E-Paper
Advertisement

భర్త విద్యార్థి అయినా భార్యకు భరణం ఇవ్వాల్సిందే.. హై కోర్టు షాకింగ్ తీర్పు

భర్త విద్యార్థి అయినా భార్యకు భరణం ఇవ్వాల్సిందే.. హై కోర్టు షాకింగ్ తీర్పు
Advertisement

Student Husband Wife Alimony| కుటుంబంలో లేదా భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చినప్పుడు ఆర్థిక బాధ్యతలపై కూడా ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా భర్త ఇంకా చదువుకుంటున్న విద్యార్థి అయితే, విడాకుల తరువాత భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం ఉందా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే, కేవలం విద్యార్థి అనే కారణంతో భరణం చెల్లించే బాధ్యత నుంచి తప్పించుకోలేరని పంజాబ్, హర్యాణా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు పూర్తి వివరాలిగో..

అసలు ఈ వివాదం ఎలా మొదలైంది?

లైవ్‌లా మీడియా కథనం ప్రకారం.. ఈ జంటకు 2020 జూన్‌లో వివాహం జరిగింది. అప్పటికి భర్త వయసు 16 సంవత్సరాల నాలుగు నెలలు కాగా, భార్య వయసు 25 సంవత్సరాలు. ఈ కేసు విచారణ సమయంలో వారికి పిల్లలు లేరు. 2023 ప్రారంభంలో వారి వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో విడిపోయారు. దీంతో ఇద్దరూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. బాల్యవివాహాల నిషేధ చట్టం కింద వివాహాన్ని రద్దు చేయాలని భర్త పిటిషన్ వేశాడు. మరోవైపు, భార్య క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 కింద భరణం కోరింది. 2025 ఆగస్టులో ఫరీదాబాద్ ఫ్యామిలీ కోర్టు.. భార్యకు నెలకు రూ.2,500 మధ్యంతర భరణం చెల్లించాలని భర్తను ఆదేశించింది.

భరణం చెల్లించలేనని భర్త ఎందుకు వాదించాడు?

Advertisement

తాను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినని, ప్రస్తుతం సొంత ఆదాయం లేదని భర్త హైకోర్టుకు తెలిపాడు. తన కుటుంబం మొత్తం తల్లి పొందుతున్న నెలకు రూ.3,000 వితంతు పింఛన్‌పైనే ఆధారపడి ఉందని వాదించాడు. భార్య తన తల్లిదండ్రులు, నలుగురు సోదరులతో కలిసి ఉంటోందని కూడా పేర్కొన్నాడు. వారు ఆర్థికంగా బాగున్నందున తాను భరణం చెల్లించాల్సిన అవసరం లేదని వాదించాడు.

హైకోర్టు ఏం చెప్పిందంటే?

చదువుకుంటున్నాడనే కారణంతో భర్త తన చట్టపరమైన బాధ్యత నుంచి తప్పించుకోలేడని హైకోర్టు స్పష్టం చేసింది. భరణం ఉద్దేశం భార్య ఆహారం, దుస్తులు, నివాసం వంటి కనీస అవసరాలను తీర్చడంలో సహాయపడటమేనని వివరించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 2015లో షమీమా ఫరూఖీ వర్సెస్ షాహిద్ ఖాన్ కేసులో ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. భర్త నుంచి విడిపోయిన మహిళ ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన ఎదుర్కోకుండా చూడటం భరణం నిబంధనల ముఖ్య ఉద్దేశమని పేర్కొంది.

Advertisement

Also Read: భర్త సంపాదన నెలకు రూ.11 వేలు.. విడాకుల తరువాత భార్యకు నెలవారీ రూ.25000 చెల్లించాలన్న కోర్టు

నెలకు రూ.2,500 భరణం ఎందుకు కొనసాగింది?

భర్త ఆరోగ్యంగా ఉన్నాడని, సంపాదించే సామర్థ్యం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఆదాయం లేదని అతను సమర్పించిన అఫిడవిట్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించడం సరైనదేనని పేర్కొంది. రోజువారీ కూలీలు కూడా నెలకు సుమారు రూ.12,000 నుంచి రూ.13,000 సంపాదించగలరని కోర్టు ప్రస్తావించింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను, భార్య కనీస అవసరాలను పరిగణనలోకి తీసుకుంది.
నెలకు రూ.2,500 కూడా ఆమె జీవన అవసరాలకు సరిపోవడం కష్టమని పేర్కొంది. అందువల్ల భరణాన్ని తగ్గించడానికి కారణం లేదని తేల్చింది. చివరకు భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసి, కింది కోర్టు ఆదేశాలను కొనసాగించింది.

Also Read: కార్పొరేట్ జాబ్ వద్దు వ్యవసాయం ముద్దు.. పొలం బాట పడుతున్న కోట్ల మంది గ్రాడ్యుయేట్లు

 

Related News

సంచలనం రేపుతున్న సెన్సార్ బోర్డ్‌ డేటా లీక్.. 500 చిత్రాలకు రికార్డులు బయటకు

కోపంతో మరిది ప్రైవేటు పార్ట్స్ కొరికిన వదిన, ఎన్నికుట్లు పడ్డాయంటే, యూపీలో షాకింగ్ ఘటన

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. జేఈఈ మెయిన్స్-2027 రిజిస్ట్రేషన్ మొదలు, కీలక మార్పులివే

ప్రేమ పేరుతో 20 మంది లేడీ కానిస్టేబుళ్లను పడేసిన కేటుగాడు.. కానీ చివరికి..?

యూపీలో దారుణం.. బైక్‌ను ఢీకొట్టి.. ఒంటిపై నుంచి కారు ఎక్కించి..

జామియా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులు, గార్డుల మధ్య ఘర్షణ.. తరగతులు ఆన్‌లైన్‌కు మళ్లింపు!

ర్యాపిడో డ్రైవర్ ముసుగులో జైషే ఉగ్రవాది.. కస్టమర్లను ఎక్కించుకుంటూ.. పాక్‌తో కలిసి ఉగ్ర కుట్రలు!

Big Stories

Advertisement
×