E-Paper
Advertisement

మీ ఇల్లు, ఆఫీస్ సేఫ్టీకి ఏది బెస్ట్? సీసీటీవీ సిస్టమ్స్ కొనే ముందు తెలుసుకోవాల్సిన నిజాలు!

మీ ఇల్లు, ఆఫీస్ సేఫ్టీకి ఏది బెస్ట్? సీసీటీవీ సిస్టమ్స్ కొనే ముందు తెలుసుకోవాల్సిన నిజాలు!
Advertisement

Best Security Camera 2026: ప్రస్తుత కాలంలో సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికీ అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మారింది. ఇల్లు, వ్యాపార సంస్థలు లేదా ఆఫీసుల కోసం సీసీటీవీ (CCTV) కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే మార్కెట్లోకి వెళ్తే కొన్ని వందల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ధర పలికే వివిధ రకాల కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ధర ఉండే హై-ఎండ్ (High-End) సీసీ కెమెరా సిస్టమ్స్ కొనడం నిజంగానే అంత అవసరమా? ఆ పెట్టుబడి ఎంతవరకు సేఫ్? అనే విషయాలను ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

సీసీటీవీ కొనేముందు తెలుసుకోవాల్సినవి:

సాధారణ కెమెరాలకు, హై-ఎండ్ సిస్టమ్స్‌కు గల తేడాలు:
చాలా మంది తక్కువ ధరకు దొరికే సాధారణ లోకల్ కెమెరాలను కొంటుంటారు. ఇవి కేవలం విజువల్స్ రికార్డ్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ.. నేరస్థులు వీటిని ఈజీగా హ్యాక్ చేయడం లేదా వైర్లను కట్ చేయడం చేయవచ్చు. అదే హై-ఎండ్ సీసీటీవీ సిస్టమ్స్ ఎక్కువ రక్షణను ఇస్తాయి. వీటిలో 4K లేదా 8K అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే క్వాలిటీ ఉంటుంది. దీని వల్ల చాలా దూరం నుంచి అయినా సరే వ్యక్తుల ముఖాలను, వాహనాల నంబర్ ప్లేట్లను స్పష్టంగా గుర్తించవచ్చు. సాధారణ కెమెరాల్లో నైట్ విజన్ సరిగ్గా ఉండదు. కానీ ప్రీమియం కెమెరాలు చీకట్లో కూడా పగటిపూట లాంటి కలర్ విజువల్స్‌ను అందిస్తాయి.

Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ నిఘా:
లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం హై-ఎండ్ కెమెరాలలో ఏఐ ఫీచర్లు బిల్ట్-ఇన్ గా వస్తున్నాయి. ఇవి కేవలం రికార్డింగ్ చేయడమే కాకుండా.. ఒక సెక్యూరిటీ గార్డ్‌లా పని చేస్తాయి. ఫేషియల్ రికగ్నిషన్ (ముఖాలను గుర్తుపట్టడం), చొరబాట్లను గుర్తించడం వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు వీటి సొంతం. ఎవరైనా అపరిచిత వ్యక్తి మీ ఇంటి కాంపౌండ్‌లోకి అడుగుపెడితే.. ఈ కెమెరాలు వెంటనే మీ మొబైల్‌కు అలర్ట్ మెసేజ్ పంపుతాయి. అలాగే కుక్కలు, పిల్లులు తిరిగినప్పుడు వచ్చే ఫాల్స్ అలారమ్‌లను ఇవి ఏఐ ద్వారా ఫిల్టర్ చేయగలవు.

సైబర్ సెక్యూరిటీ, ఎన్‌క్రిప్షన్:
ఇంటర్నెట్‌తో పని చేసే స్మార్ట్ కెమెరాలకు హ్యాకింగ్ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరకే దొరికే కెమెరాల ఐపీ (IP) అడ్రస్‌లను హ్యాక్ చేసి, మీ ప్రైవేట్ విజువల్స్‌ను ఇతరులు చూసే ప్రమాదం ఉంది. కానీ హై-ఎండ్ సీసీటీవీ బ్రాండ్లు సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాయి. ఇవి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, అడ్వాన్స్డ్ ఫైర్‌వాల్స్ కలిగి ఉంటాయి. దీని వల్ల మీ అనుమతి లేకుండా కెమెరా ఫుటేజ్‌ను ఎవరూ యాక్సెస్ చేయలేరు. డేటా పరంగా చూసుకుంటే.. ఈ ఖరీదైన సిస్టమ్స్ పెట్టే పెట్టుబడి పూర్తిగా సమర్థించదగిందే.

Advertisement

Also Read: థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఏఐ టెక్నాలజీ.. ఈ ఏడాది టీవీల్లో ట్రెండ్ అవుతున్న ఫీచర్లు ఇవే!

ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే శక్తి:
హై-ఎండ్ కెమెరాలు ఐపీ67 (IP67) లేదా ఐపీ68 (IP68) వెదర్-ప్రూఫ్ రేటింగ్‌తో వస్తాయి. అంటే ఇవి ఎండ, దట్టమైన వాన,చలి,తుఫానులను సైతం తట్టుకుని నిరంతరాయంగా పని చేస్తాయి. వీటి బాడీ మెటీరియల్ కూడా యాంటీ-వాండల్ గా ఉంటుంది. ఎవరైనా దొంగలు కెమెరాను రాయి లేదా కర్రతో పగలగొట్టాలని చూసినా ఇవి అంత సులభంగా పాడవువు.

పెట్టుబడి న్యాయమైందేనా?
మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఒక చిన్న కిరాణా షాపు లేదా అంతగా ప్రాధాన్యత లేని ప్రదేశానికి సాధారణ కెమెరాలు సరిపోతాయి. కానీ మీ సొంత ఇల్లు, నగదు, విలువైన వస్తువులు ఉండే ఆఫీసులు, బంగారం షాపులు వంటి ప్రదేశాలలో మాక్సిమమ్ ప్రొటెక్షన్ కోసం హై-ఎండ్ సీసీటీవీ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. ఇది కేవలం ఒక ఖర్చు కాదు, భవిష్యత్తులో వచ్చే పెద్ద ముప్పుల నుంచి మిమ్మల్ని కాపాడే.. పెట్టుబడిగా భావించండి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×