E-Paper
Advertisement

Metro Rail Suspended: మెట్రో రైలు పైకెక్కి కూర్చున్న కుర్రాడు, గంటల తరబడి సర్వీసులు బంద్..

Metro Rail Suspended: మెట్రో రైలు పైకెక్కి కూర్చున్న కుర్రాడు,  గంటల తరబడి సర్వీసులు బంద్..
Advertisement

Viral Video: కొంత మంది మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు, లేదంటే చనిపోవాలని నిర్ణయించుకున్న వ్యక్తులు రైళ్లు మీదికి ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకున్న సందర్భాలు చూశాం. కారణం ఏదైనా అక్కడి కాలి బూడిదయ్యారు కూడా. తాజాగా ఓ కుర్రాడు ఇంచుమించు ఇలాంటి పనే చేశాడు. కాకపోతే, అతడు లేచిన టైమ్ బాగుండి, ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ,  మెట్రో రైలు సర్వీసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.

కోచ్ ల మధ్య నిలబడి మెట్రో ప్రయాణం

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ కుర్రాడు మెట్రో రైలు పైకి ఎక్కాడు. ఒక్కసారిగా ఆందోళనకు గురైన అధికారులు వెంటనే, మెట్రోకు కరెంటు సరఫరా నిలిపివేశారు. మెట్రో సేవలు నిలిచిపోయాయి. ఇంతకీ ఆ అబ్బాయి ఎందుకు పైకి ఎక్కాడు? అని అధికారులు ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవవానికి ఆ కుర్రాడు, రెండు బోగీల మధ్య నిలబడి రైలు ప్రయాణం చేసినట్లు గుర్తించారు. భద్రతా సిబ్బంది అతడిని గుర్తించడంతో భయంతో పైకి ఎక్కాడు. అసలు ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు అని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా, TSC దగ్గర రైలు ఎక్కి, అగర్గావ్‌కు ప్రయాణించాడు. సెక్రటేరియట్ స్టేషన్‌కు చేరుకునే ముందు కోచ్‌ల మధ్య నిలబడి వెళ్లాడు. అదే సమయంలోనే భద్రతా సిబ్బంది అతడిని గమనించడంతో రైలు పైకి ఎక్కినట్లు సెక్రటేరియట్ స్టేషన్ అధికారులు తెలిపారు.

తప్పిన ప్రాణాపాయం

Advertisement

రైలు ముందుకు కదలకుండా ఆగడం, అతడు ఎలక్ట్రికల్ లైనును తగలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ అతడు విద్యుత్ వైర్లకు తగిలి ఉంటే, అక్కడికక్కడే బూడిద అయ్యేవాడని అధికారులు తెలిపారు. ఢాకా మాస్ రాపిడ్ ట్రాన్సిట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ సంస్థ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ లో బాలుడు బోగీల మధ్య వంగి ఉన్నట్లు కనిపించింది. సిబ్బంది అతడి దగ్గరికి చేరే సరికి రైలు పైకి ఎక్కినట్లు ఉంది. ఆ తర్వాత అతడిని నిచ్చెన ద్వారా భద్రతా సిబ్బంది కిందికి దింపారు.

మెట్రో అధికారులు ఏమన్నారంటే?

Advertisement

ఈ ఘటనపై ఢాకా మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ (DMTCL) మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ ఫరూక్ అహ్మద్ కీలక విషయాలు వెల్డించారు. అతడికి కరెంటు తీగల తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఒకవేళ లైన్ కు ఆని ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదన్నారు. ఈ ఘటన కారణంగా ఆదివారం రాత్రి 8:05 గంటలకు మెట్రో రైలు లైన్ 6లో రైలు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో ఎంతో ప్రయాణీకులు ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. ఆ అబ్బాయిని సురక్షితంగా కిందికి దింపిన తర్వాత మెట్రో సేవలు ప్రారంభించినట్లు ఫరూక్ చెప్పారు. అనంతరం బాలుడిని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

Read Also: నేవీ ఆఫీసర్ భార్యను రైల్లో నుంచి తోసి చంపిన టీసీ, ఇదీ అసలు కథ!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×