BigTV English

Appudo Ippudo Eppudo Trailer: ప్లే బాయ్ పాత్రలో నిఖిల్.. డివైజ్ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్

Appudo Ippudo Eppudo Trailer: ప్లే బాయ్ పాత్రలో నిఖిల్.. డివైజ్ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్

Appudo Ippudo Eppudo Trailer: ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరోల్లో నిఖిల్ ఒకడు. తన ప్రతీ సినిమాకు, మరొక సినిమాకు సంబంధం లేని జోనర్లలో కథలను ఎంచుకుంటూ ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తుంటాడు ఈ యంగ్ హీరో. అలాంటి హీరో ఒక సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను సైలెంట్‌గా పూర్తి చేసి ఏకంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా చేశాడు. అదే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. విడుదలకు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ మూవీ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్.


ఇద్దరు అమ్మాయిలను ట్రాప్

‘రేసర్ అవ్వాలనేది వీడి కల’ అంటూ సత్య చెప్పే డైలాగ్‌తో ‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ట్రైలర్ మొదలవ్వగానే ఫారిన్ రోడ్లపై కార్‌తో స్టంట్స్ చేస్తుంటాడు నిఖిల్ (Nikhil). ఇక తన క్యారెక్టర్ ఏంటో వివరిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో సత్య వాయిస్‌లో డైలాగులు వినిపిస్తుంటాయి. ‘రేసర్ కల నిజమయ్యేవరకు బ్రతకడానికి డబ్బులు కావాలి కాబట్టి’ అని చెప్తూ డైలాగ్ ఆగిపోతుంది. అప్పుడే తార పాత్రలో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఎంట్రీ ఇస్తుంది. డబ్బుల కోసం తార అనే డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాడని ట్రైలర్ మొదట్లోనే అర్థమవుతుంది. తారను మాత్రమే కాదు తులసి పాత్రలో కనిపించే దివ్యాంశను కూడా ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తాడు హీరో.


Also Read: నితిన్ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాదే రెండు సినిమాలు

మర్డర్ మిస్టరీ

‘ఆ డబ్బులు సరిపోక పార్ట్ టైమ్ కూడా ప్లాన్ చేసుకున్నాడు’ అని సత్య చెప్తుండగానే నిఖిల్.. ఏదో మర్డర్ ప్లాన్‌లో భాగమయినట్టు చూపిస్తారు. అలా నిఖిల్ క్యారెక్టర్‌లో మరో యాంగిల్ మొదలవుతుంది. ఊహించిన చిక్కుల్లో ఇరుక్కుంటాడు. ఒకవైపు పోలీసులు, మరోవైపు రౌడీ గ్యాంగ్ తన వెంటపడుతుంటారు. వారందరికీ కావాల్సింది డివైజ్. అసలు డివైజ్ ఏంటో తెలియక నిఖిల్‌తో పాటు తన ఫ్రెండ్ వైవా హర్ష కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ‘‘ప్రతీవాడు నా లైఫ్‌తో గేమ్ ఆడేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాళ్ల గేమ్ వాళ్లకంటే నేను బాగా ఆడడం మొదలుపెడితే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను’’ అంటూ ఎవరికీ తెలియకుండా ఒక తప్పించుకునే ప్లాన్ వేస్తాడు నిఖిల్.

ఆ డివైజ్ ఏంటి

‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’లో సత్య, వైవా హర్ష లాంటి యాక్టర్లు ఉండడం వల్ల యాక్షన్‌తో పాటు కామెడీ కూడా బాగానే వర్కవుట్ అవ్వనుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక ప్లే బాయ్‌గా ఇద్దరు హీరోయిన్లను ఒకేసారి ప్రేమిస్తూ మ్యానేజ్ చేసే హీరో.. అసలు ఆ డివైజ్ గోలలో ఎలా చిక్కుకుంటాడు అనే అంశం ట్రైలర్‌లో ఆసక్తికరంగా మారింది. అసలు అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అని ఇంట్రెస్ట్‌ను ప్రేక్షకుల్లో క్రియేట్ చేసేలా ఉంది. వరుసగా డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ ఎంటర్‌టైన్ చేసే నిఖిల్.. ఈసారి ఒక యాక్షన్ థ్రిల్లర్‌తో అలరించడానికి సిద్ధమయ్యాడు. నవంబర్ 8న ‘అప్పుడో ఇప్పుడు ఎప్పుడో’ థియేటర్లలో విడుదల కానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×