E-Paper
Advertisement

Tecno Spark 30: అధునాతన ఫీచర్లతో టెక్నో కొత్తఫోన్ లాంచ్.. లుక్ వేరె లెవెల్ మావా!

Tecno Spark 30: అధునాతన ఫీచర్లతో టెక్నో కొత్తఫోన్ లాంచ్.. లుక్ వేరె లెవెల్ మావా!

Tecno Spark 30 Launched: పలు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ సత్తా చాటుతున్న టెక్నో కంపెనీ ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ ఇతర బ్రాండ్‌లకు గట్టి పోటీ ఇస్తుంది. టాప్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఫోన్లను అధిక ధరతో దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేస్తే.. టెక్నో మాత్రం సామాన్యుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే ఫోన్లను రిలీజ్ చేస్తూ పేరు సంపాదించుకుంది. ఇప్పటికే ఎన్నో ఫోన్లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా మరో ఫోన్‌ను విడుదల చేసింది. టెక్నో మరో బడ్జెట్ ఫోన్ Tecno Spark 30ని మార్కెట్లో పరిచయం చేసింది.

ఈ ఫోన్‌ 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఫోన్‌లో 8 GB RAM అందించారు. అదే సమయంలో 256GB వరకు స్టోరేజ్ అందించబడింది. ఇది MediaTek Helio G91 చిప్‌సెట్‌తో వచ్చింది. వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరాతో అమర్చబడింది. కాగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. ఇక ఇప్పుడు ఈ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లు, కలర్ వేరియంట్లు సహా ఇతర వివరాలు తెలుసుకుందాం.

Tecno Spark 30 Specifications

Also Read: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

Tecno Spark 30 ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లేలో సెంటర్ పంచ్ హోల్ డిజైన్ కనిపిస్తుంది. అలాగే ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ వెనుక ప్రధాన కెమెరా ఉంది. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్‌ల సెల్ఫీ కెమెరా అందించారు. Spark 30 ఫోన్ 8 GB RAMని కలిగి ఉంది. అదే సమయంలో 128 GB, 256 GB స్టోరేజ్ ఆప్షన్ ఇవ్వబడింది.

అలాగే ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇందులో MediaTek Helio G91 చిప్‌సెట్‌ అందించబడింది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తుంది. ఇక ఫోన్ సామర్థ్యం కోసం ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. అలాగే సౌండ్ కోసం డ్యూయల్ స్పీకర్లను అందించారు. ఇది Dolby Atmosకి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా వాటర్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఇది IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.

Tecno Spark 30 Price

టెక్నో స్పార్క్ 30 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ప్రస్తుతం టెక్నో టాంజానియా వెబ్‌సైట్‌లో లిస్టింగ్ చేయబడింది. కానీ ఇతర మార్కెట్లలో దీని గురించి సమాచారం ఇంకా వెల్లడికాలేదు. కాగా ఈ ఫోన్ ఆర్బిట్ వైట్, ఆర్బిట్ బ్లాక్ కలర్స్‌లో పరిచయం చేయబడింది.

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×