E-Paper
Advertisement

ఇల్లు ఐస్ ముక్కలా అయిపోవాల్సిందే! కరెంట్ బిల్లు తగ్గించే 3 స్టార్, 5 స్టార్ ఏసీ మోడల్స్!

ఇల్లు ఐస్ ముక్కలా అయిపోవాల్సిందే! కరెంట్ బిల్లు తగ్గించే 3 స్టార్, 5 స్టార్ ఏసీ మోడల్స్!
Advertisement

Top Rated 1.5 Ton AC: మే నెల వచ్చేసిందంటే చాలు.. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో బయట అడుగుపెట్టాలంటేనే భయమేస్తోంది. ఇక ఇంట్లో కూడా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు జనం? ఇలాంటి సమయంలో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లో ఒక మంచి ఏసీ ఉండటం చాలా ముఖ్యం. మరి మార్కెట్లో వందల మోడల్స్ ఉండగా ఏది కొనాలో అర్థం కావడం లేదా? డోంట్ వర్రీ. లేటెస్ట్ టెక్నాలజీతో అమెజాన్‌లో దూసుకుపోతున్న టాప్-రేటెడ్ 3 స్టార్, 5 స్టార్ స్ప్లిట్ ఏసీల లిస్ట్, స్మార్ట్ ఫీచర్లు, తక్కువ కరెంట్ బిల్లుతో కూలింగ్ ఇచ్చే ఆ బెస్ట్ ఏసీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కరెంట్ బిల్లు ఆదా చేసే టాప్ 5 స్టార్ స్ప్లిట్ ఏసీలు:

Advertisement

1. Panasonic 1.5 Ton 5 Star Wi-Fi Inverter Split AC:
స్మార్ట్ ఫీచర్లు ఇష్టపడే వారికి ఇది ఫస్ట్ ఛాయిస్. దీనిలోని ‘Matter’, ‘MirAie’ యాప్ సపోర్ట్‌తో ఏసీని ఫోన్ లేదా స్మార్ట్ వాచ్‌తో కంట్రోల్ చేయవచ్చు. దీని 5.8 ISEER రేటింగ్ వల్ల కరెంట్ చాలా ఆదా అవుతుంది.

ధర: రూ.43,990
2. LG 1.5 Ton 5 Star AI Dual Inverter Split AC:
ఎల్‌జీ బ్రాండ్‌కు ఇండియాలో తిరుగులేదు. ఇందులో ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1 మోడ్స్ ఉన్నాయి. అంటే గదిలో ఉన్న జనాన్ని బట్టి కూలింగ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైగా 4-వే ఎయిర్ స్వింగ్ గది నలుమూలలా చల్లదనాన్ని ఇస్తుంది.

Advertisement

ధర: రూ. 44,990

3. Daikin 1.5 Ton 5 Star Inverter Split AC:
డైకిన్ ఏసీలు లాంగ్ లైఫ్ , హెవీ కూలింగ్‌కు కేరాఫ్ అడ్రస్. లేటెస్ట్ వైజూ సిరీస్ మోడల్స్ 3D ఎయిర్‌ఫ్లోతో వస్తున్నాయి. 52 డిగ్రీల ఎండలో కూడా ఇది గదిని చల్లగా ఉంచుతుంది.

ధర: రూ. 45,490

4. Lloyd 1.5 Ton 5 Star Inverter Split AC (Sapphire Series):
హ్యావెల్స్ సంస్థకు చెందిన లాయిడ్ ఏసీలు ప్రీమియం లుక్‌తో వస్తాయి. ఇందులో పీఎం 2.5 ఫిల్టర్ ఉండటం వల్ల గాలిలోని దుమ్మును క్లీన్ చేస్తుంది. దీని స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ ఇస్తుంది.

ధర: రూ.39,990
5. Godrej 1.5 Ton 5 Star Inverter Split AC:
తక్కువ బడ్జెట్‌లో 5 స్టార్ ఏసీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఐ-సెన్స్ (i-Sense) టెక్నాలజీతో మీ చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతను బట్టి ఇది కూలింగ్ ఇస్తుంది.

ధర: రూ.34,000

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే టాప్ 3 స్టార్ స్ప్లిట్ ఏసీలు :

6. Voltas 1.5 Ton 3 Star Inverter Split AC (Vertis Elite):
ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ వోల్టాస్. ఇందులో యాంటీ-ఫ్రీజ్ థర్మోస్టాట్ , 4-ఇన్-1 అడ్జస్టబుల్ మోడ్స్ ఉన్నాయి. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది.

ధర: రూ.32,990

7. Carrier 1.5 Ton 3 Star Flexicool Split AC:
క్యారియర్ ఏసీలో ఫ్లెక్సికూల్ టెక్నాలజీ ఉంది. ఇది కరెంట్ ఖర్చును 50% వరకు తగ్గించుకునే సదుపాయాన్ని ఇస్తుంది. ఇన్ స్టా కూల్ ఫీచర్‌తో ఆన్ చేయగానే నిమిషాల్లో రూమ్ కూల్ అవుతుంది.

ధర: రూ.32,990

8. Whirlpool 1.5 Ton 3 Star Magicool Inverter AC:
ఇందులోని 6th సెన్స్ టెక్నాలజీ రూమ్ టెంపరేచర్‌ను ఆటోమేటిక్‌గా రీడ్ చేసి సూపర్ కూలింగ్ ఇస్తుంది.దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ.

ధర: రూ.31,500
9. Blue Star 1.5 Ton 3 Star Inverter Split AC:
బ్లూ స్టార్ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. హెప్టా సెన్సార్స్ , స్మార్ట్ డయాగ్నసిస్ ఫీచర్లతో వచ్చే ఈ ఏసీ గదిని చాలా ఫాస్ట్‌గా ఐస్ రూమ్‌లా మార్చేస్తుంది.

ధర: రూ.35,970

Also Read: మీ ఇల్లు, ఆఫీస్ సేఫ్టీకి ఏది బెస్ట్? సీసీటీవీ సిస్టమ్స్ కొనే ముందు తెలుసుకోవాల్సిన నిజాలు!

10. Hitachi 1.5 Ton 3 Star Xpandable+ Inverter AC:
హిటాచీ ‘ఎక్స్‌పాండబుల్ ప్లస్’ టెక్నాలజీ గదిలో ఉక్కపోత పెరిగినప్పుడు కంప్రెసర్ సామర్థ్యాన్ని ఆటోమేటిక్‌గా పెంచుతుంది. ఐస్ క్లీన్ ఫీచర్‌తో ఏసీ కాయిల్స్ దానంతట అదే క్లీన్ చేసుకుంటుంది.

ధర: రూ.32,999

ఏది కొనాలి? 3 స్టారా.. 5 స్టారా?
మీరు రోజుకు 4 నుంచి 5 గంటలు మాత్రమే ఏసీ వాడితే 3 స్టార్ ఏసి సరిపోతుంది.బడ్జెట్ కూడా కలిసి వస్తుంది. ఒకవేళ మీరు రోజంతా లేదా రాత్రంతా (8 గంటల కంటే ఎక్కువ) ఏసీ ఆన్‌లోనే ఉంచేలా అయితే కచ్చితంగా 5 స్టార్ ఏసీకి వెళ్ళండి. ఇది మొదట్లో కాస్త కాస్ట్లీ అనిపించినా, లాంగ్ రన్‌లో మీ కరెంట్ బిల్లును సగం తగ్గించి మీ డబ్బును ఆదా చేస్తుంది.

పైన పేర్కొన్న ధరలు అమెజాన్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లను బట్టి మారుతుండొచ్చు. కాబట్టి కొనే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×