E-Paper
Advertisement

Air Fryer No Cooking: ఎయిర్ ఫ్రైయర్‌లో ఈ వంటకాలు చేయకూడదు.. అందరూ చేసే తప్పులు ఇవే

Air Fryer No Cooking: ఎయిర్ ఫ్రైయర్‌లో ఈ వంటకాలు చేయకూడదు.. అందరూ చేసే తప్పులు ఇవే
Advertisement

Air Fryer No Cooking| ఈ రోజుల్లో ఇంట్లో వంటలు చేయడానికి ఎయిర్ ఫ్రైయర్లు బాగా పాపులర్ అవుతున్నాయి. ఎయిర్ ఫ్రైయర్‌ సహాయంలో తక్కువ నూనెతో వంట చేసేయవచ్చు. చాలా మంది కొత్తగా వీటిని ఉపయోగించే వారు ఇందులో ఎక్కువగా ఫ్రోజెన్ స్నాక్స్‌తో వండుతున్నారు. అయితే ఇందులో ఏమి వండవచ్చో, ఏమి వండలేమో ముందుగా తెలుసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ చాలా రకాల వంటలు చేయడానికి బాగా పనిచేస్తుంది. అయితే అన్ని వంటలు ఇందులో చేయడం సరికాదు. అందుకే ఏవి ఇందులో వండవచ్చో, ఏమి వండకూడదో చూద్దాం.

ఎయిర్ ఫ్రైయర్‌లో బాగా వండే ఆహారాలు

  • ఫ్రోజెన్ స్నాక్స్ (ఫ్రైస్, నగెట్స్, స్ప్రింగ్ రోల్స్) అద్భుతంగా వస్తాయి. క్రిస్పీగా ఉంటాయి. నూనె వాసన రాదు. సరైన టైమింగ్ సెట్ చేస్తే ఎప్పుడూ మంచి రిజల్ట్ వస్తుంది.
  • హోమ్‌మేడ్ కట్లెట్స్, టిక్కీలు బాగా వండవచ్చు. ఫర్మ్ మిక్స్‌తో చేస్తే క్రిస్పీ ఔటర్ లేయర్ వస్తుంది. కొద్దిగా నూనె బ్రష్ చేస్తే మరింత బెటర్. మృదువైన మిక్స్‌తో చేస్తే ఫ్లిప్ చేసేటప్పుడు పగిలే అవకాశం ఉంది.
  • రోస్టెడ్ వెజిటబుల్స్ (కాలీఫ్లవర్, క్యారెట్స్, బ్రోకలీ, బంగాళదుంపలు) అద్భుతంగా వస్తాయి. సమానంగా కట్ చేస్తే అన్ని ఒకే రకంగా వండుతాయి. బాస్కెట్‌లో ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెడితే స్టీమ్ అవుతాయి, క్రిస్పీగా కూడా రావు.
  • పనీర్, టోఫు కూడా బాగా వండవచ్చు. డ్రై స్పైస్ రబ్ ఉపయోగిస్తే బాగుంటుంది. వాటరీ మెరినేషన్ చేయకూకూడదు. టోఫును ముందు ప్రెస్ చేసి నీరు తీసేయాలి.
  • చికెన్ వింగ్స్, బోన్‌లెస్ పీసెస్ ఇందులో వండితే బాగుంటాయి. థిక్ మెరినేడ్ ఉపయోగిస్తే బెటర్. చిన్న బ్యాచ్‌లలో వండితే మంచి బ్రౌనింగ్ వస్తుంది. ఫర్మ్ ఫిష్ బాగా వండుతుంది. సాఫ్ట్ ఫిష్ త్వరగా డ్రై అవుతుంది.

ఎయిర్ ఫ్రైయర్‌లో వండకూడని ఆహారాలు

  • వెట్ బ్యాటర్ ఫుడ్స్ (పకోడాలు, వడ, బజ్జీలు) ఇందులో వేయిస్తే బాగుండవు. బ్యాటర్ (కలిపిన పిండి) బాస్కెట్‌కు అతుక్కుంటుంది. అసమానంగా వస్తాయి. ఇవి డీప్ ఫ్రై చేయడమే మంచిది.
  • కర్రీలు, గ్రేవీలు ఎయిర్ ఫ్రైయర్‌లో వండకూడదు. లేవు. లిక్విడ్ ఉండాలి, స్టిర్ చేయాలి. డ్రై హీట్ వల్ల సరిగా వండవు.
  • లీఫీ గ్రీన్స్ (పాలకూర, లెట్యూస్) వంటివి కొంత ఉడికి మరికొంత ఉడకవు. బరువు తక్కువగా ఉండడం వల్ల ఆకులు బాస్కెట్‌లో ఎగురుతాయి. అంచులు కాలిపోతాయి.
  • పెద్ద కుటుంబాల కోసం ఇందులో వంట చేయాలంటే సరిపోదు. ఓవర్‌లాప్ అయితే అసమానంగా వస్తాయి.
  • మాయిశ్చర్ (తేమ) అవసరమైన ఫుడ్స్ (స్టఫ్డ్ వెజిటబుల్స్) త్వరగా డ్రై అవుతాయి. ఎయిర్ ఫ్రైయర్‌లో మాయిశ్చర్ కంట్రోల్ ఉండదు. అందు కోసం స్టఫ్ చేసిన ఫుడ్స్ వండడానికి ఎయిర్ ఫ్రైయర్ సరికాదు.

Also Read: టివి వినియోగంతో పెరిగిపోతున్న కరెంట్ బిల్లు.. ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి

ఈ తప్పులు చేయకూడదు

Advertisement

బాస్కెట్‌లో ఎక్కువ పెట్టకూడదు. ప్రీహీట్ చేస్తే బ్రౌనింగ్ బాగుంటుంది. కొద్దిగా నూనె మాత్రమే వాడాలి. డీప్ ఫ్రై లేదా ఓవెన్ లాంటి రిజల్ట్ ఆశించకూడదు.

కొనే ముందు ఏమి చూడాలి

కుటుంబ అవసరాలకు తగిన కెపాసిటీ ఎంచుకోండి. వైడ్ టెంపరేచర్ కంట్రోల్ ఉంటే మంచిది. బాస్కెట్ మోడల్స్ స్నాక్స్‌కు, ఓవెన్ స్టైల్ పెద్ద పోర్షన్స్‌కు బాగుంటాయి. సులభంగా క్లీన్ అయ్యే మోడల్ ఎంచుకోండి. మాన్యువల్ కంట్రోల్స్ ఉంటే మంచివి.

Advertisement

ఎయిర్ ఫ్రైయర్ రోస్టింగ్, క్రిస్పింగ్, రీహీటింగ్‌కు బెస్ట్. రోజువారీ వంటలను సులభం చేస్తుంది. సరిగ్గా ఉపయోగిస్తే చాలా ఎఫిషియంట్ కిచెన్ టూల్ అవుతుంది.

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×