Tecno Camon 50 Pro| స్మార్ట్‌ఫోన్ కంపెనీ టెక్నో తన కెమోన్ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ( MWC) 2026లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లు టెక్నో కెమోన్ 50, టెక్నో కెమోన్ 50 ప్రో. బలమైన కెమెరాలు, పెద్ద బ్యాటరీలు, AMOLED డిస్‌ప్లేలతో వస్తాయి. సరసమైన ధరలో మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకునేవారికి ఈ ఫోన్లు బాగుంటాయి.
టెక్నో కెమోన్ 50 ధర.. కెన్యా కరెన్సీ KES 37,500 (భారత కరెన్సీలో దాదాపు రూ.26,000). టెక్నో కెమోన్ 50 ప్రో ధర KES 44,000 (దాదాపు రూ.31,000). ఫిబ్రవరి 23 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. కెమోన్ 50 ఆరు కలర్ ఆప్షన్లలో వస్తుంది. మూన్‌లైట్ బ్లాక్, మలాకైట్ గ్రీన్, నెబ్యులా టైటానియం, ఫిర్ గ్రీన్, లవెండర్ మిస్ట్, మింట్ క్రీమ్ ఉన్నాయి. కెమోన్ 50 ప్రోలో కూడా ఇలాంటి కలర్లు ఉన్నాయి. ఇంకా ఏథిరియల్ బ్లూ కలర్ ప్రత్యేకంగా ఉంది.
కెమోన్ 50లో 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రెజల్యూషన్‌తో వస్తుంది. HiOS 16 సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ చిప్‌సెట్ ఉంది. రియర్ కెమెరాలో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. డ్యూయల్ స్పీకర్లు డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో వస్తాయి. 6150mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఫోన్ సైజు 162.37 x 77.17 x 7.53 mm.
Also Read: ఎయిర్ ఫ్రైయర్‌లో ఈ వంటకాలు చేయకూడదు.. అందరూ చేసే తప్పులు ఇవే
టెక్నో కెమోన్ 50 ప్రోలో 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, 1.5K రెజల్యూషన్ ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ అనుభవం ఇస్తుంది. Android 16 ఆధారిత HiOS 16 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G200 అల్టిమేట్ చిప్‌సెట్, 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఉన్నాయి.
రియర్ కెమెరాలో 50MP మెయిన్ (OIS సపోర్ట్), 50MP 3X టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. 4G, వై ఫై, బ్లూటూత్, GPS, NFC సపోర్ట్ ఉన్నాయి. FM రేడియో, USB Type-C, OTG, IR రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. డ్యూయల్ స్పీకర్లు డాల్బీ అట్మాస్‌తో వస్తాయి. 6150mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఫోన్ సైజు 162.37 x 76.97 x 7.38 mm.
టెక్నో కెమోన్ 50 సిరీస్ కెమెరా పెర్ఫామెన్స్, బ్యాటరీ లైఫ్‌పై దృష్టి పెట్టింది. రెండు మోడల్స్ హై రిఫ్రెష్ రేట్ AMOLED డిస్‌ప్లేలు ఇస్తాయి. ప్రో వెర్షన్‌లో టెలిఫోటో లెన్స్, OIS సపోర్ట్ ఉన్నాయి. పెద్ద బ్యాటరీల వల్ల ఎక్కువ సమయం ఉపయోగించవచ్చు. పెర్ఫామెన్స్, స్టైల్ కావాలనుకునేవారికి ఈ ఫోన్లు బాగుంటాయి.