E-Paper
Advertisement

Bad Boy Karthik: నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Bad Boy Karthik: నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Advertisement

Bad Boy Karthik: హీరో నాగ శౌర్య‌ (Naga Shaurya)కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. చాలా కాలంగా ఆయన హిట్ కోసం ఎంతగానో ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ఎంతగా ప్రయత్నించినా, ప్రేక్షకులు మాత్రం అంతగా వాటికి కనెక్ట్ కావడం లేదు. అందుకే ఈసారి, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ (Bad Boy Karthik). ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, హై-వోల్టేజ్ సన్నివేశాలతో మాస్ యాటిట్యూడ్‌ నిండిన టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ వదిలారు. అదేంటంటే..

Also Read- Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు..ఆ అవార్డు డబ్బులు మొత్తం విరాళంగా ఇచ్చిన మెగాస్టార్!

పవర్ ఫుల్ పోస్టర్‌తో రిలీజ్ డేట్..

Advertisement

ఈ వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగాఈ సినిమాను ఏప్రిల్ 17న (Bad Boy Karthik Release Date) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో చేతిని పైకెత్తి పిడికిలి బిగించి పవర్ ఫుల్ లుక్‌లో నాగ శౌర్య కనిపిస్తున్నారు. ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం మరింత క్యురియాసిటీని పెంచుతోంది. ఈ సినిమా కచ్చితంగా తనకు విజయాన్ని ఇస్తుందని నాగ శౌర్య నమ్మకంగా చెబుతున్నారు. మేకర్స్ కూడా ఇందులో మంచి కథ, కంటెంట్ ఉన్నాయని, ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతాయని చెబుతున్నారు. మరి వారనుకున్న విజయం వరిస్తుందో, లేదో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read- Chiranjeevi: శ్రీరామనవమి, చరణ్ బర్త్‌డే.. చిరు ఏం చేశారో చూశారా? వీడియో వైరల్!

థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్ క్లోజ్

Advertisement

ఇక ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను జీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం సినిమాల డీల్స్ కష్టంగా మారిన సమయంలో ఈ సినిమా కోసం ఇంత త్వరగా డీల్ క్లోజ్ అవడం, సినిమా కంటెంట్‌పై ఉన్న బలమైన నమ్మకాన్ని తెలియజేస్తోంది. జీ స్టూడియోస్‌‌తో ఈ భాగస్వామ్యం సినిమా క్రెడిబిలిటీని పెంచడమే కాకుండా, రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను కూడా తీసుకువచ్చిందని చెప్పొచ్చు. నాగ శౌర్య సరసన విధి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఆరెంజ్’ ఫేమ్ హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read- Trisha -Vijay: త్రిష – విజయ్ వివాదంలోకి మరో హీరో మాజీ భార్య.. హాట్ టాపిక్ గా మారిన పోస్ట్!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×