E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిని భయపెట్టే బాయ్ ఫ్రెండ్ దెయ్యం.. రాత్రి పూట వాషింగ్ మిషిన్ లో పిల్ల పిశాచి … చూస్తే వణుకే

OTT Movie : అమ్మాయిని భయపెట్టే బాయ్ ఫ్రెండ్ దెయ్యం.. రాత్రి పూట వాషింగ్ మిషిన్ లో పిల్ల పిశాచి … చూస్తే వణుకే
Advertisement

OTT Movie : హారర్ అంథాలజీ ఫార్మాట్ లో స్టోరీలను బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు. డిఫరెంట్ స్టోరీలను చూపిస్తూ ఆడియన్స్ కి కొత్త కిక్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంథాలజీ సినిమా సూపర్‌నాచురల్ థీమ్‌తో నడుస్తుంది. మూడు వేర్వేరు షార్ట్ స్టోరీలతో ప్రతి ఒక్కటి ఒక డార్క్ సీక్రెట్ తో భంకరమైన ముగింపును ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ ఇండియన్ హిందీ హారర్ యాంథాలజీ వెబ్ మూవీ పేరు ‘ఎపిలాగ్’. డానిష్ ఖాన్, కృణాల్ రానే డైరెక్టర్స్ గా ఈ సినిమాకి పని చేశారు. గోవింద్ ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో రూచిరా జాధవ్, కుంజికా కల్వింట్, అక్షయ్ కెల్కర్, తేజస్ రౌత్ మొదలైనవారు లీడ్ రోల్స్ లో నటించారు. యూట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాకి ఐయండిబిలో 7.3/10 ఉంది.

మొదటి కథ

Advertisement

అనన్యకి గతంలో ఒక లవర్ ఉన్నాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే అనన్యే అతన్ని డబ్బు కోసం చంపించింది. ఇప్పుడు ఆ బాయ్‌ఫ్రెండ్ భూతంగా తిరిగి వచ్చి ఆమెని రోజూ టార్చర్ చేస్తుంటాడు. గోడల మీద రక్తంతో నన్ను చంపావు కదా అని రాస్తాడు. గొంతు పిసుకుతూ బాత్‌రూమ్ మిర్రర్‌లో కనిపిస్తాడు. అనన్య మానసికంగా కుంగిపోతుంది. సైకియాట్రిస్ట్‌ దగ్గరికి వెళ్తుంది కానీ లాభం ఉండదు. చివర్లో భూతం ఆమెకి ఆత్మహత్య చేసుకోమంటాడు. ఆమె ఇంటి ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోతుంది. కెమెరా జూమ్ అవుట్ అయితే… ఆ భూతం నవ్వుతూ కనిపిస్తాడు. ఇదంతా ఆ భూతం ప్లాన్!

రెండవ కథ

ప్రియా అనే ఒక అమ్మాయి PGలో ఉంటుంది. ఆ ఇంట్లో పాత వాషింగ్ మెషిన్ ఉంటది. దాన్ని ఎవరూ యూజ్ చేయరు. ఒక రోజు ప్రియా రాత్రి 2 గంటలకి వాషింగ్ వేస్తుంది. మెషిన్ సడెన్‌గా భయంకరమైన శబ్దాలు చేస్తుంది. లోపల నుంచి రక్తం కారుతుంది. మెషిన్ తెరిచి చూస్తే ఒక చిన్న పిల్లవాడి చేయి కనిపిస్తుంది. ప్రియాకి ఫ్లాష్‌బ్యాక్ గుర్తుకు వస్తుంది. ఆమె గతంలో అబార్షన్ చేయించింది. ఇప్పుడు ఆ బేబీ స్పిరిట్ తిరిగి వచ్చి, ప్రియాని మెషిన్‌లోకి పూర్తిగా లాగేస్తుంది. ఇప్పుడు మెషిన్ మళ్లీ సైలెంట్ అయిపోతుంది.

మూడవ కథ

Advertisement

నలుగురు కాలేజీ ఫ్రెండ్స్ రాత్రి ఫారెస్ట్‌లో క్యాంప్ వేసుకుంటారు. అమావాస్య రోజు కాబట్టి చంద్రుడు కనిపించడు. వాళ్లలో ఒక అబ్బాయికి సడన్‌గా కళ్లు తెల్లబడి, నోటి నుంచి నురగ వస్తుంది. ఆతనిలో చంద్రుడి కర్స్ వల్ల డెవిల్ పాసెస్ అయిపోతుంది. అతను రాత్రంతా మిగతా ముగ్గురిని వేటాడతాడు. చివర్లో సూర్యోదయం అవుతుంది. కర్స్ తొలగిపోతది. తేజస్ స్పృహలోకి వస్తాడు. కానీ కెమెరా జూమ్ అవుట్ అయితే చంద్రుడు మళ్లీ వస్తున్నట్టు చూపిస్తారు. అంటే కర్స్ మళ్లీ మొదలవుతదని అర్థం!

Read Also : భర్తను చంపి డాన్ అయ్యే భార్య … గన్ పట్టుకునే కోడళ్ళు … ఒక్కో సీన్ చూస్తే

మూడు స్టోరీలూ ముగిసిన తర్వాత ఒక చిన్న కనెక్టింగ్ సీన్ వస్తుంది. మూడు స్టోరీలలో ఒకే ఒకే డెమాన్ కనిపిస్తుంది. ప్రతి స్టోరీలో గిల్టీ పర్సన్‌ని శిక్షిస్తూ వెళ్తుంది. ఎండింగ్ షాట్‌లో ఆ డెమాన్ నాలుగో ఇంటి దగ్గర నిలబడుతది. ‘టూ బి కంటిన్యూడ్’ తో స్టోరీ ముగుస్తుంది.

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×