Whatsapp Ads Block| ఇప్పుడు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం సాధారణ విషయమైపోయింది. ఏ వస్తువైనా ఆన్‌లైన్ లో సెర్చ్ చేసి అందరూ ఆర్డర్లు పెట్టేస్తున్నారు. కంపెనీలు కూడా తమ సేల్స్ పెంచుకునేందుకు, తమ ప్రొడక్ట్‌లను ప్రమోట్ చేయడానికి ఆన్‌లైన్ యాడ్స్ (ప్రకటనలు), నోటిఫికేషన్లు పంపుతాయి. కొన్నిసార్లు మన వాట్సాప్‌లోనే ప్రకటన మెసేజ్‌లు వస్తాయి.
షాపింగ్ చేయడానికి మీరు ఏదైనా వెబ్‌సైట్ విజిట్ చేసినా, గూగుల్ లో ఏదైనా వస్తువు షాపింగ్ కోసం వెతికినా లేదా ఆఫర్‌లకు సైన్ అప్ చేసినా కంపెనీలు మన నెంబర్, లాగిన్ మెయిల్ ఐడీలు సేవ్ చేసుకుంటాయి. తర్వాత డిస్కౌంట్‌లు, డీల్స్, కొత్త ప్రొడక్ట్‌ల గురించి మెసేజ్‌లు పంపుతాయి. ఈ యాడ్ మెసేజ్‌లు బిజినెస్ అకౌంట్ల నుంచి వస్తాయి. ఎక్కువగా వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వాట్సాప్‌లో వీటిని బ్లాక్ చేయడానికి సులభమైన ఆప్షన్లు ఉన్నాయి.
కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఉపయోగించి కస్టమర్లు ఉపయోగించే యాప్స్ లో యాడ్స్ ఇస్తాయి. మనం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినప్పుడు లేదా ఆఫర్‌లకు సైన్ అప్ చేసినప్పుడు మన వాట్సాప్ నెంబర్ సేవ్ అవుతుంది. తర్వాత డిస్కౌంట్‌లు, కొత్త ప్రొడక్ట్‌ల గురించి మెసేజ్‌లు పంపుతారు. ఈ మెసేజ్‌లు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ల నుంచి వస్తాయి. కొన్నిసార్లు రోజూ వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అయితే వీటిని వాట్సాప్ సెట్టింగ్స్‌లో సులభంగా నియంత్రించవచ్చు.
మొదట మీ స్మార్ట్‌ఫోన్ అన్‌లాక్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయండి. ప్రకటనలు పంపుతున్న కంపెనీ చాట్‌ను ఓపెన్ చేయండి. ఆ చాట్‌లో ఏదైనా యాడ్ మెసేజ్‌పై ట్యాప్ చేయండి. స్క్రీన్ పైన “i” (ఇన్ఫర్మేషన్) ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు “Interested”, “Not Interested” అనే రెండు ఆప్షన్లు వస్తాయి. మీకు యాడ్స్ కావాలంటే “Interested” సెలెక్ట్ చేయండి. యాడ్స్ అవసరం లేకపోతే “Not Interested” సెలెక్ట్ చేయండి.
“Not Interested” సెలెక్ట్ చేస్తే మరిన్ని ఆప్షన్లు వస్తాయి. మొదటి ఆప్షన్ “Stop Offers and Announcements”. దీన్ని సెలెక్ట్ చేస్తే ఆ కంపెనీ నుంచి యాడ్స్, ఆఫర్లు ఆగిపోతాయి. కంపెనీ చాట్ లిస్ట్‌లో ఉండవచ్చు కానీ ఆఫర్ మెసేజ్‌లు రావు. మరో ఆప్షన్ కంపెనీ అకౌంట్‌ను పూర్తిగా బ్లాక్ చేయడం. ఇది సెలెక్ట్ చేస్తే ఆ కంపెనీ నుంచి భవిష్యత్తులో ఏ విధిమైన మెసేజ్‌లు రావు. మీకు ఎప్పుడైనా మార్పు కావాలంటే అన్‌బ్లాక్ చేయవచ్చు.
యాడ్స్ మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నప్పుడు బ్లాక్ చేయడం మంచిది. అనవసరమైన లేదా ఇబ్బందికరమైన అప్‌డేట్స్ వస్తున్నప్పుడు కూడా బ్లాక్ చేయవచ్చు. బ్లాక్ చేసిన తర్వాత ఆ కంపెనీ నుంచి మెసేజ్‌లు రావు. మీకు మళ్లీ కావాలంటే అన్‌బ్లాక్ చేయవచ్చు.
తెలియని వెబ్‌సైట్‌లలో ఫోన్ నెంబర్ షేర్ చేయకండి. ఆఫర్‌లు, న్యూస్‌లెటర్లకు సైన్ అప్ చేసేముందు ప్రైవసీ పాలసీ చదవండి. ప్రమోషనల్ నోటిఫికేషన్లను డిజేబుల్ చేయండి. వాట్సాప్ చాట్‌లను రెగ్యులర్‌గా చెక్ చేసి అనవసరమైనవి ఆపండి. ఈ చిన్న టిప్స్‌తో యాడ్స్ మెసేజ్‌లను గణనీయంగా తగ్గించవచ్చు.
Also Read: స్మార్ట్‌ఫోన్‌లో యాడ్స్‌తో విసిగిపోయారా? ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో బ్లాక్ చేయండి
ప్రకటన మెసేజ్‌లు కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వాట్సాప్ సులభమైన టూల్స్ ఇచ్చింది. “Not Interested” ఆప్షన్ ఉపయోగించి సులభంగా యాడ్స్ ఆపవచ్చు. అవసరమైతే కంపెనీ అకౌంట్‌ను బ్లాక్ చేయవచ్చు. ఈ సెట్టింగ్స్ మేనేజ్ చేస్తే వాట్సాప్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.