E-Paper
Advertisement

LG UA8200 55 inch TV: డాల్బీ అట్మోస్ సౌండ్.. 4K క్లారిటీ, LG కొత్త టీవీ ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

LG UA8200 55 inch TV: డాల్బీ అట్మోస్ సౌండ్.. 4K క్లారిటీ, LG కొత్త టీవీ ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!
Advertisement

LG UA8200 55 Inch TV: ప్రస్తుతం ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతిని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే విజువల్స్ , సౌండ్ అందించే టీవీల కోసం వెతుకుతున్న వారికి LG UA8200 (55UA82006LA) ఒక మంచి ఆప్షన్. రూ. 41,490 ధరలో లభించే ఈ 55 ఇంచుల 4కె ఆల్ట్రా హెచ్డీ టీవీ, స్మార్ట్ ఫీచర్లతో పాటు డాల్బీ అట్మోస్ ఆడియోను అందిస్తుంది. బ్రాండ్ వాల్యూ, నాణ్యతను కోరుకునే సామాన్యులకు ఇది ఒక పర్ఫెక్ట్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు.

LG UA8200 55-inch Ultra HD 4K Smart TV.. పూర్తి వివరాలు:
మీరు ఒక కొత్త టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మరీ ముఖ్యంగా 55 ఇంచుల పెద్ద స్క్రీన్, 4K రిజల్యూషన్ అది కూడా LG లాంటి నమ్మకమైన బ్రాండ్ నుంచి కావాలనుకుంటే.. ఈ LG UA8200 మోడల్ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Advertisement

డిస్ప్లే , పిక్చర్ క్వాలిటీ:
ఈ టీవీలో ప్రధానమైంది దీని 55 ఇంచుల భారీ LED స్క్రీన్. ఇది 4K ఆల్ట్రా హెచ్డీ రిజల్యూషన్‌తో (3840 x 2160 pixels) వస్తుంది. అంటే సాధారణ హెచ్డీ టీవీల కంటే 4 రెట్లు ఎక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఉన్న హెచ్డీఆర్ సపోర్ట్ వల్ల రంగులు చాలా సహజంగా, కాంట్రాస్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్ మన కళ్ల ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక 60 Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల విజువల్స్ స్మూత్‌గా ఉంటాయి. గేమింగ్ ఆడేవారికి ఇది ఒక డీసెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

అదిరిపోయే ఆడియో:
చాలా టీవీల్లో పిక్చర్స్ బాగుంటాయి కానీ సౌండ్ అంతగా బాగుండదు. కానీ LG ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఇచ్చింది. దీని వల్ల సౌండ్ చుట్టూ ఆవరించినట్లుగా ) వినిపిస్తుంది. ఇందులో 20W అవుట్‌పుట్ ఇచ్చే రెండు స్పీకర్లు ఉన్నాయి. గది మొత్తం సౌండ్ సరి పోతుంది. మీరు గనక ఒక చిన్న ఇంట్లో ఉంటే.. దీనికి విడిగా హోమ్ థియేటర్ కూడా అవసరం లేనంత క్లారిటీగా శబ్దం వస్తుంది.

Advertisement

Also Read: ప్లాస్టిక్ కూలర్ vs ఐరన్ కూలర్.. సమ్మర్‌లో ఏది కొంటే మీ ఇల్లు కూల్‌గా ఉంటుంది?

స్మార్ట్ ఫీచర్లు , పెర్ఫార్మెన్స్:
ఇది ఒక కంప్లీట్ స్మార్ట్ టీవీ. ఇందులో 2 జీబీ ర్యామ్ , 8 జీబీ స్టోరేజ్ ఇచ్చారు. దీని వల్ల యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు లేదా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటివి చూసేటప్పుడు టీవీ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవుతుంది. మీకు ఇష్టమైన ఫోన్ కంటెంట్‌ను టీవీలో చూడటానికి స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ కూడా ఉంది. వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీలు ఇన్-బిల్ట్‌గా వస్తాయి. దీని రిమోట్‌లో డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండటం వల్ల బ్రౌజింగ్ చేయడం చాలా ఈజీ.

కనెక్టివిటీ , డిజైన్:
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. మీరు ఒకేసారి సెట్-టాప్ బాక్స్, ప్లే స్టేషన్ లేదా ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 USB పోర్ట్ కూడా ఉంది. ఇక డిజైన్ పరంగా ఇది 68 mm మందంతో స్లిమ్ గానే ఉంటుంది. అయితే దీని బరువు 7.3 kg ఉండటం వల్ల కొంచెం ‘హెవీ’గా అనిపిస్తుంది. టీవీని టేబుల్‌పై పెట్టడం కంటే వాల్ మౌంట్ (గోడకు తగిలించడం) చేస్తే లుక్ చాలా బాగుంటుంది.రూ. 41,490 ధరలో 55 ఇంచుల పెద్ద స్క్రీన్, 4K క్వాలిటీ, LG బ్రాండ్ భరోసా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

Related News

రూ.54,999 ఫోన్ ఇప్పుడు ఇంత తక్కువకా? Vivo Y51 Pro 5Gపై క్రేజీ ఆఫర్!

iPhone 17 కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,000 వరకు ఆదా చేసుకునే ఛాన్స్!

QR స్కాన్ అవసరం లేదు.. ట్యాప్ చేస్తే చాలు, UPIలో కొత్త పేమెంట్ ఫీచర్!

వాట్సప్ నెంబర్ మార్చేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తే.. మీ పాత చాట్స్ అన్నీ గోవిందా!

స్లిమ్ లుక్‌తో అదరగొడుతున్న Samsung Galaxy S26 FE.. భారత్‌లో దీని ధరెంతంటే?

రూ.9,000 డిస్కౌంట్‌తో శాంసంగ్ గెలాక్సీ A56 5G.. ఇంతకంటే బెస్ట్ ఆఫర్ మళ్లీ రాదు!

బరువు తగ్గడం ఇక ఈజీ.. ఒప్పో నుంచి అధునాతన ‘ఫ్యాట్ బర్నింగ్ వాచ్’ వచ్చేస్తోంది!

యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!

Big Stories

Advertisement
×