E-Paper
Advertisement

Soundcore Nebula P1 Projector: డిటాచబుల్ స్పీకర్లతో సౌండ్‌కోర్ నెబ్యులా P1.. బెడ్‌రూంలోనే థియేటర్ ఫీలిచ్చే స్మార్ట్ పోర్టబుల్ ప్రొజెక్టర్!

Soundcore Nebula P1 Projector: డిటాచబుల్ స్పీకర్లతో సౌండ్‌కోర్ నెబ్యులా P1.. బెడ్‌రూంలోనే థియేటర్ ఫీలిచ్చే స్మార్ట్ పోర్టబుల్ ప్రొజెక్టర్!
Advertisement

Soundcore Nebula P1 Projector: థియేటర్‌‌‌కు వెళ్లి టిక్కెట్లు కొనుక్కొని సినిమా చూసే శ్రమ లేకుండా ఇంట్లోనే ఇంటిల్లిపాదికీ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే పోర్ట్‌బుల్ ప్రొజెక్టర్ సౌండ్‌కోర్ నెబ్యులా P1 అందుబాటులోకి వచ్చేసింది. ఈ సరికొత్త ప్రొజెక్టర్‌ను చిన్న సైజ్‌లో, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా తేలికైన బరువుతో రూపొందించారు. ఈ ప్రొజెక్టర్ ప్రత్యేకమైన డిటాచబుల్ స్పీకర్లను కలిగి ఉంది. దీంతో మీరు టీవీ ముందు కూర్చోవాల్సిన అవసరం లేకుండా.. బెడ్ రూం లేదా మీరు ఉన్నచోట నుంచే బిగ్ స్క్రీన్ అనుభూతిని పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్‌ను ఇంట్లోనే కాకుండా.. బయట క్యాంపింగ్‌లో లేదా ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకోవడానికి కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు.

ఎలాగైనా వాడొచ్చు..

ఈ ప్రొజెక్టర్ 1080p ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తుంది. 650 ANSI ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల చిత్రాలు స్పష్టంగా, రంగులు లైవ్‌గా కనిపిస్తాయి. గరిష్టంగా 180 అంగుళాల వరకు పెద్ద స్క్రీన్ ప్రొజెక్షన్ రావడంతో, ఇంట్లోనే సినిమా నైట్‌ను సెటప్ చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

Advertisement

Also Read: 80 కిలోమీటర్ల దూరంలోనూ కనెక్టివిటీ.. మెరైన్ ప్రొఫెష్నల్స్ కోసం Garmin సూపర్ వాచ్!

20 గంటల ప్లేబ్యాక్..

డిటాచబుల్ స్పీకర్లు దీని మరో ప్లస్ పాయింట్. వీటిని విడిగా ఉపయోగించుకోవచ్చు లేదా ప్రొజెక్టర్‌కు జత చేసి 2.0 సౌండ్‌గా వినొచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 20 గంటల వరకు ప్లేబ్యాక్ ఇస్తాయి. అందువల్ల పార్టీలు, అవుట్‌డోర్ ఈవెంట్స్ లేదా లాంగ్ మూవీ సెషన్స్‌కి కూడా సౌండ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మెరుగైన పనితీరు..

Advertisement

ఇక సెటప్ విషయంలో కూడా నెబ్యులా P1 చాలా సులభంగా ఉంటుంది. రియల్‌టైమ్ ఆటోఫోకస్‌, కీస్టోన్ కరెక్షన్ లాంటి ఫీచర్లతో పిక్చర్ ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. అలాగే 130 డిగ్రీల వరకు తిప్పుకునే బిల్ట్ ఇన్ గింబల్ ఉండటం వల్ల మీకు కావాల్సిన కోణంలో ప్రొజెక్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వలన ఎలాంటి షేకింగ్ సమస్య కూడా ఉండదు.

స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్..

అలాగే ఈ ప్రొజెక్టర్‌లో Google TV ఇన్‌బిల్ట్‌గా రావటం మరో పెద్ద అడ్వాంటేజ్. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ యాప్స్‌ను నేరుగా ప్రొజెక్టర్‌ ద్వారానే ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ సౌండ్‌కోర్ నెబ్యులా P1 పూర్తిస్థాయి స్మార్ట్ పోర్టబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్. మంచి పిక్చర్ క్వాలిటీ, పవర్‌ఫుల్ సౌండ్, స్మార్ట్ ఫీచర్లు అన్నీ కలిసి.. ఎక్కడైనా సినిమాలు, షోలు చూసే అనుభూతిని మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది.

Also Read: కొత్త టీవీ కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్.. 2026 జనవరిలో ట్రెండ్ అవుతున్న స్మార్ట్ టీవీలు ఇవే!

 

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×