E-Paper
Advertisement

47% డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీ..ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

47% డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీ..ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Advertisement

TCL P6L 55 inch TV: ప్రస్తుత కాలంలో ఇంట్లో కూర్చుని థియేటర్ స్థాయి ఫీల్ ఎంజాయ్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోయింది. చిన్న స్క్రీన్‌ల ట్రెండ్ పోయి, పెద్ద సైజు స్మార్ట్ టీవీల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో టెక్నాలజీ ప్రపంచంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న టీసీఎల్ బ్రాండ్ నుంచి వస్తున్న ‘TCL P6L 138 cm (55 inch’ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది.లేటెస్ట్ ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో ఇది సినిమా లవర్స్ ను ఎంత గానో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ టీవీ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిస్‌ప్లే, విజువల్స్ క్వాలిటీ:
ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే.ఇందులో 138 సెంటీ మీటర్లు అనగా దాదాపు 55 అంగుళాల అల్ట్రా HD (4K)ఎల్‌ఈఅడీ డిస్‌ ప్లేను అందించారు. ఇది 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీనిలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వల్ల రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. హెచ్‌డీఆర్ కంటెంట్.. చూస్తున్నప్పుడు విజువల్స్ అద్భుతమైన ఫీల్ ఇస్తాయి. అంతేకాకుండా.. ఇందులో (మోషన్ ఎస్టిమేషన్ ,మోషన్ కాంపెన్సేషన్) టెక్నాలజీని చేర్చారు. దీని వల్ల వేగంగా కదిలే యాక్షన్ సీన్లు, స్పోర్ట్స్ మ్యాచ్‌లు లేదా కార్ రేసింగ్ విజువల్స్ ఎలాంటి బ్లర్ లేదా లాగ్ లేకుండా ఉంటాయి.

Advertisement

సౌండ్ సిస్టమ్,ఆడియో ఫీల్:
పెద్ద స్క్రీన్‌పై సినిమా చూస్తున్నప్పుడు.. సౌండ్ ఎఫెక్ట్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఈ విషయంలో.. టీసీఎల్ ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో పవర్ ఫుల్ స్పీకర్లను అమర్చారు.ఇవి డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో పని చేస్తాయి. థియేటర్లలో లభించే త్రిమితీయ సరౌండ్ సౌండ్ అనుభూతిని ఇది నేరుగా మీ లివింగ్ రూమ్‌లోనే అందిస్తుంది. సినిమాలు చూసేటప్పుడు లేదా పాటలు వినేటప్పుడు ఆడియో క్లారిటీ అద్భుతంగా ఉంటుంది.

స్మార్ట్ ఫీచర్లు,ఆపరేటింగ్ సిస్టమ్:
ఇది లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు. గూగుల్ అసిస్టెంట్ సాయంతో వాయిస్ కమాండ్స్ ఇచ్చి టీవీని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. అలాగే ఇందులో బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్ పోర్ట్ కూడా ఉంది. దీనితో మీ స్మార్ట్‌ ఫోన్ లేదా ట్యాబ్ స్క్రీన్‌ను నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు.తగినన్ని హెచ్‌డీఎంఐ , యూఎస్‌బీ పోర్టులతో పాటు వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో లభిస్తాయి.

Advertisement

ధర :
ఈ ప్రీమియం ఫీచర్లు కలిగిన టీవీ అసలు మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కంపెనీ దీనిపై 47 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో మార్కెట్లో దీని అసలు ధరపై తగ్గింపు పోను కేవలం రూ.39,100 ధరకే ఈ  స్మార్ట్ టీవీ కస్టమర్లకు లభిస్తోంది. బడ్జెట్ ధరలో లేటెస్ట్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం.

మీ ఇంటిని ఒక మినీ సినిమా హాల్‌గా మార్చుకోవాలనుకుంటే.. లేటెస్ట్ టెక్నాలజీ, డాల్బీ విజన్-అట్మాస్ , MEMC ఫీచర్లతో వస్తున్న ఈ టీసీఎల్ 55 ఇంచుల గూగుల్ టీవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని ప్రీమియం లుక్, అద్భుతమైన పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ కస్టమర్లకు ఎంతగానో నచ్చుతాయి. ధర ,ఫీచర్ల పరంగా ఇది వాల్యూ ఫర్ మనీ అనిపించుకుంటుంది.

Related News

ఫోన్‌లో ఈ 5 యాప్స్ ఉంటే చాలు.. మీ పర్స్, ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట మోయక్కర్లేదు!

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌తో కొత్త ఇయర్ బడ్స్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు

ఇంటి పైకప్పుపై నీళ్ల బాటిల్.. 30కి పైగా దేశాలు ఫాలో అవుతున్న పవర్ సేవింగ్ ట్రిక్ ఇదే!

రూ.1,299ధరలో బెస్ట్ ఫీచర్స్..తక్కువ ధరలో ప్రీమియం లుక్

ఏసీ కొనడానికి ఇదే రైట్ టైమ్.. చలికాలంలో కొంటే ఎన్ని లాభాలో తెలుసా?

జియో vs ఎయిర్‌టెల్.. రూ.500 లోపు ప్లాన్లలో ఏది బెటర్? పూర్తి వివరాలు!

iPhone Duoపై 25% డిస్కౌంట్ అంటూ వల.. సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ ఇదే!

Big Stories

Advertisement
×