E-Paper
Advertisement

మోడ్రన్ కిచెన్స్‌లో ‘బెస్పోక్’ హవా.. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్!

మోడ్రన్ కిచెన్స్‌లో ‘బెస్పోక్’ హవా.. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్!
Advertisement

Bespoke refrigerators: ఇల్లంతటికీ ఒక ఎత్తయితే.. కిచెన్ లుక్ ఒక ఎత్తు. ఒకప్పుడు వంటగది అంటే కేవలం వంట చేసుకునే స్థలం మాత్రమే.. కానీ ఈ రోజుల్లో అది ఒక లగ్జరీ స్టేటస్ సింబల్. ముఖ్యంగా హై-ఎండ్ కిచెన్ డిజైనింగ్‌లో ఇప్పుడు సరి కొత్త ట్రెండ్ నడుస్తోంది.. అదే ‘బెస్పోక్ రిఫ్రిజిరేటర్స్’ (Bespoke Refrigerators). పాతకాలపు బోరింగ్, ఒకే రకమైన రంగుల్లో ఉండే ఫ్రిజ్‌ల కాలం చెల్లిపోయింది. మీ కిచెన్ క్యాబినెట్లకు, ఇంటీరియర్ థీమ్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతూ.. మీ టేస్ట్ ని ప్రతిబింబించేలా  ఉండే ఈ ఫ్రిజ్‌లు మార్కెట్‌ను నేడు రూల్ చేస్తున్నాయి.

అసలు ఏంటి ఈ బెస్పోక్ మ్యాజిక్?

‘బెస్పోక్’ అంటేనే మనకు నచ్చినట్టు, మన అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయించుకోవడం. బట్టలు, కార్ల విషయంలో విన్న ఈ పదం ఇప్పుడు హోమ్ అప్లయెన్సెస్, ముఖ్యంగా ఫ్రిజ్ లలో బాగా పాపులర్ అయింది. మార్కెట్‌లో దొరికే స్టాండర్డ్ సిల్వర్, గ్రే లేదా బ్లాక్ కలర్ ఫ్రిజ్‌ల స్థానంలో.. మన కిచెన్ కలర్ ప్యాలెట్‌కు సెట్ అయ్యేలా ఫ్రిజ్ ముందరి ప్యానెల్స్ మార్చుకునే వీలును ఈ ట్రెండ్ కల్పిస్తోంది. మ్యాట్ ఫినిషింగ్, గ్లాస్ లుక్, క్లాసిక్ టెరాకోటా, రోజ్ గోల్డ్.. ఇలా ఒకటేంటి, బోలెడు ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

హై-ఎండ్ కిచెన్స్ ఎందుకు బెస్ట్?

ఈ రోజుల్లో ఇళ్లను డిజైన్ చేయించుకునే వారు ప్రతి చిన్న వస్తువులోనూ యూనిక్‌నెస్ కోరుకుంటున్నారు. కిచెన్ లోపలికి అడుగుపెట్టగానే పెద్దగా, పొడుచుకు వచ్చినట్టు ఉండే పాత ఫ్రిజ్‌లు ఇప్పుడు ఎవరికీ నచ్చడం లేదు. బెస్పోక్ ఫ్రిజ్ కిచెన్ గోడల్లో లేదా క్యాబినెట్లలో కలిసిపోయి, ‘ఇంటిగ్రేటెడ్ లుక్’ ఇస్తాయి. అంటే.. అక్కడ ఫ్రిజ్ ఉందనే విషయం కూడా తెలియనంత నీట్‌గా, ఫ్లష్‌గా ఇవి సెట్ అయిపోతాయి. ప్రీమియం లుక్ కోరుకునే సెలబ్రిటీలు, ఇంటీరియర్ లవర్స్‌కు ఇది బాగా నచ్చేసింది.

Advertisement

ఫీచర్లు కూడా నెక్స్ట్ లెవెల్:
కేవలం లుక్ మాత్రమే కాదు.. టెక్నాలజీ పరంగా కూడా ఈ బెస్పోక్ ఫ్రిజ్‌లు అదరగొడుతున్నాయి.

ఫ్లెక్సిబుల్ జోన్స్: మీకు నచ్చినప్పుడు డీప్ ఫ్రీజర్‌ను నార్మల్ ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు.

స్మార్ట్ కనెక్టివిటీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో లోపల ఏ వస్తువులు ఉన్నాయి. ఏవి అయిపోవచ్చాయి అనేది మీ ఫోన్ ద్వారానే ట్రాక్ చేయవచ్చు.

ఎనర్జీ ఎఫిషియెన్సీ: లగ్జరీ లుక్‌తో పాటు కరెంట్ బిల్లు కూడా తక్కువ వచ్చేలా లేటెస్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీని వాడుతున్నారు.

మారిన కస్టమర్ల మైండ్‌సెట్:
ఈ ఏడాదిలో ప్రజలు హోమ్ డెకర్‌ను తమ పర్సనాలిటీకి అద్దం పట్టేలా చూసుకుంటున్నారు. వంటగది అనేది కేవలం వంట వండే చోటు కాదు, స్నేహితులతో కలిసి ముచ్చటించే.. కాఫీ తాగే ఒక సోషల్ స్పేస్. అందుకే.. అక్కడ ఉండే వస్తువులు కూడా క్లాస్‌గా ఉండాలని ఆశిస్తున్నారు. బెస్పోక్ ఫ్రిజ్‌లు ఈ అవసరాన్ని వంద శాతం తీరుస్తున్నాయి. మీకు ఎప్పుడైనా కిచెన్ కలర్స్ మార్చాలనిపిస్తే.. మొత్తం ఫ్రిజ్ మార్చక్కర్లేదు, కేవలం దాని ఫ్రంట్ ప్యానెల్స్ మారిస్తే సరిపోతుంది.

మొత్తానికి చెప్పాలంటే.. హై-ఎండ్ కిచెన్ డిజైనింగ్‌లో బెస్పోక్  ప్రిజ్ లు కేవలం ట్రెండ్ కాదు.. ఇది ఫ్యూచర్ హోమ్ డిజైన్‌కు ఒక పునాది. లగ్జరీ, టెక్నాలజీ, పర్సనల్ స్టైల్.. ఈ మూడింటి కలయికే ఈ బెస్పోక్ ఫ్రిజ్. మీ వంటగదికి ఒక రాయల్, మోడ్రన్ లుక్ ఇవ్వాలనుకుంటే, బెస్పోక్ వైపు అడుగులు వేయడం బెస్ట్ ఛాయిస్.

Related News

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Big Stories

Advertisement
×