E-Paper
Advertisement

రైలు మీదకి ఫుడ్ ప్యాకెట్ విసిరిన ప్రయాణికుడు, అసిస్టెంట్ లోకో పైలట్‌ కు తీవ్ర గాయాలు!

రైలు మీదకి ఫుడ్ ప్యాకెట్ విసిరిన ప్రయాణికుడు, అసిస్టెంట్ లోకో పైలట్‌ కు తీవ్ర గాయాలు!
Advertisement

Assistant Loco Pilot Injured: చిన్న ఫుడ్ ప్యాకెట్ వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చింది.  ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న రైలు నుంచి విసిరిన ఫుడ్ ప్యాకెట్ మరో రైలు ఇంజిన్‌ ను బలంగా తాకడంతో లుక్‌ అవుట్ గ్లాస్ పగిలిపోయి, అసిస్టెంట్ లోకో పైలట్ గాయపడ్డారు. ఈ ఘటనతో కొంతసేపు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యారు.

అర్థరాత్రి సమయంలో ఘటన

ఈ ఇన్సిడెంట్ జూన్ 3, 4 తేదీల మధ్య రాత్రి సింగరాయకొండ, ఉలవపాడు రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్తున్న 12616 గ్రాంట్ ట్రంక్ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్ వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  ఎదురుగా వస్తున్న ఎర్నాకులం-బిలాస్‌ పూర్ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ ప్రెస్‌ లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫుడ్ ప్యాకెట్‌ ను బయటకు విసిరినట్లు తెలుస్తోంది. ఆ ప్యాకెట్ వేగంగా ప్రయాణిస్తున్న గ్రాంట్ ట్రంక్ ఎక్స్‌ ప్రెస్ ఇంజిన్‌ ను తాకింది. దీంతో ఇంజిన్ ముందు భాగంలో ఉన్న లుక్‌ అవుట్ గ్లాస్ పగిలిపోయింది.

అసిస్టెంట్ లోకో పైలెట్ కు తీవ్ర గాయాలు

Advertisement

గాజు ముక్కలు ఎగిరిపడటంతో అసిస్టెంట్ లోకో పైలట్ ఎం. జయరామ్‌ కు గాయాలయ్యాయి. ఆయనకు రక్తస్రావం కావడంతో వెంటనే రైలును అత్యవసర బ్రేకులతో నిలిపివేశారు. అనంతరం రైల్వే సిబ్బంది అంబులెన్స్‌ కు సమాచారం ఇచ్చి గాయపడిన సిబ్బందిని సమీప ఆసుపత్రికి తరలించారు.

https://twitter.com/sanatan_kannada/status/2062871678506721319

దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

Advertisement

ఘటన తర్వాత రైల్వే అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రెండు రైళ్ల సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గ్రాంట్ ట్రంక్ ఎక్స్‌ ప్రెస్ గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రెండు రైళ్లు అధిక వేగంతో ఎదురెదురుగా వెళ్తున్న సమయంలో విసిరిన వస్తువు తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు ఇంజిన్ సమీపంలో ఆహార పదార్థాల అవశేషాలు, రక్తపు మరకలను గుర్తించినట్లు సమాచారం. అయితే ఘటనకు సంబంధించి స్పష్టమైన సీసీటీవీ ఆధారాలు లభించలేదని తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైళ్ల నుంచి వస్తువులు బయటకు విసరడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని సంఘం తెలిపింది. రైల్వే సిబ్బంది భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని కోరింది.

Read Also: భారీ శబ్దంతో చీలిపోయిన రైలు బోగి.. భయంతో ప్రయాణికుల పరుగులు!

Related News

తీరొక్క గణనాథులకు కేరాఫ్.. ధూల్ పేట్ లో అడుగు పెడితే ధూమ్ ధామే!

వినాయకుడి నిమజ్జనమే కాదు.. ఆగమనమూ రచ్చే! తెలంగాణలో వైరల్ అవుతున్న కొత్త ట్రెండ్!

11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!

భారీ వర్షాలకు దెబ్బతిన్న ట్రాక్.. రైళ్ల రాకపోకలకు బ్రేక్!

రైళ్లలో ఇక చెత్తబుట్టలు నిండిపోవు.. ఇండియన్ రైల్వే సూపర్ ప్లాన్!

వర్షాల దెబ్బకు కుంగిన రైల్వే ట్రాక్.. ఏకంగా 14 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, తిరుపతి సహా 8 రైళ్ల టైమింగ్స్ ఛేంజ్!

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

Big Stories

Advertisement
×