E-Paper
Advertisement

మోడరన్ ఉమెన్స్ కోసం టైటాన్ నుంచి సూపర్ స్టైలిష్ వాచ్.. చూస్తే చూపు తిప్పుకోలేరు

మోడరన్ ఉమెన్స్ కోసం టైటాన్ నుంచి సూపర్ స్టైలిష్ వాచ్.. చూస్తే చూపు తిప్పుకోలేరు
Advertisement

Titan Orbis Smartwatch: నేటి తరం మహిళలు ఫ్యాషన్‌తో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెంచుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాచ్ తయారీ సంస్థ ‘టైటాన్’, మహిళల కోసమే ప్రత్యేకంగా ‘టైటాన్ ఆర్బిస్’ (Titan Orbis) స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 9,999 ధరకు లభిస్తున్న ఈ వాచ్, స్టైలిష్ లుక్‌తో పాటు గాలి నాణ్యత , ఎండ తీవ్రతను కొలిచే యూవీ ఇండెక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. అద్భుతమైన అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ వాచ్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టైటాన్ ఆర్బిస్ స్పెషల్ ఫీచర్లు:

1.ఫ్యాషన్,టెక్నాలజీ :
సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లు స్పోర్టీ లుక్‌లో ఉంటాయి. కానీ టైటాన్ ఆర్బిస్ మాత్రం మహిళలకు నచ్చేలా చాలా డెలికేట్ , ప్రీమియం డిజైన్‌తో రూపొందించబడింది. ఇందులో ఉన్న 1.62 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే అత్యంత స్పష్టమైన రంగులను అందిస్తుంది. మీరు ఎండలో ఉన్నా సరే.. డిస్‌ప్లేలోని అక్షరాలు చాలా క్లియర్ గా కనిపిస్తాయి.

Advertisement

లూనా వెల్‌నెస్:
ఈ వాచ్‌లోని ప్రధాన ఆకర్షణ ‘లూనా వెల్‌నెస్ ఫీచర్. ఇది మహిళల పీరియడ్ సైకిల్, నిద్ర, ఒత్తిడి స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది. ఇది కేవలం స్టెప్స్ లెక్కించడం మాత్రమే కాకుండా.. శరీరంలోని కీలక మార్పులను పసిగట్టి అలెర్ట్ చేస్తుంది.

ఎన్విరాన్మెంటల్ అవేర్‌నెస్:
చాలా తక్కువ స్మార్ట్‌వాచ్‌లలో కనిపించే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

UV ఇండెక్స్: మీరు బయట ఎండలో ఉన్నప్పుడు అతినీలలోహిత కిరణాల తీవ్రత ఎంత ఉందో ఇది చెబుతుంది. దీని వల్ల మీ చర్మానికి తగిన రక్షణ తీసుకోవాలో లేదో నిర్ణయించుకోవచ్చు.

AQI ఇండెక్స్: మీరు ఉన్న ప్రాంతంలో గాలి కాలుష్యం ఎంత ఉందో ఇది చూపిస్తుంది. ఆరోగ్య స్పృహ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడే ఫీచర్.

ఆనిమేటెడ్ వాచ్ ఫేసెస్ & QR హబ్:
బోరింగ్ వాచ్ ఫేసెస్ కి స్వస్తి చెబుతూ.. టైటాన్ ఇందులో ‘ఆనిమేటెడ్ వాచ్ ఫేసెస్’ను ప్రవేశపెట్టింది. ఇవి వాచ్‌కి జీవం పోస్తాయి. అలాగే ‘QR హబ్’ ఫీచర్ ద్వారా మీ పేమెంట్ కోడ్స్ లేదా సోషల్ మీడియా ప్రొఫైల్ కోడ్లను వాచ్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయాలన్నా లేదా పేమెంట్ చేయాలన్నా ఫోన్ తీయాల్సిన అవసరం లేదు.

Also Read: రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు పెరగకూడదా? రిమోట్‌లో ఈ ‘సీక్రెట్’ బటన్ నొక్కండి చాలు !

ముఖ్యమైన స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 1.62″ AMOLED స్క్రీన్.

ధర: రూ. 9,999.

స్మార్ట్ ఫీచర్లు: బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్.

హెల్త్ ట్రాకింగ్: హార్ట్ రేట్, SpO2, స్ట్రెస్ మానిటరింగ్.

బ్యాటరీ: ఒకసారి ఛార్జ్ చేస్తే  5-7 రోజుల పాటు వస్తుంది.

మీరు రూ. 10వేల బడ్జెట్‌లో ఒక బ్రాండెడ్, స్టైలిష్ , హెల్త్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ కోసం చూస్తుంటే.. ‘Titan Orbis’ ఒక అద్భుతమైన ఆప్షన్. కేవలం టెక్ గ్యాడ్జెట్‌లా కాకుండా ఒక ఆభరణంలా కనిపించే ఈ వాచ్, మోడరన్ ఉమెన్‌కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×