E-Paper
Advertisement

Tecno Pova Curve 2 5G: భారత మార్కెట్లోకి టెక్నో పోవా కర్వ్ 2 5G.. దీని లుక్ చూస్తే టెక్ ప్రియులంతా ఫిదా అవ్వాల్సిందే!

Tecno Pova Curve 2 5G: భారత మార్కెట్లోకి టెక్నో పోవా కర్వ్ 2 5G.. దీని లుక్ చూస్తే టెక్ ప్రియులంతా ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో తమ సరికొత్త ‘Tecno Pova Curve 2 5G’ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమైంది. గతేడాది వచ్చిన Pova Curve 5Gకి కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్.. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నట్లు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీ ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా టీజ్ చేసింది.

స్లిమ్ అండ్ స్టైలిష్‌గా..

Space 2.0 డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్.. కేవలం 7.4mm మందం కలిగి ఉండి, చాలా స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. దీని వెనుక భాగంలో మ్యాట్ ఫినిషింగ్‌తో పాటు ట్రయాంగిల్ ఆకారంలో ఉండే కెమెరా మాడ్యూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. దీనిలో 6.78 అంగుళాల కర్డ్వ్ AMOLED స్క్రీన్‌ ఉండే అవకాశం ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.

Advertisement

Also Read: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బు వృథానే!

8000mAh భారీ బ్యాటరీ..

టెక్నో పోవా కర్వ్ 2 5G ప్రత్యేకత ఏమిటంటే.. దీని 8,000mAh బ్యాటరీ. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు కేవలం 194 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే.. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుందని సమాచారం.

ట్రిపుల్ కెమెరా సెటప్..

Advertisement

ఇకపోతే ఫోన్ వెనుక వైపు 3 కెమెరాల సెటప్ ఉంటుంది. దీనిలో 50MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చని అంచనా. అలాగే, AI నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో జతచేయనున్నారు. టెక్నో పోవా కర్వ్ 2 5G ఫోన్ బ్లాక్, సిల్వర్, వైలెట్ కలర్స్‌లో అందుబాటులోకి రానుంది.

ధర ఎంత ఉండొచ్చు?

టెక్నో నుంచి వస్తున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ 5G ఫోన్ ధర రూ.15,000 నుండి రూ.20,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అధికారిక విడుదల తర్వాత ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Also Read: ఒప్పో నుంచి 6,500mAh బ్యాటరీ ఫోన్ లాంచ్.. రూ.14,999కే 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 ఫీచర్లు!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×