E-Paper
Advertisement

త్వరలో సియెర్రా EV, దీపావళికి సఫారీ EV.. టాటా ప్లాన్ మామూలుగా లేదుగా!

త్వరలో సియెర్రా EV, దీపావళికి సఫారీ EV.. టాటా ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

Tata Motors EV Launches: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUVలతో దూసుకెళ్తుండటంతో, టాటా మోటార్స్ కూడా తన EV పోర్ట్‌ ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. మొదటగా టాటా సియెర్రా EV జూలై-సెప్టెంబర్ 2026 మధ్య విడుదల కానుందని సమాచారం. ఆ తర్వాత దీపావళి పండుగ సీజన్‌ లో టాటా సఫారీ EVను మార్కెట్లోకి తీసుకురానున్నారు.

టాటా సియెర్రా ఈవీ గురించి..

టాటా సియెర్రా EV కంపెనీకి అత్యంత కీలకమైన ఎలక్ట్రిక్ SUVగా భావిస్తున్నారు. ఎందుకంటే, ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఈ-విటారా, మహీంద్రా BE 6, విన్‌ఫాస్ట్ VF6 లాంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది. ఈ SUVను టాటా  కొత్త Acti.ev+ ప్లాట్‌ ఫారమ్‌ మీద నిర్మిస్తున్నారు. ఈ ప్లాట్‌ ఫారమ్ వల్ల లోపల ఎక్కువ స్థలం, పెద్ద బ్యాటరీలను అమర్చే అవకాశం లభిస్తుంది. సియెర్రా EVను రెండు బ్యాటరీ ఆప్షన్లతో తీసుకురావచ్చని అంచనా. ఒకటి 55 kWh బ్యాటరీ కాగా, మరోటి 65 kWh బ్యాటరీ.  రేంజ్ విషయానికి వస్తే, ARAI ధృవీకరణ ప్రకారం సుమారు 540 నుంచి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చు. వాస్తవ పరిస్థితుల్లో 400 నుంచి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఫీచర్ల పరంగా కూడా సియెర్రా EV ఆకట్టుకునే అవకాశం ఉంది. లెవెల్ 2+ ADAS, 360 డిగ్రీల కెమెరా, V2L , V2V ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఆధునిక సాంకేతికతలను అందించనున్నారు. అలాగే ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో డ్రైవర్ డిస్‌ ప్లే, సెంట్రల్ టచ్‌ స్క్రీన్, కో ప్యాసింజర్ కోసం ప్రత్యేక ఎంటర్‌ టైన్‌ మెంట్ స్క్రీన్ ఉండనున్నాయి.

టాటా సఫారీ ఈవీ గురించి..

ఇక టాటా సఫారీ EV..  కంపెనీ ఫ్లాగ్‌షిప్ 7 సీటర్ ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది. దీపావళి నాటికి దీనిని అధికారికంగా మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. సఫారీ EV కూడా Acti.ev+ ప్లాట్‌ ఫారమ్‌ పైనే తయారవుతోంది. ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందించే అవకాశం ఉంది. ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉంది. వాస్తవ పరిస్థితుల్లో 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. ఈ SUVలో రియర్ వీల్ డ్రైవ్ సెటప్ స్టాండర్డ్‌ గా ఉండగా, టాప్ వేరియంట్లలో డ్యూయల్ మోటార్ AWD సిస్టమ్‌ ను అందించనున్నారు.  ఆఫ్ రోడ్, స్నో లాంటి ప్రత్యేక డ్రైవింగ్ మోడ్‌ లు కూడా ఉండనున్నాయి.

Advertisement

Read Also: ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ వచ్చేశాయి.. ఇప్పుడు కొనడం మంచిదేనా?

Related News

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×