Top 10 Mixer Grinders India 2026: ఇంట్లో వంట వేగంగా.. సింపుల్‌గా చేసుకోవాలంటే మిక్సర్ గ్రైండర్ తప్పనిసరి. చట్నీ నుంచి మసాలా వరకు అన్ని పనులు నిమిషాల్లో పూర్తి చేసే ఈ వస్తువు ఇప్పుడు మరింత అడ్వాన్స్ అయింది. 2026లో మార్కెట్లో కొత్త ఫీచర్లు, పవర్‌ఫుల్ మోటార్స్‌తో వచ్చిన మోడల్స్ చాలా ఉన్నాయి. ఏది బెస్ట్ ? ఏది మీ బడ్జెట్‌కు సరి పోతుంది? అన్న ప్రశ్నలకు క్లియర్ సమాధానం కోసం.. టాప్ 10 మిక్సర్ గ్రైండర్స్ లిస్ట్‌ను సింపుల్‌గా తెలుసుకుందాం.
ప్రస్తుతం మార్కెట్లో మిక్సర్ గ్రైండర్స్ ఎన్నో ఉన్నా.. వాటి పని తీరు, ధరతో పాటు మరి కొన్ని అంశాలను చూసి మంచి మిక్సల్ గ్రైండర్ ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం కింద ఇచ్చిన టాప్ 10 మోడల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.
1. Bajaj Rex 750W: (ధర-3,800)
బడ్జెట్‌లో మంచి ఆప్షన్. స్టెయిన్‌లెస్ స్టీల్ జార్స్ వల్ల ఎక్కువ కాలం వాడుకోవచ్చు. చిన్న కుటుంబాలకు కూడా ఇది బెస్ట్.
2. Orient Electric Kitchen Mixer Grinder: (ధర-4,200 )
నికెల్ ప్లేటెడ్ బ్లేడ్స్‌తో వస్తుంది. ఇవి ఎక్కువ కాలం షార్ప్‌గా ఉండి మంచి గ్రైండింగ్ ఇస్తుంది.
3. Butterfly Smart Mixer Grinder: (ధర- 4,500 )
షాక్‌ప్రూఫ్ ABS బాడీతో సేఫ్టీ ఎక్కువ. రోజువారీ వాడుకకు ఇది చాలా బాగుంటుంది.
4. Havells Aspro Plus: ( ధర-4,900 )
జార్‌లో ఫ్లో బ్రేకర్స్ ఉండటంతో ఫైన్ గ్రైండింగ్ వస్తుంది. డిజైన్ కూడా మోడ్రన్‌గా ఉంటుంది.
5. Prestige Delight 750W:( ధర-5,100)
హెవీ డ్యూటీ మోటార్‌తో కఠినమైన పదార్థాలనూ సులభంగా గ్రైండ్ చేస్తుంది.
6. Philips HL7756/00: (ధర-5,500)
టర్బో మోటార్ టెక్నాలజీతో ఓవర్‌లోడ్ లేకుండా పని చేస్తుంది. బ్రాండ్ నమ్మకం కూడా ఉంది.
7. Sujata Dynamix DX:(ధర-6,800)
900W పవర్‌ఫుల్ మోటార్‌తో హోటల్ లెవెల్ పని తీరు ఇస్తుంది. ఎక్కువగా ఉపయోగించే వారికి బెస్ట్.
8. Bosch TrueMixx Pro:(ధర-7,200)
స్టోన్ పౌండింగ్ టెక్నాలజీతో వస్తుంది. మసాలా గ్రైండింగ్‌కు అద్భుతం.
9. Preethi Zodiac 2.0:( ధర-11,500)
5-in-1 ఫంక్షన్స్‌తో మల్టీపర్పస్ యూజ్. జ్యూసింగ్, కట్టింగ్ ఒకే మెషిన్‌లో అందుబాటులో ఉంటాయి.
10. Kenwood Blend-X Pro:( ధర-13,000)
ట్రై-బ్లేడ్ సిస్టమ్‌తో స్మూత్ బ్లెండింగ్ ఇస్తుంది. హైఎండ్ మోడల్.
మిక్సర్ గ్రైండర్ ఎందుకు అవసరం?
మిక్సర్ గ్రైండర్ వంటింటి పనులను చాలా ఈజీ చేస్తుంది. చేతితో.. చేసే పనిని ఇది నిమిషాల్లో పూర్తి చేస్తుంది. టైమ్ సేవ్ అవుతుంది. శ్రమ కూడా తగ్గుతుంది.
కొనేప్పుడు గమనించాల్సిన విషయాలు:
మోటార్ పవర్: కనీసం 750W ఉంటే బెటర్.
జార్స్: స్టీల్ జార్స్ ఎక్కువకాలం ఉంటాయి.
సేఫ్టీ: ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఉండాలి.
వారంటీ: కనీసం 2 సంవత్సరాలు.
వాడుక: మీ అవసరానికి సరిపోయే మోడల్ ఎంచుకోండి.
Also Read: బెస్ట్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్స్ 2026..ఇండియాలో టాప్ 10 బ్రాండ్స్, లేటెస్ట్ ఫీచర్లు ఇవే !
ధరల విషయానికి వస్తే..
ఈ మోడల్స్ రూ. 3,800 నుంచి రూ. 13,000 వరకు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌ను బట్టి సెలక్ట్ చేసుకోవచ్చు.ఈఎంఐ ఆప్షన్స్ వల్ల కొనడం మరింత సులభం అయింది.
మీ కిచెన్‌లో మంచి మిక్సర్ గ్రైండర్ ఉంటే.. వంట పనులు చాలా సులభం అవుతాయి. పై టాప్ 10 లిస్ట్ మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయ పడుతుంది. మీ బడ్జెట్, అవసరం బట్టి సరైన మోడల్ ఎంచుకోండి.