్బు ఖర్చు చేశారనే విషయాలను కూడా వివరంగా తెలియజేశారు. శ్రీ తేజ్ కోసం అల్లు అర్జున్ ఇప్పటివరకు సుమారు 3 కోట్ల 20 లక్షల 40 వేల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలియజేశారు.

శ్రీ తేజ్ పై రూ. 1.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్..

Advertisement

ఇక ఇందులోనే సుమారు 1.5 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసినట్టు తెలియజేశారు. ఇలా చిన్నారి పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో బ్యాంక్ నుంచి ఇప్పటివరకు ఫిక్స్ డిపాజిట్ పై సుమారు రూ. 17 లక్షల వరకు వడ్డీ కూడా వచ్చినట్లు తెలియజేశారు. శ్రీ తేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సుమారు 76 లక్షల రూపాయల వరకు హాస్పిటల్ బిల్లులు బకాయి ఉండడంతో వాటన్నింటినీ కూడా అల్లు అర్జున్ టీమ్ క్లియర్ చేసిందని తెలిపారు. ఇలా అల్లు అర్జున్ శ్రీ తేజ కోసం సుమారు నాలుగు కోట్ల వరకు ఖర్చు చేశారని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

సమస్య ఉంటే మాతో చెప్పవచ్చు..

Advertisement

ఇక నేడు ఓ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా బన్నీ వాసుకు ఇదే ప్రశ్న ఎదురవడంతో ఆయన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శ్రీ తేజ్ తండ్రికి ఏదైనా సమస్య ఉంటే నేరుగా మాకే తెలియ చేయవచ్చు లేదా మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు గారితో వారి సమస్యను చెప్పవచ్చని తెలిపారు. మధ్యవర్తుల సహాయంతో తాము ఒక పద్ధతి ప్రకారమే చిన్నారి శ్రీ తేజ్ కుటుంబానికి సహాయం చేస్తున్నామని బన్నీ వాసు కూడా క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ మాట ఇచ్చిన ప్రకారమే శ్రీ తేజ్ కుటుంబానికి అండగా నిలిచారనే విషయంపై స్పష్టత రావడంతో బన్నీ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Rashmika Marriage: ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన రష్మిక.. పెళ్లి ఎప్పుడంటే?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×