E-Paper
Advertisement

Table Fan vs Ceiling Fan: ఈ వేసవిలో ఏ ఫ్యాన్ వాడటం హెల్త్‌కి మంచిది? నిపుణులు ఇస్తున్న సూచనలివే!

Table Fan vs Ceiling Fan: ఈ వేసవిలో ఏ ఫ్యాన్ వాడటం హెల్త్‌కి మంచిది? నిపుణులు ఇస్తున్న సూచనలివే!
Advertisement

Table Fan vs Ceiling Fan: ఈసారి సూర్యుడి ప్రతాపం మామూలుగా లేదు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో అప్పుడే 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. వేడి సెగలకు తట్టుకోలేక ఫ్యాన్ కింద కూర్చున్నా ఉక్కపోత తగ్గడం లేదు. ఇలాంటి టైమ్‍లో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే.. అసలు ఏ ఫ్యాన్ వాడితే బెటర్? సీలింగ్ ఫ్యాన్ గాలి చల్లగా ఉంటుందా లేక టేబుల్ ఫ్యాన్ గాలి బాగుంటుందా? చల్లదనంతో పాటు మన ఆరోగ్యానికి ఏది సేఫ్? ఈ విషయాలన్నీ ఒకసారి క్లియర్‍గా తెలుసుకుందాం.

సీలింగ్ ఫ్యాన్..

మీ గది పెద్దగా ఉన్నా లేదా బెడ్‌రూమ్స్ కోసం చూస్తున్నా సీలింగ్ ఫ్యాన్ ఎప్పుడూ ది బెస్ట్ ఆప్షన్. ఇది గదిలో ఉన్న గాలినంతటినీ సమానంగా కదిలిస్తుంది. దీనివల్ల గది ఉష్ణోగ్రత దాదాపు 4 నుండి 8 డిగ్రీల వరకు తగ్గినట్టుగా అనిపించి, మనకు హాయినిస్తుంది. గదిలో ఏ మూలన కూర్చున్నా ఉక్కపోత లేకుండా గాలి అందుతుంది. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గాలి నేరుగా ముఖం మీద పడకుండా, ఒంటికి సమానంగా తగిలేలా చూస్తుంది కాబట్టి.. ఇది చాలా కంఫర్టబుల్.

Advertisement

Also Read: రూ.25 వేలకే 5G స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, IP69 రేటింగ్‌తో వివో Y51 ప్రో లాంచ్!

టేబుల్ ఫ్యాన్‌..

టేబుల్ ఫ్యాన్ అనేది ఒక పర్టిక్యులర్ ప్లేస్ కోసం వాడేది. అంటే.. మీరు ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడో లేదా కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడో ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది గాలిని చాలా స్పీడ్‍గా, నేరుగా మన మీదకే పంపిస్తుంది కాబట్టి.. వెంటనే చల్లగా అనిపిస్తుంది. కానీ గది మొత్తం చల్లబడాలంటే మాత్రం ఇది సెట్ అవ్వదు. బ్యాచిలర్స్ లేదా అద్దె ఇళ్లలో ఉండేవారికి, సీలింగ్ తక్కువగా ఉన్న రూమ్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్.

ఆరోగ్యం విషయంలో ఏది మేలు?

Advertisement

హెల్త్ గురించి ఆలోచిస్తే మాత్రం సీలింగ్ ఫ్యాన్ వాడటమే మంచిదని డాక్టర్లు కూడా చెబుతుంటారు. ఎందుకంటే.. టేబుల్ ఫ్యాన్ గాలి నేరుగా ముఖం మీద, కళ్ల మీద పడటం వల్ల కళ్లు పొడిబారడం, స్కిన్ డ్రై అయిపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టేబుల్ ఫ్యాన్ మనకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, దాని రెక్కలకు ఉన్న దుమ్ము నేరుగా మన ముక్కులోకి వెళ్లి అలర్జీలు లేదా ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే సీలింగ్ ఫ్యాన్ అయితే గాలిని పైనుంచి పంపిస్తుంది కాబట్టి.. ఇలాంటి ఇబ్బందులు తక్కువ. అయితే మీరు ఏ ఫ్యాన్ వాడినా సరే, కనీసం నెలకోసారైనా రెక్కలు క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి.

Also Read: టాప్ బ్రాండ్ ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 55% తగ్గింపు.. కొద్దిరోజులే ఈ అవకాశం!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×