BigTV English

Best Smart Phones List 2024 : ధరతో పాటు ఫీచర్స్ కెవ్వుకేక.. తాజాగా లాంఛ్ అయ్యి దూసుకుపోతున్న బెస్ట్ మెుబైల్స్ ఇవే!

Best Smart Phones List 2024 : ధరతో పాటు ఫీచర్స్ కెవ్వుకేక.. తాజాగా లాంఛ్ అయ్యి దూసుకుపోతున్న బెస్ట్ మెుబైల్స్ ఇవే!

Best Smart Phones List 2024 : తాజాగా లాంఛ్ అయిన టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ హాట్ కేక్స్ అయిపోతున్నాయి. సామ్ సాంగ్, ఐక్యూ, రెడ్ మీ, మోటోరోలా మొబైల్స్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇక రీసెంట్ గా లాంఛ్ అయిన మొబైల్స్ లో ఏ మొబైల్స్ టాప్ లో ఉన్నాయో ఒకసారి చూసేద్దాం.


స్మార్ట్ ఫోన్స్ కు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఎప్పటికప్పుడు టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ తమ ఓల్డ్ వెర్షన్స్ కు భిన్నంగా లేటెస్ట్ అప్డేట్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేస్తున్నాయి. అప్డేట్స్ ను మారుస్తున్నప్పటికీ అందుబాటు ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక తాజాగా లాంఛ్ అయిన టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఈ మొబైల్స్ డిస్ ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యంతో పాటు అన్ని విషయాల్లో టాప్ లో నిలిచాయి. అయితే వీటిలో క్వాలిటీతో పాటు అందుబాటు ధరల్లో ఉన్న టాప్ మోస్ట్ మొబైల్స్ ఏవంటే..

Samsung Galaxy S23 Ultra 5G – 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌, 6.8-అంగుళాల QHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌, 12GB వరకు RAMతో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్ సెట్ తో ఈ మెుబైల్ లాంఛ్ అయింది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో 200-మెగాపిక్సెల్ ISOCELL HP2 సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ ఉన్నాయి.


One Plus 13 – వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంఛ్ అయింది. క్వాడ్ కర్వుడ్ స్క్రీన్,  24GB LPDDR5 x RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ ను పెంచుకునే అవకాశం ఉంది.

Samsung Galaxy A16 5G – ఈ మెుబైల్  6.7 అంగుళాల ఫుల్‌ HD డిస్ ప్లే + అమోలెడ్‌ డిస్‌ ప్లేతో వచ్చింది. 90 Hz రిఫ్రెష్‌ రేట్, మీడియా టెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌, మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సపోర్ట్​తో 1 టీబీ వరకు స్టోరేజ్​ కెపాసిటినీ పెంచుకునే అవకాశం ఇందులో ఉంది.

iQOO 11 5G – ఈ మెుబైల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్, 16GB RAM అల్ట్రా-రెస్పాన్సివ్ 144Hz E6 డిస్‌ప్లేతో లాంఛ్ అయింది. రీసెంట్ గా లాంఛ్ అయిన మెుబైల్స్ లో ది బెస్ట్ గా నిలుస్తుంది.

Redmi Note 12 Pro+ – ఈ మెుబైల్ 200 మెగాపిక్సెల్ కెమెరాతో లాంఛ్ అయింది. చీకటిలో సైతం ది బెస్ట్ ఫోటోలను ఈ ఫోన్ తో తీసే అవకాశం ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ప్రో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek డైమెన్సిటీ 1080 చిప్ సెట్ తో పనిచేస్తుంది.

Redmi K50i – ఆక్టాకోర్ మీడియా టెక్ డైమన్ సిటీ ప్రాసెసర్, 6.6 అంగుళాల FHD డిస్ ప్లే, 144 HZ రిఫ్రెష్ రేట్, 16 MP  సెల్ఫీ కెమెరా, 5080mah ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ ఫోన్ లాంఛ్ అయింది.

ALSO READ : ఒక్కరోజు తేడాతో వచ్చేస్తున్న రియల్ మీ, ఒప్పో.. మరి వీటిలో బెస్ట్ మెుబైల్ ఏదంటే!

 

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×