E-Paper
Advertisement

Tiny Robots: వైద్య రంగంలో కీలక ముందడుగు.. బ్రెయిన్ స్ట్రోక్‌ను ఓడించడానికి మైక్రో రోబోట్స్ సిద్ధం!

Tiny Robots: వైద్య రంగంలో కీలక ముందడుగు.. బ్రెయిన్ స్ట్రోక్‌ను ఓడించడానికి మైక్రో రోబోట్స్ సిద్ధం!
Advertisement

Tiny Robots: భయంకరమైన ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. ఇది వచ్చినప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి. లేదంటే.. ప్రాణం దక్కే అవకాశం చాలా తక్కువ. అయితే, భవిష్యత్తులో ఇలాంటి భయానక పరిస్థితికి చెక్ పెట్టే ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు స్విస్ శాస్త్రవేత్తలు. రక్త నాళాల్లో నుంచి ప్రవహించి మెదడులో రక్తం గడ్డకట్టిన ప్రదేశానికి చేరి స్ట్రోక్‌ను నివారించగల మైక్రో రోబోట్లను తయారు చేశారు.

నిమిషాల్లో ఫలితం:

ఈ మైక్రో రోబోట్స్‌ను చేతిభాగం లేదా తొడభాగం నుంచి ఒక చిన్న ఇంజెక్షన్ లాంటి సూది ద్వారా రక్తంలోకి వదిలేస్తారు. ఆ తర్వాత అవి రక్తంతో పాటే ప్రయాణిస్తూ మెదడులోని రక్తం గడ్డకట్టిన చోటికి చేరుకుంటాయి. గడ్డను భౌతికంగా పగలగొట్టడం ద్వారా కేవలం నిమిషాల్లోనే మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తాయి.

ఎలా పనిచేస్తాయి?

Advertisement

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు చికిత్స అందిండచంలో ఆలస్యమైతే మెదడు కణాలు చనిపోతాయి. అయితే, సైంటిస్టులు కొత్తగా డెవలప్ చేసిన మైక్రో రోబోట్లు ఆ గోల్డెన్ అవర్‌ను దాదాపు ఇన్‌స్టంట్‌గా మార్చగలవు. ప్రస్తుతం పరిస్థితి ప్రకారమైతే.. స్ట్రోక్ రాగానే చికిత్స కోసం వెంటనే అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రికి తీసుకెళ్లి, క్యాథెటర్ లేదా ఆపరేషన్ ద్వారా గడ్డ తొలగించాలి. దీనికోసం గంటల సమయం పట్టవచ్చు. కానీ ఈ కొత్త టినీ రోబోట్లు రక్తనాళాల్లోని అతి చిన్న భాగాలకు కూడా చేరుకోవడం, క్యాథెటర్ చేరలేని ప్రాంతాల్లోనూ చేరి మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడంవల్ల డెత్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ప్రాథమిక పరీక్షల్లోనూ ఈ రోబోట్లు రియల్ టైమ్‌లో నావిగేట్ అవుతూ, గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించినట్టు తేలింది.

కీలక ముందడుగు:

ఈ మైక్రో రోబోట్స్ రాబోయే రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో కీలకపాత్ర పోషించనున్నాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు. అలాగే, అంబులెన్స్‌లలో, గ్రామీణ క్లినిక్‌లలో, హైవేలపై పోర్టబుల్ స్ట్రోక్ యూనిట్లలో వీటిని అందుబాటులో ఉంచడం వల్ల బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్స్ వల్ల సంభవించే మరణాలను చాలావరకు అడ్డుకోవచ్చని చెబుతున్నారు. ప్రపంచ వైద్య రంగంలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×