E-Paper
Advertisement

Internet Real Owner: ఇంటర్నెట్‌ ఓనర్ ఎవరు?.. ఒకే కంపెనీ చేతిలో పవర్

Internet Real Owner: ఇంటర్నెట్‌ ఓనర్ ఎవరు?.. ఒకే కంపెనీ చేతిలో పవర్
Advertisement

Internet Real Owner| నేటి డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్‌ లేకుండా ఏ పని జరగదు. ఇంటర్నెట్ లేకుంటే ప్రపంచమంతా స్తంభించిపోయింది. అంటే ఇంటర్నెట్ చాలా పవర్ ఫుల్. అలాంటి పవర్‌ఫుల్ ఆయుధం ఎవరి చేతుల్లో ఉంటే వారు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నట్లే. అయితే ఈ ఇంటర్నెట్ యజమాని ఎవరు? అనేది ఒక ఆసక్తికర ప్రశ్న. ఈ ఇంటర్నెట్‌కు ఒక్కడే యజమాని ఉన్నాడా? లేదా చాలా మంది ఓనర్లు ఉన్నారా అని చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. దీనికి సమాధానంగా చాలా మంది నెటిజెన్లు గూగుల్ కంపెనీ ఇంటర్నెట్ పై ఆధిపత్యం చెలాయిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది నిజమా? కాదా? అని ఇటీవల రెడ్డిట్‌లో అనే చర్చ హాట్ టాపిక్ అయింది.

“గూగుల్ అంటేనే ఇంటర్నెట్” అని వైరల్ అవుతున్న పోస్ట్

ఒక యూజర్ అరిన్ వర్మ అనే వ్యక్తి X (ట్విట్టర్)లో రాశాడు: “గూగుల్ అంటేనే ఇంటర్నెట్”. ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. చాలా మంది దీన్ని నిజమే అనుకుంటారు, ఎందుకంటే మన రోజువారీ జీవితంలో గూగుల్ వినియోగం భారీ స్థాయిలో ఉంది.

గూగుల్ చేతిలో భారీ సామ్రాజ్యం

  • ప్రపంచంలో 90 శాతం కంటే ఎక్కువ సెర్చ్‌లు గూగుల్‌లోనే జరుగుతాయి.
  • యూట్యూబ్, ఆండ్రాయిడ్ ఫోన్స్, జీమెయిల్, క్రోమ్ బ్రౌజర్, గూగుల్ మ్యాప్స్.. ఇవన్నీ గూగుల్ సొంతం.
  • యాడ్స్ ద్వారా, క్లౌడ్ సర్వీసెస్ ద్వారా గూగుల్ లక్షల కోట్లు సంపాదిస్తోంది.
  • AI రంగంలో జెమినీ, క్లాడ్ AIకి చిప్స్ ఇవ్వడం, ఆంథ్రోపిక్, స్పేస్‌ ఎక్స్‌ లాంటి బడా కంపెనీల్లో గూగుల్‌ షేర్లు కలిగి ఉంది.
Advertisement

ఇవన్నీ చూస్తేనే తెలుస్తోంది.. ఇంటర్నెట్‌పై గూగుల్ ప్రభావం ఎలాంటిదో.

కానీ ఒక ఫన్నీ కామెంట్ నిజం బయటపెట్టింది

రెడ్డిట్‌లో ఒక యూజర్ ఫన్నీ పోస్ట్ చేశాడు. “గూగుల్‌ను టాటా కమ్యూనికేషన్స్ నడిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ కేబుల్స్ టాటా చేతిలో ఉన్నాయి. కేబుల్స్ లేకపోతే గూగుల్ డేటాను పోస్టల్ సర్వీస్‌లో పంపాల్సి వస్తుంది!” అని రాశాడు. ఇది జోక్ లా అనిపించినా.. ఇందులో కొంతవరకు నిజం ఉంది.

ఇంటర్నెట్ కేబుల్స్ చేతిలో ఎవరి చేతిలో ఉన్నాయి

Advertisement

ఇంటర్నెట్ అంటే కేవలం యాప్స్, వెబ్‌సైట్స్ మాత్రమే కాదు. సముద్రం అడుగున ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ఖండాంతరాలు అనుసంధానమవుతాయి. ఈ కేబుల్స్, భారీ డేటా సెంటర్స్ టెలికాం కంపెనీల ఆధీనంలో ఉంటాయి. గూగుల్ వీటిలో కొన్నింటిని కలిగి ఉన్నా, మిగతా కంపెనీలు కూడా ఇలాంటి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. అంటే ఇంటర్నెట్ యజమాన్యం ఒక్క కంపెనీ చేతిలో మాత్రమే లేదు. దీనికి చాలామంది యజమానులు ఉన్నారు.

గూగుల్ మాయలో ప్రజలు

మనం రోజూ గూగుల్ సెర్చ్ చేస్తాం, యూట్యూబ్‌లో వీడియో చూస్తాం, మ్యాప్ ఉపయోగిస్తాం.. ఇవన్నీ గూగుల్ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే “గూగుల్ అంటేనే ఇంటర్నెట్” అని అనిపిస్తుంది. కానీ అది ఒక భ్రమ మాత్రమే.

అందరి సహకారంతో నడిచే ఇంటర్నెట్

ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అందరూ కలిసి తయారు చేసినవే.
డొమైన్ పేర్లను ICANN అనే సంస్థ నిర్వహిస్తుంది.
అమెజాన్ (క్లౌడ్), మైక్రోసాఫ్ట్ (అజూర్, లింక్డ్‌ఇన్), మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్).. ఇలా అనేక భారీ కంపెనీలు కలిసి ఇంటర్నెట్‌ను నడిపిస్తున్నాయి.

Also Read: 24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×