E-Paper
Advertisement

TCL P7K 55 Ich QLED TV: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే QLED డిస్ప్లే.. TCL P7K స్మార్ట్ టీవీ పూర్తి రివ్యూ!

TCL P7K 55 Ich QLED TV: తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే QLED డిస్ప్లే.. TCL P7K స్మార్ట్ టీవీ పూర్తి రివ్యూ!
Advertisement

TCL P7K 55 Ich QLED TV: ప్రస్తుతం చాలా మంది పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా 55 ఇంచ్ టీవీలు ఇంట్లో సినిమా థియేటర్ లాంటి అనుభవం ఇస్తాయి. అలాంటి సమయంలో బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో వచ్చిన టీవీగా TCL P7K 55 ఇంచ్ Ultra HD 4K Smart QLED TV బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. రూ. 38,990 ధరలో క్యూ ఎల్ఈడీ స్క్రీన్, 4కే రిజల్యూషన్ వంటి ఫీచర్లు రావడం దీనికి ప్రత్యేకత. మరి ఈ టీవీ నిజంగా కొనడానికి బెస్ట్ సమయం ఇదేనా ? దీని ఫీచర్లు, పని తీరు గురించి వివరంగా తెలుసుకుందాం.

TCL P7K 55 inch 4K QLED TV పూర్తి వివరాలు:

Advertisement

ఇప్పుడు మార్కెట్లో చాలా కంపెనీలు 4కె టీవీలను అందిస్తున్నాయి. కానీ తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే టీవీలు కొంచెం తక్కువగానే ఉంటాయి. అలాంటి టీవీలలో టీసీఎల్ P7K 55P7K ఒకటి. ఈ టీవీ 55 ఇంచ్ పెద్ద స్క్రీన్‌తో వస్తుంది. కుటుంబంతో కలిసి సినిమాలు చూడటానికి, స్పోర్ట్స్ చూడటానికి ఇది చాలా బాగుంటుంది.

ఫీచర్లు:
ఈ టీవీలో క్యూఎల్ఈగీ డిస్ప్లే ఉండటం వల్ల కలర్స్ చాలా బ్రైట్‌గా , క్లియర్‌గా కనిపిస్తాయి. 4K రిజల్యూషన్ (3840 × 2160) ఉండటం వల్ల విజువల్స్ చాలా షార్ప్‌గా కనిపిస్తాయి. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూ ట్యూబ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో సినిమాలు చూస్తే మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అలాగే డాల్బీ విజన్, HDR సపోర్ట్ ఉండటం వల్ల డార్క్ సీన్స్‌లో కూడా మంచి క్లారిటీ ఉంటుంది.

Advertisement

సౌండ్:
సౌండ్ విషయానికి వస్తే ఈ టీవీలో 20W స్పీకర్లు ఉన్నాయి. అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండటం వల్ల సౌండ్ కొంచెం థియేటర్ ఫీలింగ్ ఇస్తుంది. చిన్న గదుల్లో ఈ సౌండ్ సరిపోతుంది. కానీ పెద్ద హాల్‌లో వాడితే ఒక సౌండ్‌బార్ వేసుకుంటే ఇంకా మంచి అనుభవం వస్తుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ టీవీలో 3 HDMI పోర్ట్స్ , 2 యూఎస్ బీ పోర్ట్స్ ఉన్నాయి. దీని వల్ల సెట్ అప్ బాక్స్, గేమింగ్, సౌండ్ బార్ లాంటి డివైస్‌లను సులభంగా కనెక్ట్ చేయవచ్చు. అలాగే వైఫై , బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. అందుకే ఇంటర్నెట్ ద్వారా ఓటీటీ యాప్స్ వాడటం చాలా సులభం.

Also Read: డాల్బీ అట్మోస్ సౌండ్.. 4K క్లారిటీ, LG కొత్త టీవీ ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

స్పెషాలిటీ:
ఈ టీవీలో CA75 + CA55 1.3GHz ప్రాసెసర్ ఉంది. అలాగే 2GB RAM , 16GB స్టోరేజ్ కూడా ఉంటుంది. సాధారణంగా OTT యాప్స్ వాడటానికి ఇది సరిపోతుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూ ట్యూబ్  లాంటి యాప్స్ స్మూత్‌గా పని చేస్తాయి. రిమోట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్ యాక్సెస్ కూడా చేసుకోవచ్చు.

డిజైన్ విషయానికి వస్తే ఈ టీవీ చాలా సింపుల్ ,స్టైలిష్‌గా ఉంటుంది. బరువు సుమారు 10.5 కిలోలు ఉంటుంది. గోడకు మౌంట్ చేయడానికి లేదా టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా బాగానే సరిపోతుంది. టీవీ పవర్ కన్సంప్షన్ సుమారు 200W ఉంటుంది.

మొత్తం మీద చూసుకుంటేరూ. 38,990 ధరలో ఈ టీవీ మంచి ఫీచర్లను అందిస్తుంది. పెద్ద స్క్రీన్, క్యూ ఎల్ఈడీ డిస్ప్లే, డాల్బీ అట్మోస్, వంటి ఫీచర్లు ఉండటం వల్ల ఇది మంచి టీవీగా చెప్పొచ్చు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

 

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×