VinFast Limo Green MPV: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ ఫాస్ట్ సరికొత్త ఎలక్ట్రిక్ కారును భారతీయ మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. VinFast Limo Green పేరుతో 7 సీటర్ ఎలక్ట్రిక్ MPVని లాంచ్ చేయబోతోంది. ఈ నెలలోనే ఈ ఆవిష్కణ ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారు Kia Carens Clavis, BYD eMax 7 లాంటి టాప్ ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడనుంది. రాబోయే VinFast Limo Green 7 సీటర్ ఎలక్ట్రిక్ MPV డిజైన్, ఫీచర్లు, పవర్ ట్రెయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
VinFast Limo Green ఎలక్ట్రిక్ కారు 4,740mm పొడవు, 1872mm వెడల్పు, 1,782mm ఎత్తు ఉంటుంది. ఇది 2,840mm వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో Limo Green VinFast సిగ్నేచర్ స్టైల్ V ఆకారపు DRLలను కలిగి ఉంది. ఇది DRL కింది ఉండే నిలువు హెడ్ ల్యాంప్ లను కలిగి ఉంటుంది. ఎయిర్ ఇన్ టేక్ ముందు బంపర్ లో ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. వెనుక భాగంలో, ఇది చంక్ బాష్ ప్లేట్ తో కనెక్ట్ చేయబడిన టెయిల్ లైట్లను, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ ను కలిగి కలిగి ఉంటుంది.
విన్ ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ MPV 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఆధారిత ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీఫుల్ డ్రైవింగ్ మోడ్‌లు, సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, USB టైప్ C పోర్ట్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ MPV ముందు భాగంలో 2 సీట్లు, మధ్యలో 3 సీట్లు, మూడవ వరుసలో 2 సీట్లతో మూడు వరుస సీటింగ్‌ను కలిగి ఉంది. ABS, 4 ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంటాయి.
Read Also: ఇక మరింత చౌకగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎందుకో తెలుసా?
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ MPV 4 వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ ను కలగి ఉంటుంది. ఇది 60.13 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఈ కారు ఒకే ఛార్జ్ మీద 450 కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉంటుంది. లిమో గ్రీన్ 11 kW AC ఛార్జింగ్, 80 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటారు ఫ్రంట్ యాక్సిల్ పై ఉంచబడింది. ఇది వరుసగా 201 hp పవర్ 280 Nm టార్క్ ను అందిస్తుంది. ఈ కారుకు సంబంధించిన ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. లాంచ్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.
Read Also: యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!