E-Paper
Advertisement

Smartphone Hidden Feature: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఆ చిన్న హోల్ ఎందుకో తెలిస్తే.. పొరపాటున కూడా పిన్ను పెట్టరు!

Smartphone Hidden Feature: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఆ చిన్న హోల్ ఎందుకో తెలిస్తే.. పొరపాటున కూడా పిన్ను పెట్టరు!
Advertisement

Smartphone Hidden Feature: మనందరం రోజూ గంటల కొద్దీ వాడుతున్న స్మార్ట్‌ఫోన్ పైన ఉండే ఆ చిన్న రంధ్రం దేని కోసం ఇచ్చారో చాలామందికి అవగాహన లేకపోవచ్చు. అయితే కొంతమంది దీనిని ఏదో డిజైన్ అనుకుంటే.. మరికొందరు ఫోన్ రీసెట్ చేయడానికి ఇచ్చే బటన్ అని పొరపడుతుంటారు. కానీ, స్మార్ట్‌ఫోన్ పనితీరులో ఈ హోల్ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఫోన్‌కు ఉన్న ఈ చిన్న రంధ్రం చేసే పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఆ హోల్ ఎందుకు?

నిజానికి ఫోన్ పైన ఉండే ఆ చిన్న రంధ్రం ఒక సెకండరీ మైక్రోఫోన్. మన ఫోన్ కింద ఉండే ప్రధాన మైక్రోఫోన్ మనం మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తే, ఈ రెండో మైక్రోఫోన్ చుట్టుపక్కల ఉండే శబ్దాలను గమనిస్తూ ఉంటుంది. మనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తికి మన మాటలు స్పష్టంగా వినిపించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

Advertisement

Also Read: యాపిల్ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ఇక ఐఫోన్ వాడకం పూర్తిగా మారనుంది!

శబ్దాలను ఎలా నియంత్రిస్తుంది?

దీనిని ‘నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్’ అని కూడా పిలుస్తారు. మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ట్రాఫిక్ సౌండ్, గాలి లేదంటే పక్కనే ఎవరైనా మాట్లాడుతున్న శబ్దాలను ఇది గుర్తిస్తుంది. ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ సాయంతో ఈ అనవసరమైన శబ్దాలను తగ్గించి, కేవలం మీ గొంతును మాత్రమే అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. దీంతో ఎంతటి నాయిస్ ఉన్న ప్రదేశంలో అయినా సరే, మన వాయిస్ చాలా క్లియర్‌గా ఉంటుంది.

పొరపాటున కూడా అలా చేయొద్దు:

Advertisement

చాలామంది సిమ్ కార్డ్ తీసే పిన్‌ను పొరపాటున ఈ మైక్రోఫోన్ రంధ్రంలో పెట్టి గట్టిగా నెడుతుంటారు. దీనివల్ల లోపల ఉండే సున్నితమైన మైక్రోఫోన్ పాడయ్యే ప్రమాదం ఉంది. ఒక్కసారి అది దెబ్బతింటే.. ఫోన్ కాల్స్ నాణ్యత తగ్గిపోతుంది. అలాగే వీడియోలు తీస్తున్నప్పుడు కూడా ఆడియో సరిగ్గా రికార్డ్ అవ్వదు. అందుకే ఫోన్ సిమ్ ట్రే ఎక్కడ ఉందో చూసుకుని వాడుకోవాలి.

క్లీన్ చేసే విధానం ఇది:

కొన్నిసార్లు ఈ రంధ్రంలో దుమ్ము పేరుకుపోవడం వల్ల మాటలు స్పష్టంగా వినిపించవు. అలాంటప్పుడు పిన్నులు, సూదులు వాడకుండా, నెమ్మదిగా బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఫోన్ కేస్ వాడేటప్పుడు కూడా ఈ రంధ్రం క్లోజ్ అవ్వకుండా చూసుకోవాలి. చాలా చిన్నది అనుకుంటున్న ఈ హోలే మన స్మార్ట్‌ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది.

Also Read: లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న మీ పార్టనర్‌కు కిస్ ఇవ్వాలా? ఇదిగో ఈ గ్యాడ్జెట్ మీ కోసమే!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×