E-Paper
Advertisement

iPhone EMI Risk: రూ.లక్ష విలువ చేసే ఐఫోన్ ఈఎంఐలో కొంటున్నారా? ఆర్థికంగా భారీ నష్టమే ఎందుకంటే

iPhone EMI Risk: రూ.లక్ష విలువ చేసే ఐఫోన్ ఈఎంఐలో కొంటున్నారా? ఆర్థికంగా భారీ నష్టమే ఎందుకంటే
Advertisement

iPhone EMI Risk| భారతదేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఆదాయం మితంగా ఉన్నా చాలా మంది ఖరీదైన ఫోన్లు.. సులభ EMI ఆప్షన్ల ద్వారా కొంటున్నారు. ఒకప్పుడు రూ.1 లక్ష విలువైన ఫోన్ లగ్జరీగా అనిపించేది. కానీ ఇప్పుడు నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లు (ఈఎంఐ) ద్వారా ఈ ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు విక్రయించే షాపులు EMIలను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి.

ఈఎంఐ ప్లాన్లు.. ఫోన్ ఖరీదుని నెలల సంఖ్య ఆధారంగా విభజిస్తాయి. దీంతో ఫోన్ కొనుగోలు చేసే సమయంలో ఆర్థిక ఒత్తిడి ఉండదు. కానీ ఈ సులభ ఈఎంఐలు నిజమైన ఆర్థిక ఒత్తిడిని దాచిపెడతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతినెలా కుటుంబ ఖర్చుల కోసం ఆర్థిక భారం మోసే సామాన్యులు తమ నెలవారీ ఖర్చులో ఫోన్ EMI జోడించడం వల్ల నెలవారీ బడ్జెట్ మరింత భారమవుతుంది.

ఈఎంఐ ఆప్షన్ల సౌలభ్యం

Advertisement

EMI ప్లాన్లు.. ఖరీదైన ఫోన్లను చౌకగా కనిపించేలా చేస్తాయి. పూర్తి ధర ఒకేసారి చెల్లించకుండా చిన్న చిన్న నెలవారీ చెల్లింపులు చేయవచ్చు. చాలా మందికి పెద్ద మొత్తంలో చెల్లింపు చేయడం కంటే నెలవారీ చెల్లింపులు చేయడం సులభంగా అనిపిస్తుంది. ఈ సౌలభ్యం వల్ల మధ్య తరగతి ప్రజలు కూడా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కొంటున్నారు. దీంతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ల విక్రయాల పెరిగి వాటికి డిమాండ్ ఏర్పడింది. ఈ సెగ్మెంట్‌లో ఎక్కువగా ఆపిల్ ఐఫోన్ మోడల్స్ ఉన్నాయి. చాలా మోడల్స్ ధర రూ.1 లక్షకు పైగా ఉంటుంది. EMI చూస్తే సులభంగా అనిపించినా, మొత్తం ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయాలి.

EMIలో ఫోన్ కొనడం ఎప్పుడు సరైన నిర్ణయం?

ఈ నిర్ణయం తీసుకునేముందు ప్రీమియం ఫోన్ కొనుగోలు చేయాల్సిన అవసరం, ఉద్దేశ్యం ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం లేదా వృత్తి పరంగా ఫోన్ అవసరమైతే అంత ఖర్చు పెట్టడం సరైన నిర్ణయమే. కంటెంట్ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు అడ్వాన్స్ ఫీచర్లు ఉన్న ఫోన్లపై ఆధారపడతారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఖర్చు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకూడదు. ఖరీదైన గాడ్జెట్ల వల్ల సామాన్యులకు ముఖ్యమైన సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ల స్థానంలో చేయకూడదు.

EMIలను జాగ్రత్తగా చెక్ చేయడం అవసరం

Advertisement

యువతలో చాలా మంది ఇప్పటికే చాలా రకాల ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఈ జాబితాలో ఎడ్యుకేషన్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లు సాధారణం. ఈ భారీ జాబితాలో మరో స్మార్ట్‌ఫోన్ ఈఎంఐ జోడిస్తే ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. అందుకే మీ ఆదాయ పరిమితి, అప్పుని బాగా లెక్కించాలి. అప్పులతో నెలవారీ ఈఎంఐలు మీ నెలవారీ ఆదాయాన్ని పోల్చుకోవాలి. అప్పులు.. ఆదాయంలో 40 శాతం కంటే తక్కువగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. ఎక్కువ ఉంటే ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.

ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి

మీ ఆదాయం, ఖర్చుల బడ్జెట్ ఆధారంగా.. ఆర్థిక ప్రణాళికలు ప్లాన్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. కొత్త ఈఎంఐ తీసుకునే ముందు కనీసం 6 నెలల ఖర్చులకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అన్ని ఈఎంఐల మొత్తం కూడా ఇందులో ఉండాలి. ఇది ఆర్థిక సంక్షోభంలో లోన్ డిఫాల్ట్‌ను నివారిస్తుంది.

ఈఎంఐల కోసం ఎంత ఆదాయం వెచ్చించాలి?

నెలవారీ లోన్ చెల్లింపులకు కఠిన పరిమితి ఉండాలి. మొత్తం ఈఎంఐలు గ్రాస్ నెలవారీ ఆదాయంలో 30 శాతం మించకూడదు. అప్పుడే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. 40 శాతం పైగా వెచ్చిస్తే రిస్క్ పెరుగుతుంది. 50 శాతం దాటితే తీవ్ర రుణ సమస్యలు వస్తాయి.

ఐఫోన్ కొనుగోలు చేస్తే ఈఎంఐ నిజమైన భారం ఎంత?

ఉదాహరణకు ప్రీమియం ఐఫోన్ మోడల్ ధర రూ.1,34,900 అయితే.. 12 నెలల ఈఎంఐతో కొనుగోల చేస్తే నెలకు సుమారు రూ.11,242 చెల్లించాలి. ఇది చాలా మందికి సులభంగా అనిపిస్తుంది. కానీ కస్టమర్ ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. నెలకు రూ.1 లక్ష సంపాదించే వారికి ఆదాయం ఇది 11 శాతం మాత్రమే. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి దీని వల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.

కస్టమర్లు చేసే సాధారణ తప్పు

చాలా మంది ఈఎంఐ నెలవారీ మొత్తం మీదే దృష్టి పెడతారు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావాన్ని పట్టించుకోరు. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ విలువ త్వరగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎలెక్ట్రానిక్స్ ఉపకరణాలు డిప్రిసియేటింగ్ అసెట్స్ అంటే విలువ తరిగిపోయే ఆస్తులు. ఫోన్ కొనుగోలు చేసే డబ్బుని మరో రకంగా పెట్టుబడి చేస్తే దాని విలువ పెరుగుతుంది. పైగా ఈఎంఐలలో కొన్ని రహస్య ఫీజులు, డిస్కౌంట్లు కోల్పోవడం వల్ల కూడా ఖర్చు పెరిగిపోతుంది.

Also Read: వాట్సాప్‌లో యాడ్స్‌తొ విసిగిపోతున్నారా? ఇలా బ్లాక్ చేయండి

ప్రీమియం ఫోన్ కొనే ముందు ఈ నియమాన్ని పాటించాలి

ఆర్థిక నిపుణులు ఈఎంఐల కోసం సరళ నియమాలు సూచిస్తున్నారు. “వన్ మంత్ రూల్” అంటే ఫోన్ ధర.. మీ నెలవారీ నికర జీతం (అన్ని కటింగ్స్ పోను చేతికి అందే సాలరీ) కంటే ఎక్కువ ఉండకూడదు. ఈఎంఐ ఎంచుకునే ముందు సేవింగ్స్, పెట్టుబడి, దీర్ఘకాలిక లక్ష్యాలను అంచనా వేయాలి. ఫోన్ కొనుగోలు ఆర్థిక భద్రతను బలహీనపరచకూడదు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×