E-Paper
Advertisement

Best countertop dishwasher: బడ్జెట్ ధరలో ‘డిష్‌వాషర్’ కొనాలనుకుంటున్నారా? మీ వంటింటికి ఇవే పర్ఫెక్ట్!

Best countertop dishwasher: బడ్జెట్ ధరలో ‘డిష్‌వాషర్’ కొనాలనుకుంటున్నారా? మీ వంటింటికి ఇవే పర్ఫెక్ట్!
Advertisement

Best countertop dishwasher: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్‌లో రోజువారీ పనులు చేయడం చాలా మందికి కష్టంగా మారింది. ముఖ్యంగా వంట పాత్రలు శుభ్రం చేయడం సమయం తీసుకునే పని. ఈ సమస్యకు పరిష్కారంగా చిన్న డిష్‌వాషర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి చిన్న  వంటగదుల్లో కూడా సులభంగా అమర్చుకోవచ్చు. తక్కువ నీటితో కూడా గట్టి నూనె, మసాలా మరకలను వీటితో తొలగించగలవు. భారతీయ వంటకాలకు అనుగుణంగా రూపొందించిన ఈ వస్తువులకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

3 బెస్ట్ డిష్ వాషర్లు:
చిన్న కుటుంబాలకు అనువైన చిన్న పరిమాణంలోని డిష్‌వాషర్లకు ప్రస్తుతం మరింత డిమాండ్ పెరిగింది. వీటికి చిన్న స్థలం సరిపోతుంది. అంతే కాకుండా ఇవి తక్కువ నీటితోనే పాత్రలను చాలా బాగా క్లీన్ చేస్తాయి. మన వంటల్లో ఉపయోగించే నూనె, మసాలా ఎక్కువగా ఉండే పాత్రలను శుభ్రం చేయడానికి  ప్రత్యేకంగా వీటిని రూపొందించారు.

Advertisement

Voltas Beko Dishwasher:
వోల్టాస్ బెకో 8 ప్లేస్ సెట్టింగ్ చిన్న కుటుంబాలకు చాలా బాగా సరిపోతుంది. ముగ్గురు లేదా నలుగురు ఉన్న కుటుంబాలకు ఇది బెస్ట్. ఇందులో ఆరు రకాల శుభ్రపరిచే విధానాలు ఉండటం వల్ల వేర్వేరు పాత్రలను సులభంగా శుభ్రం చేయొచ్చు. గట్టిగా అంటుకున్న నూనె మరకలను తొలగించడంలో ఇది బెస్ట్. కరెంట్ తక్కువగా వాటడం, మిషన్ కూడా చిన్నగా ఉండటం దీని ప్రత్యేకతలు.

Faber 8 Place Dishwasher :
ఇది మరింత ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో ఎనిమిది రకాల శుభ్రపరిచే విధానాలు ఉండటం వల్ల చాలా బాగా పనిచేస్తుంది.జిడ్డు మసాలా మరకలున్న పాత్రలను శుభ్రం చేయడానికి ప్రత్యేక విధానం కూడా ఇందులో అందుబాటులో ఉంది.ఎక్కువ కాలం పాడవకుండా ఉండే ఈ మెషిన్  తుప్పు రాకుండా ఉంటుంది. ఎక్కువగా వంట చేసే కుటుంబాలకు ఇది బెస్ట్.

Advertisement

Godrej Eon Dishwasher 8 Place Setting:
ఇది తక్కువ ధరలో లభిస్తుంది. అంతే కాకుండా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. ఇందులో ఏడు రకాల శుభ్రపరిచే విధానాలు ఉండటం వల్ల రోజువారీ అవసరాలకు బెస్ట్ అని చెప్పొచ్చు. నీటి వాడకాన్ని తగ్గించే విధంగా రూపొందించిన ఈ మిషన్ మెటల్ తొందరగా పాడవదు.

Also Read: రూ.1000లోపే అదిరిపోయే డిజిటల్ వెయింగ్ మెషీన్స్.. క్వాలిటీలో తగ్గేదే లే!

ఉపయోగాలు:
ఈ చిన్న డిష్‌వాషర్లు వంటగదిలో తక్కువ స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తాయి. రోజూ పాత్రలు కడగడానికి వాడే సమయాన్ని తగ్గిస్తాయి. చేతులతో కడగాల్సిన అవసరం తగ్గిపోవడంతో.. శ్రమ కూడా తగ్గుతుంది. అదనంగా నీటి వాడకాన్ని తగ్గించడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు, చిన్న కుటుంబాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

ముఖ్య లక్షణాలు:
ప్రతి పాత్ర కూడా సమానంగా శుభ్రం అవుతుంది. వేర్వేరు అవసరాలకు అనుగుణంగా అనేక శుభ్రపరిచే విధానాలు అందుబాటులో ఉంటాయి. ట్యాప్ కనెక్షన్ చేసుకునే సౌకర్యం ఉండటం వల్ల ఈజీగా పని చేస్తుంది. చిన్నగా ఉండటం వల్ల స్థలాన్ని ఆదా చేస్తుంది.

ధర:
పదిహేనువేల నుంచి ఇరవైమూడు వేల రూపాయల మధ్యలో ఈ మెషీన్లు లభిస్తున్నాయి.

Related News

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

Big Stories

Advertisement
×