E-Paper
Advertisement

బస్ స్టాప్‌లలో ఇక ఏసీ ఫీలింగ్.. సరికొత్త టెర్రాకోట టెక్నాలజీ వచ్చిందోచ్!

బస్ స్టాప్‌లలో ఇక ఏసీ ఫీలింగ్.. సరికొత్త టెర్రాకోట టెక్నాలజీ వచ్చిందోచ్!
Advertisement

Terracotta Cooling Bricks: వేసవి కాలంలో రోడ్డుపై ఉండే బస్ స్టాప్‌లు, పబ్లిక్ ప్లాజాలు ఏ స్థాయిలో హీటెక్కుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటి నీడన ఉన్నప్పటికీ విపరీతమైన ఉక్కపోత, వేడి.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయితే ఈ సమస్యకు ఆండ్రిన్ స్టాకర్, లుక్ శ్వైజర్ అనే డిజైనర్లు చెక్ పెట్టారు. వారు ‘బ్లాక్’ (ఇటుక) అనే సరికొత్త టెర్రకోట కూలింగ్ సిస్టమ్‌ను రూపొందించారు. ఇది సంప్రదాయ విద్యుత్ అవసరం లేకుండా కేవలం మట్టి, నీరు, సౌరశక్తి సహాయంతో కూలింగ్ ను అందిస్తాయి. ఈ బ్రిక్స్.. పరిసరాల ఉష్ణోగ్రతను దాదాపు 16°F (8 డిగ్రీలు) వరకు తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా నగరాల్లో ఉండే తారు రోడ్లు, కాంక్రీట్ కట్టడాలు పగటిపూట ఎండను పీల్చుకుని.. రాత్రి వేళల్లో ఆ వేడిని బయటకు విడుదల చేస్తుంటాయి. అందుకే సూర్యాస్తమయం అయ్యాక కూడా నగరాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అయితే జ్యురిక్ యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లో ఇండస్ట్రియల్ డిజైన్ చదువుతున్న ఇద్దరు యువకులు దీనికి చెక్ పెట్టేలా సరికొత్త ఇటుకను ఆవిష్కరించారు. ఈ సిస్టమ్.. 3D ప్రింటెడ్ టెర్రకోట (కాల్చిన మట్టి)తో తయారైంది. మట్టి పాత్రల తరహాలోనే వేడి గాలి తడి మట్టి గుండా ప్రసరించినప్పుడు నీరు ఆవిరై (Evaporation) గాలి చల్లబడుతుంది. ఒక చిన్న సోలార్ ఫ్యాన్ ద్వారా వేడి గాలిని లోపలికి లాగి చల్లని గాలిని బయటకు విడుదల చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో దీనికి 15 గ్యాలన్ల నీరు అవసరమవుతుందని విద్యార్థులు చెబుతున్నారు. అయితే.. దీని పైభాగం వర్షపు నీటిని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.

Advertisement

జ్యురిక్ యూనివర్సిటీ విద్యార్థులు తమ బ్యాచిలర్ థీసిస్‌లో భాగంగా 3D ప్రింటెడ్ టెర్రకోట ఇటుకలను అభివృద్ధి చేశారు. డెలివరీ బాయ్స్, స్కూల్ బయట వేచి ఉండే విద్యార్థులు, బస్ స్టాప్‌లో నిల్చునే వృద్ధులకు… వారు ఉన్న చోటనే తక్షణ ఉపశమనం అందించాలన్న లక్ష్యంతో వీటికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ టెర్రాకోట ఇటుకలతో చిన్నపాటి షెల్టర్ ను నిర్మించి.. వారికి చల్లదనాన్ని ఇవ్వాలని తాము ప్రయత్నిస్తున్నట్లు ఇద్దరు విద్యార్థులు తెలిపారు.

Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పొడగింపు.. ఎప్పటివరకు అంటే?

Advertisement

అయితే నగరాలు మెుత్తాన్ని చల్లబరచడం తమ ఉద్దేశం కాదని.. ప్రజలు ఎక్కువగా తిరిగే చిన్న చిన్న హాట్ స్పాట్ లను లక్ష్యంగా చేసుకొని ఈ ఇటుకలతో బస్ స్టాప్ లు నిర్మించాలని భావిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో పర్యావరణానికి హాని చేసే ఎలాంటి గ్యాస్‌లు లేవని పేర్కొంటున్నారు. కేవలం సోలార్ పవర్, నీటితోనే ఇది పనిచేస్తుందని తెలిపారు. విద్యుత్ బిల్లులు భరించలేని పేద వర్గాలకు, కరెంట్ కొరత ఉన్న ప్రాంతాలకు ఇది ఎంతో మేలు చేస్తుందని స్పష్టం చేశారు. కాగా స్టాకర్, లుక్ శ్వైజర్ అభివృద్ధి చేసిన ఈ డిజైన్ కు ప్రతిష్టాత్మక ‘జేమ్స్ డైసన్ అవార్డు’ (James Dyson Award) సైతం దక్కడం విశేషం.

Also Read: భాగ్యనగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!

Related News

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

Big Stories

Advertisement
×