E-Paper
Advertisement

Quatix 8 Pro Marine Smartwatch: 80 కిలోమీటర్ల దూరంలోనూ కనెక్టివిటీ.. మెరైన్ ప్రొఫెష్నల్స్ కోసం Garmin సూపర్ వాచ్!

Quatix 8 Pro Marine Smartwatch: 80 కిలోమీటర్ల దూరంలోనూ కనెక్టివిటీ.. మెరైన్ ప్రొఫెష్నల్స్ కోసం Garmin సూపర్ వాచ్!
Advertisement

Quatix 8 Pro Marine Smartwatch: అమెరికన్ గార్మిన్ సంస్థ తన ప్రీమియం మెరైన్ వేర్‌బుల్స్ లైనప్‌లో మరో శక్తివంతమైన స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా విడుదలైన Quatix 8 Proను ప్రత్యేకంగా సముద్రంలో ఎక్కువ సమయం గడిపే బోటర్లు, జాలర్లు, మెరైన్ ప్రొఫెషనల్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. డిజైన్ నుంచి కనెక్టివిటీ వరకూ ప్రతీ అంశంలోనూ వాటర్ ఫోకస్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఉప్పునీటిలోనూ పీక్ బ్రైట్‌నెస్..

డిజైన్ విషయానికి వస్తే.. Quatix 8 Pro తన మునుపటి మోడల్ లుక్‌ను కొనసాగించింది. దీనిలో 47mm టైటానియం బెజెల్, స్క్రాచ్ రెసిస్టెంట్ సఫైర్ క్రిస్టల్ ఉపయోగించారు. 1.4-ఇంచుల AMOLED డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఉప్పు నీరు, సముద్ర స్ప్రే, ఎక్కువసేపు నీటిలో ఉన్నా సమస్య రాకుండా ఈ వాచ్‌ను గట్టిగా తయారు చేశారు.

Advertisement

Also Read: ఇండియా మార్కెట్లోకి మరో రియల్‌మీ బ్యాటరీ బీస్ట్ వచ్చేస్తోంది.. ధర, స్పెసిఫికేషన్లు, కీలక వివరాలు ఇవిగో!

50 మైళ్ల దూరంలోనూ సిగ్నల్స్..

ఈ వాచ్‌ను నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టేది దాని కనెక్టివిటీ ఫీచర్లు. సముద్రంలోకి వెళ్లినప్పుడు సిగ్నల్ కోల్పోవడం చాలామందికి పెద్ద తలనొప్పి. దీనికి పరిష్కారంగా Garmin ఈ వాచ్‌లో inReach శాటిలైట్ టెక్నాలజీతో పాటు LTE సెల్యులర్ మాడ్యూల్‌ను అందించింది. దీని ద్వారా ఫోన్ అవసరం లేకుండానే సుమారు 80 కిలోమీటర్లు(50 మైళ్లు) దూరంలో ఉన్నా టెక్ట్స్ మెసేజ్‌లు పంపడం, వాయిస్ కాల్స్ చేయడం, రియల్ టైమ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

ఎమర్జెన్సీ టైంలో అండగా..

Advertisement

అత్యవసర పరిస్థితుల కోసం Quatix 8 Proలో SOS రెస్క్యూ ఫీచర్ కూడా ఉంది. వాచ్ నుంచి డిస్ట్రెస్ సిగ్నల్ పంపగానే అది Garmin 24/7 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌కు చేరుతుంది. ఇప్పటివరకు ఈ సెంటర్ ద్వారా 1,200కిపైగా నీటి మధ్య రెస్క్యూ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయని కంపెనీ చెబుతోంది.

ప్రత్యేకమైన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్..

సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఇందులో కొత్తగా ఇచ్చిన Boat Mode ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నీటిపై ఉన్నప్పుడు ఆటోపైలట్ కంట్రోల్స్, ట్రోలింగ్ మోటర్ స్టేటస్, వెసెల్ డేటా వంటి కీలక సమాచారాన్ని స్క్రీన్‌పై ముందుగానే అలెర్ట్ చేస్తుంది. ఒడ్డుకు చేరుకున్న తర్వాత వాచ్ ఆటోమేటిక్‌గా హెల్త్ ట్రాకింగ్ మోడ్‌కు మారుతుంది.

15 రోజుల బ్యాటరీ బ్యాకప్:

ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ, స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని Garmin చెబుతోంది. దీనితో పాటు హెల్త్ ట్రాకింగ్, Garmin Pay, 100కిపైగా స్పోర్ట్స్ మోడ్‌లు, వేక్‌బోర్డింగ్, వాటర్ స్కీయింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ధర ఎంతంటే?

ధర విషయానికి వస్తే, Garmin Quatix 8 Pro ధర రూ.1,17,200గా నిర్ణయించారు. ఇది ఒక్క 47mm వేరియంట్‌లోనే అందుబాటులో ఉండగా.. జనవరి 16 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. సముద్రంలో భద్రత, బలమైన కనెక్టివిటీకి ప్రాధాన్యం ఇచ్చేవారికి ఇది నిజంగా ఓ ప్రీమియం ఆప్షన్.

Also Read: ఏఐ కోసం చేతులు కలిపిన యాపిల్, గూగుల్.. గుత్తాదిపత్యమేనని ఎలాన్ మస్క్ ఆందోళన!

 

 

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×