E-Paper
Advertisement

Top 5 Feature Phones: వావ్, రూ.వెయ్యి లోపు ‘ఫీచర్ ఫోన్లు’ చూశారా? UPI పేమెంట్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!

Top 5 Feature Phones: వావ్, రూ.వెయ్యి లోపు ‘ఫీచర్ ఫోన్లు’ చూశారా? UPI పేమెంట్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!
Advertisement

Top 5 Feature Phones: నేటి టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ స్క్రీన్లు, ఏఐ కెమెరాలంటూ ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. అయితే, వీటన్నింటి మధ్యలోకి మరో విభాగం పుంజుకుంటోంది. అదే రూ.1,000 లోపు లభించే ఫీచర్ ఫోన్లు. ఇవి భారీ యాప్‌లు వాడటానికి , గంటల కొద్దీ వీడియోలు చూడటానికి పనికిరావు కానీ, బ్యాటరీ లైఫ్, కనెక్టివిటీ విషయంలో మాత్రం తిరుగులేదనే చెప్పాలి. ముఖ్యంగా ఇంట్లో ఉండే పెద్దలకు, పిల్లలకు లేదా సెకండరీ ఫోన్ కావాలనుకునే వారికి వీటిని కొనివ్వొచ్చు. ఈ నేపథ్యంలో జస్ట్ రూ.వెయ్యి లోపు అందుబాటులో ఉన్న టాప్-5 ఫోన్ల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

Nokia 105 Classic

నోకియా అంటేనే మన్నికకు మారుపేరు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చిన మోడల్ ‘నోకియా 105 క్లాసిక్’. దీని ధర రూ.999. ఇది చూడటానికి చాలా సింపుల్‌గా, చేతిలో ఇమిడిపోయేలా ఉంటుంది. దీనిలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ బిల్ట్‌ఇన్ UPI యాప్. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా దీని ద్వారా డబ్బులు పంపడం, రిసీవ్ చేసుకోవడం సులభం. అప్పుడప్పుడూ టైం పాస్ అవ్వాలంటే.. స్నేక్ గేమ్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Advertisement

Also Read: మీ ఇంటి సీలింగ్‌కే ఏసీ.. లివింగ్ రూమ్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్, ధర ఎంతంటే?

Jio Bharat V4

జియో నుంచి వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ.799 మాత్రమే. తక్కువ ధరలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు దీనిని ఎంచుకోవచ్చు. దీనిలో జియో టీవీ ద్వారా 455 లైవ్ ఛానెళ్లను చూడొచ్చు. అంతేకాదు.. జియో సావన్ ద్వారా పాటలు వినవచ్చు. దీంతోపాటు Jio Pay UPI సిస్టమ్ కూడా ఉంది. చిరు వ్యాపారస్తులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే.. ఎవరైనా డబ్బులు పంపినప్పుడు ఇది సౌండ్ బాక్స్ లాగా వాయిస్ అలర్ట్ ఇస్తుంది.

Micromax X1i Smart Plus

Advertisement

స్ట్రాంగ్‌గా ఉండే ఫోన్ కావాలనుకునే వారు ఈ ‘మైక్రోమాక్స్ X1i స్మార్ట్ ప్లస్’ను కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ.998. దీనిలో 2.4 ఇంచుల పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల మెసేజ్‌లు చదవడం ఈజీగా ఉంటుంది. దీని 1750 mAh బ్యాటరీ చాలాకాలం పాటు ఛార్జింగ్ ఇస్తుంది. సాధారణంగా ఫీచర్ ఫోన్లలో కనిపించని యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్, డిజిటల్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండటం విశేషం.

HMD 105

ఈ హెచ్‌ఎండి 105 మోడల్ రూ.974కే లభిస్తోంది. దీనిలో ఫోన్ టాకర్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఇది స్క్రీన్‌పై ఉన్న విషయాలను చదివి వినిపిస్తుంది. కంటి చూపు సమస్య ఉన్నవారికి ఈ ఫీచర్ ఎంతో మేలు చేస్తుంది. అలాగే వైర్‌లెస్ ఎఫ్ఎమ్, యూపీఐ సపోర్ట్ వంటి సౌకర్యాలతో పాటు కంపెనీ దీనిపై ఏడాది పాటు రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ కూడా ఇస్తోంది.

Lava A1 Clear Copper

రూ.949కే అందుబాటులో ఉన్న ఈ లావా A1 క్లియర్ కాపర్ ఫోన్ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. దీనిలో ఏఐ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ టెక్నాలజీ ఉండటంతో ఇది మనం ఫోన్ వాడే విధానాన్ని బట్టి పవర్ సేవ్ చేస్తుంది. ఎక్కువ గంటలు ఛార్జింగ్ ఉండాలనుకుంటే కళ్లు మూసుకుని ఈ ఫోన్ కొనొచ్చు. టెక్నాలజీని సామాన్యులకు చేరువ చేస్తూ, డిజిటల్ పేమెంట్లను సులభతరం చేస్తున్న ఈ ఫోన్లను తక్కువ ధరకే అందించడం నిజంగానే అభినందనీయం.

Also Read: ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే.. కరెంటు పోయినా ఏసీ చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×